Guppedantha Manasu జనవరి 27 ఎపిసోడ్: ఇకపై దేవయాని Vs జగతి-వసు… ఇప్పటి వరకూ ఓ లెక్క ఇకపై మరో లెక్క .. గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్
గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. అవకాశం ఉన్నప్పుడు కాదు ఆహ్వానం ఉన్నప్పుడే వెళ్లాలన్న జగతిని.. కొడుకు రిషి స్వయంగా ఇంటికి తీసుకెళ్లాడు. జనవరి 27 గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.
![Guppedantha Manasu జనవరి 27 ఎపిసోడ్: ఇకపై దేవయాని Vs జగతి-వసు… ఇప్పటి వరకూ ఓ లెక్క ఇకపై మరో లెక్క .. గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్ Guppedantha Manasu January 27th Episode358, Know In Details Guppedantha Manasu జనవరి 27 ఎపిసోడ్: ఇకపై దేవయాని Vs జగతి-వసు… ఇప్పటి వరకూ ఓ లెక్క ఇకపై మరో లెక్క .. గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/27/bf0415a391a7f9dada1e0fbe8e1f4c2a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తండ్రి మహేంద్ర కోసం ఓ మెట్టు దిగివచ్చిన రిషి... తల్లి జగతిని ఇంటికి రమ్మని పిలుస్తాడు. ఈ మాట విని జగతి ఆనందంలో మునిగిపోతుంది బుధవారం ఎపిసోడ్ ఇక్కడే ముగిసింది. గురువారం ఎపిసోడ్ ఇక్కడే మొదలైంది..ఇప్పుడే వెళుతున్నాం బయలుదేరండని చెబుతాడు రిషి. ఈ జన్మకి ఇది చాలు వసు అని జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. డాడ్ నీ సంతోషం కోసం ఏదైనా చేస్తానంటాడు రిషి. మరోవైపు ఇంటి దగ్గర ముగ్గులేస్తున్న ధరణిని నీకు కామన్ సెన్స్ లేదనుకున్నా కలర్ సెన్స్ కూడా లేదని దేవయాని సాధిస్తుంటుంది. ఇంతలో గౌతమ్ ముగ్గు చాలా బావుందని చెప్పడంతో..ఇది కూడా ముగ్గేనా, నేను రథం ముగ్గేస్తే ఊరంతా నోరెళ్లబెట్టేదని గొప్పలుపోతుంది. ఇంతలో మీరే వేయండని గౌతమ్ అనడంతో ఇరుక్కుపోయానంటూ తప్పించుకుంటుంది.
Also Read: శౌర్య అనారోగ్యం కార్తీక్ ని తల్లిదండ్రులకు దగ్గరయ్యేలా చేస్తుందా.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
ఇంటి బయట కారు ఆగుతుంది. ఇంతపొద్దున్నే రిషి ఎక్కడికి వెళ్లొచ్చాడని అనుకుంటూ కారు దగ్గరకు వెళుతుంది దేవయాని. జగతి, వసుధార కిందకు దిగడం చూసి షాక్ అవుతుంది. జగతిని ధరణి, వసుని చూసి గౌతమ్ సంతోషిస్తారు. భారీ షాక్ నుంచి తేరుకోలేక కొద్దిసేపు అలాగే ఉండిపోతుంది దేవయాని. సంక్రాంతికి మంచి గిఫ్ట్ ఇచ్చావ్ రా థ్యాంక్యూ అంటాడు గౌతమ్. దేవయాని దగ్గరకు వెళ్లిన ధరణి..అత్తయ్యగారు షాక్ లో ఉన్నారా అంటుంది. వీళ్ల లగేజ్ ని లోపలకు తీసుకెళ్లు అని గౌతమ్ చెబితే.. లగేజ్ ఏంట్రా ఏకంగా కార్ కూడా లోపల పడేస్తా అని ఆనందంగా చెబుతాడు గౌతమ్. లోపలకు రండి అని జగతిని రిషి పిలుస్తాడు... నువ్వేంటి పొద్దున్నే అని దేవయాని కోపంగా జగతిని అడిగితే..పెద్దమ్మా నేనే తీసుకొచ్చా అని సమాధానం చెబుతాడు రిషి. ఇంతలో గౌతమ్ అక్కడకు వచ్చి వదినా వీళ్లు లోపలకు వెళుతుంటే హారతి ఇవ్వడాలు, దిష్టి తీయడాలు ఉంటాయా అన్న గౌతమ్ తో దేవయాని కోపంగా ఆగు అంటుంది. రిషి ఏంటిది అని క్వశ్చన్ చేయడంతో..పెద్దమ్మ వివరాలు నేను తర్వాత చెబుతాను ఇప్పుడేం అడగకండి అని మరో షాకిస్తాడు. లోపలకు వెళ్లిన దేవయాని కోపంగా రగిలిపోతుంది. వదిన వీళ్లను లోపలకు తీసుకెళ్లండి అని రిషి చెప్పడంతో వదినా నేనున్నాను కదా అంటూ గౌతమ్ వసుని తీసుకెళతాడు. చిన్నత్తయ్యా వెల్ కమ్ బ్యాక్ అని లోపలకు తీసుకెళుతుంది ధరణి.
