By: ABP Desam | Updated at : 28 Jan 2022 08:49 AM (IST)
Edited By: RamaLakshmibai
karKarthika Deepam 28 January Episode (Image Credit: Star Maa/Hot Star)
కార్తీకదీపం జనవరి 28 శుక్రవారం ఎపిసోడ్
అమ్మానాన్నని చూశాను కానీ నీకు చెప్పలేదని కార్తీక్.. అత్తయ్యమావయ్యని చూశానని దీప.. చెబితే నువ్వు బాధపడతావంటే నువ్వుబాధపడతావని చెప్పలేదని ఇద్దరూ బయటపడతారు. గురువారం ఎపిసోడ్ దీంతో ముగిసింది. శుక్రవారం ఎపిసోడ్ కూడా దీప-కార్తీక్ డిష్కషన్ తో ప్రారంభమైంది. ఎందరికో వైద్యం చేసిన నేను అమ్మా నాన్నకి ఏమీ చేయలేకపోతున్నానని బాధపడతాడు కార్తీక్. రుద్రాణి అప్పు తీరిస్తే కానీ ఈ ఊరుదాటి వెళ్లలేం అని కార్తీక్ బాధపడుతుంటే.. బాధపడకండి అన్నీ సర్దుకుంటాయని చెబుతుంది దీప.
Also Read: శౌర్య అనారోగ్యం కార్తీక్ ని తల్లిదండ్రులకు దగ్గరయ్యేలా చేస్తుందా.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
మరోవైపు హిమ-శౌర్య ఇద్దరూ స్కిప్పింగ్ ఆడదాం అనుకుని దొరికిన తాళ్ల ముక్కలన్నీ కలపి రోప్ తయారు చేసుకుంటుండగా... కార్తీక్ వచ్చి వాళ్లకో రోప్ ఇస్తాడు. శౌర్య స్కిప్పింగ్ చేస్తూ రొప్పుతూ కిందపడిపోతుంది. శౌర్య గుండెకి హోల్ ఉండేది అప్పట్లో నేను సర్జరీ చేశాను..మళ్లీ అదేమైనా సమస్య అయిందా లేదా పెద్ద సమస్యే వచ్చిందా అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. దీప, హిమ ఏడుస్తూ ఉండగా..మీరు ఏడుపు ఆపండి వెంటనే శౌర్యని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి డబ్బులెంతున్నాయని అడుగుతాడు. సరిపడా డబ్బుల్లేకపోవడంతో కార్తీక్ ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళతాడు. మరోవైపు దీప కూడా పాత గుండె జబ్బు మళ్లీ అత్తమ్మకి తిరగబెట్టిందా అనుకుంటుంది.
Also Read: ఇకపై దేవయాని Vs జగతి-వసు… ఇప్పటి వరకూ ఓ లెక్క ఇకపై మరో లెక్క .. గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్
మరోవైపు రుద్రాణి...కార్తీక్ దీపని ఉద్దేశించి రెండు రోజుల్లో అప్పెలా తీరుస్తారు... అప్పు తీర్చకపోతే వాళ్లతో నా ఆట, వేట కొనసాగాలంటే వెళ్లి ఆ సార్ ని మర్యాదగా తీసుకురండి మిగిలిన కథన నేను నడిపిస్తా అంటుంది. మరోవైపు కార్తీక్ సైకిల్ పై ఫాస్ట్ గా ప్రకృతి ఆశ్రమానికి వెళుతుంటాడు. నేను డాక్టర్ ని నా రౌడీని రక్షించుకుంటాను.. శౌర్య ఆపరేషన్ కోసం మమ్మీ, డాడిని డబ్బులు అడగాలి అనుకుంటూ ప్రకృతి ఆశ్రమానికి బయలుదేరుతాడు. అయితే గురువారం ఎపిసోడ్ లో ప్రకృతి ఆశ్రమానికి సంబంధించిన వ్యక్తి.. ఆనందరావు దగ్గరకు వెళ్లి ఆశ్రమం నుంచి వేరే ఆశ్రమానికి వెళ్లాలని చెబితే సరే అని వాళ్లు వెళ్లిపోతారు. ప్రకృతి ఆశ్రమంలో ఉన్న వ్యక్తి కార్తీక్ కి అదే చెబుతాడు..మీలాంటి వాళ్లు పదే పదే వచ్చి ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతోనే వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు, అయినా డబ్బులు అవసరం వచ్చి వచ్చారా మీరు అవకాశవాదిలా ఉన్నారే అని వెళ్లగొడతాడు. దేవుడా ఇప్పుడు శౌర్యని ఎలా కాపాడుకోవాలి, డబ్బులు ఎవరిస్తారని బాధపడతాడు కార్తీక్.
Also Read: దేవయానికి భారీ షాకిచ్చిన రిషి, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
నాకు ఎలాగో అవుతోంది, నాన్న డాక్టరే కదా అని అడుగుతుంది శౌర్య. తగ్గిపోతుందిలే ఏదో చిన్న సమస్యే కదా అని దీప అంటే చిన్నది కాదు నాకు తెలుస్తోందంటుంది. నాన్న పెద్ద డాక్టర్ కదా నీకేం కాదని దీప చెబుతుంటే.. నాన్న డాక్టర్ అన్న విషయమే చెప్పొద్దన్నారు కదా అంటుంది. నేను మళ్లీ లేస్తానా, తమ్ముడితో ఆడుకుంటానా అంటే..నీకు ఏంకాదని సర్దిచెబుతుంది దీప.
రేపటి ఎపిసోడ్ లో
కార్తీక్ ఇంటికి వెళుతుండగా అడ్డుకున్న రుద్రాణి మనుషులు అడ్డుకుంటారు. ఎంత చెప్పినా వినకుండా రుద్రాణి దగ్గరకు తీసుకెళతారు. మరోవైపు దీప డాక్టర్ బాబు ఎక్కడున్నారని , సొంత కూతురికి వైద్యం చేయించుకునే అవకాశం లేదని బాధపడుతుంది. అటు హిమ...ఇప్పటికైనా నానమ్మ, తాతయ్యలకు కాల్ చేయి అమ్మా శౌర్యని హాస్పిటల్ కి తీసుకెళదాం అంటుంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Pavithra Lokesh: కావాలనే నన్ను బ్యాడ్ చేస్తున్నారు - పవిత్రా లోకేష్ ఎమోషనల్ కామెంట్స్
The warriorr Trailer: రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - యాక్షన్ పీక్స్
Anushka: ప్రభాస్ సినిమాలో అనుష్క - నిజమేనా?
Bimbisara: 'ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు' - 'బింబిసార' ట్రైలర్ గ్లింప్స్
Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్
Gold Rate Today 2nd July 2022: పసిడి ప్రియులకు బిగ్ షాక్, భారీగా పెరిగిన బంగారం ధర, దిగొచ్చిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ
Defence Ministry: ఆర్మీ, నేవీలో అగ్నిపథ్ నియామకాలు ప్రారంభం, ఎయిర్ పోర్స్ లో 2.72 లక్షల దరఖాస్తులు
Horoscope 2nd July 2022: ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉండదు, జులై 2 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
BJP PLenary Plan On TRS : తెలంగాణలో కాషాయజెండా పాతడమే లక్ష్యం ! బీజేపీ అత్యున్నత భేటీ వెనుక అసలు వ్యూహం ఇదే