IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

Karthika Deepam ఫిబ్రవరి 17 ఎపిసోడ్: డాక్టర్ గా కార్తీక్ లైసెన్స్ రద్దు వెనుక మోనిత కుట్ర ఉందని దీప కనిపెట్టేసిందా, కార్తీకదీపం గురువారం ఎపిసోడ్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ ఫిబ్రవరి 17 గురువారం 1278 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

FOLLOW US: 

కార్తీకదీపం ఫిబ్రవరి17 గురువారం ఎపిసోడ్

మోనిత ఇంటిముందున్న ప్రజావైద్యశాల బోర్డుని దీప ఆజ్ఞ మేరకు వారణాసి చించి పడేస్తాడు. అక్కడ చేరిన బస్తీవాళ్లంతా ఇప్పుడు మోనిత మేడం వస్తే ఏమవుతుందో ఏంటో అని టెన్షన్ పడతారు. ఇంతలో అక్కడకు వచ్చిన మోనిత ఇంటిముందున్న జనాన్ని చూసి బాబాయ్ పోయాడా ఏంటి, బాబాయ్ పోతే నా ప్లాన్ ఏమైపోతుంది, ఇప్పటికే కష్టపడి నటిస్తున్నా అనుకుంటుంది. లోపలకు వెళ్లిన మోనితకి బస్తీవాసులు అసలు విషయం చెబుతారు. నా కార్తీక్ అని రాసి ఉండడం చూసి హర్ట్ అయినట్టుంది, అయినా దీపక్కకి కోపం వచ్చిందంటే నా గెపులు ఖాయం అనుకుంటుంది. వారణాసి చించేసిన ముక్కలన్నీ మూట కట్టి మళ్లీ పైన పెట్టు అని లక్ష్మణ్ కి చెబుతుంది. 

ఇంట్లో అంతా ఓ దగ్గర చేరి సంతోషంగా ఉండడం చూసి ఇలా అంతా కలసి ఉంటే ఎంత సంతోషంగా ఉందో అంటుంది సౌందర్య. బాబాయ్ మనం అంత్యాక్షరి ఆడి, పాటలు పాడి, డాన్సులు చేసి తాతయ్యకి పంపిద్దామా అని హిమ అంటే...ఐడియా బాగానే ఉంది కదా అంటుంది శౌర్య. నీకు అసలే హెల్త్ బాగాలేదని కార్తీక్ అంటే నాకు బాగాపోతే ఏం బాబాయ్ ఉన్నాడుగా అని కౌంటర్ వేస్తారు. మరోవైపు కార్లో వెళుతున్న డాక్టర్ రవి, భారతి... మోనిత కార్తీక్ కి ఎందుకు ఫేవర్ చేసిందో అర్థం కావడం లేదంటుంది. దీప చెప్పినట్టు మోనిత కార్తీక్ కి సపోర్ట్ చేయడానికి ఇంకేదైనా కారణం ఉంటుందా అని డౌట్ వ్యక్తం చేస్తే..ఏమో నీకే తెలియాలి అంటాడు రవి. నిజానికి నేను మోనితకి క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటారు కానీ మోనిత ఎప్పుడు ఏం చేస్తుందో నేనుకూడా ఊహించలేను అంటుంది. మంచే జరిగింది కదా...ఆలోచించకు వదిలెయ్ అని రవి అంటే... తెలుసుకుని తీరాలి ఏదో తేడా కొడుతోంది అంటుంది.