Also Read: దేవయానికి భారీ షాకిచ్చిన రిషి, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
భారీ ఎమోషనల్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో.. జరిగిన పాత సంఘటనలు అన్నీ తలుచుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేసి గడపకి నమస్కారం చేసి అత్తవారింట్లోకి అడుగుపెడుతుంది జగతి. ఇదంతా చూసి దేవయాని కోపంతో రిగలిపోతూ ఉంటుంది. మరోవైపు రిషి మనసులో మళ్లీ మా కుటుంబంలోకి అడుగుపెట్టలేరు, ఎన్ని ప్లాన్లు చేసినా ఆ ఇంటి గడప తొక్కనివ్వనని గతంలో జగతితో అన్న మాటలు గుర్తుచేసుకుంటాడు. సంక్రాంతి శుభాకాంక్షలు అక్కయ్య అని దేవయానికి మరో షాకిచ్చిన జగతి లోపలకు వెళుతుంది. అటు మహేంద్ర రూమ్ డోర్ తీసిన రిషి గుడ్ మార్నింగ్ డాడ్ అంటాడు.. మార్నింగ్ లో గుడ్ ఏముంటుంది రిషి అంటే.. ఏమో డాడ్ మార్నింగ్ చెప్పాక అందులో గుడ్ ఉండొచ్చు కదా అంటాడు రిషి. క్యాలెండర్లో రోజులు మారుతున్నాయి కానీ గుడ్ అనిపించేలా ఒక్కరోజు కూడా జరగలేదంటాడు మహేంద్ర. మీకు నాపై నమ్మకం లేదా డాడ్ అని రిషి అంటే..ఏ విషయంలో అని అడుగుతాడు మహేంద్ర... అప్పుడు పక్కకు తప్పుకుని జగతిని చూపిస్తాడు. మహేంద్ర ఆనందంతో కూడిన ఆశ్చర్యంలో అలాగే ఉండిపోతాడు. ఎపిసోడ్ ముగిసింది..
Also Read: తండ్రి సంతోషం కోసం ఓ మెట్టుదిగిన రిషి, గుండెల్ని మెలిపెట్టిన గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్
రేపటి ఎపిసోడ్ లో
జగతిని చూసిన ఆనందంలో ఉన్న మహేంద్ర.. రిషి ఏంటిది నేను నమ్మలేకపోతున్నా అంటాడు. అక్కడి నుంచి వెళ్లిపోతున్న రిషిని పిలుస్తూ లేచి నిల్చుని పక్కకు తూలిపడబోతుంటే జగతి పట్టుకుంటుంది. ఇక తండ్రికి తల్లి ఉందనే ధీమాతో అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతాడు. మరోవైపు దేవయాని తన రూమ్ లో రచ్చ రచ్చ చేస్తుంటుంది. ఇంట్లో అసలేం జరుగుతోంది... జగతి, వసుధారకి చెప్పాల్సిన గుణపాఠం చెబుతా అనుకుంటుంది. ఇంతలో రా వసుధార అని రిషి లోపలకు పిలుస్తాడు.. బయటకు వెళుతున్న దేవయాని.. సూట్ కేస్ ని కాలితో తన్నడంతో వసుకి దెబ్బతగులుతుంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)