Also Read: కార్తీక్ చేతిలో బాబుని చూసిన మోనిత, ఇప్పటి వరకూ ఓలెక్క ఇకపై మరో లెక్క అన్న వంటలక్క, కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్
బాబుని ఎత్తుకుని కార్తీక్ ఆడిస్తుంటే..దీపక్కా అంటూ ఎంట్రీ ఇస్తుంది మోనిత. ఏంటి కార్తీక్ ఆదిత్య కొడుకుని ఆడిస్తున్నావా, మన బాబుని ఇలా ఎప్పుడైనా ఎత్తుకున్నావా, ఇంత స్వార్థమా, తమ్ముడి కొడుకుమీద ఉన్న ప్రేమ మన కొడుకుమీద లేకపోతే ఎలా అంటుంది. వీడు దీపు గాడు కాదని కార్తీక్ చెప్పేలోగా శ్రావ్య అడ్డుపడి...వివరాలు తనకి చెప్పడం ఎందుకులెండి బాబుని నాకివ్వండి అని తీసుకెళ్లిపోతుంది. మళ్లీ ఎందుకొచ్చావ్ అని కార్తీక్ అడిగితే..రావడానికి వంద కారణాలున్నాయంటుంది మోనిత. ఇంతలో అక్కడకు ఎంట్రీ ఇచ్చిన దీప..కారణం నేను చెబుతాను డాక్టర్ బాబు అంటుంది దీప. నువ్వు వస్తావని నాకు తెలుసని దీప..వచ్చేలా చేశావని మోనిత...పిచ్చిపిచ్చి పనులు చేస్తే ఊరుకోను కదా అని దీప అంటుంది. 

బస్తీలో బోర్డు పీకించేశానని తన కడుపుమంట డాక్టర్ బాబు అని చెబుతుంది. నా పేరు, డాక్టర్ బాబు పేరు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, బస్తీ వాసులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్ అని క్వశ్చన్ చేస్తుంది. నేను లేనప్పుడు నీ ఆటలు సాగాయ్, నేను వచ్చాను కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిదని హెచ్చరిస్తుంది. స్పందించిన మోనిత..కార్తీక్ ఇవన్నీ ఆపేస్తానని నీకు ముందే చెప్పాను ఆలోచించుకో అంటుంది. ఒక్క బోర్డు తీసేస్తే బస్తీలో ప్రతి ఇంటికీ ఓ బోర్డు తగిలిస్తానని మోనిత హెచ్చరిస్తే.... కుక్కతోక వంకర అని ఊరికే అనలేదు... ఇకపై లెక్కే వేరన్నట్టుంది చెబుతుంది దీప. బస్తీ వాళ్లను చూసుకుని నీకు బాగా బలం వచ్చినట్టుంది, అదే బస్తీ వాళ్లను నా వైపు తిప్పుకుంటాను అని మోనిత అంటుంది. బస్తీ వాళ్లను నీవైపు తిప్పుకునేందుకు వాళ్లు నీ ఫ్యాన్స్ కాదు, నా ఫ్యాన్స్ .. నువ్వే అన్నావంటగా వాళ్లు నీ ఫ్యాన్స్ అని గుర్తుచేస్తుంది. కార్తీక్ సింపిల్ గా అయ్యేదాన్ని నువ్వు కాంప్లికేట్ చేస్తున్నావ్ అంటుంది మోనిత. నేను నీలా ఆలోచిస్తే నువ్వు తట్టుకోలేవ్, త్వరలోనే దీప అంటే ఏంటో చూపిస్తానని వార్నింగ్ ఇస్తుంది. మోనిత కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

Also Read: దగ్గరవుతున్న వసు-రిషి, మహేంద్ర-జగతి విషయంలో కన్ఫ్యూజన్లో గౌతమ్, గుప్పెడంతమనసు బుధవారం ఎపిసోడ్
ఇంట్లోకి వచ్చాక చాలా హ్యాపీగా ఉంది కదా అని హిమ, శౌర్య మాట్లాడుకుంటారు. అక్కడకు వెళ్లినందుకు మనకు తమ్ముడు వచ్చాడు కదా అనుకుంటారు. మనం ఐస్ క్రీం తిని చాలా రోజులైంది కదా వెళ్లి తినొద్దాం అనుకుని ఆదిత్యని అడుగుతారు. అందర్నీ వదిలేసి ఎలా ఉన్నారే మీరు, ఆ విషయంలో నేను ఏమీ చేయలేకపోయానని ఆదిత్య అంటే..అందుకే అలా బయటకు వెళ్లి ఐస్ క్రీం తినొద్దాం అంటే...ఈ ఒక్కరోజు ఆగండి, వర్క్ ఉందని సర్దిచెబుతాడు. పోనీలే వారణాసితో వెళ్లి ఐస్ క్రీం తినేసి, బస్తీకి వెళ్లొస్తాం అంటారు. బస్తీకి వద్దు, సాయంత్రం నేనే బయటకు తీసుకెళతా అని మాటిస్తాడు. వీళ్లు మళ్లీ బస్తీకి వెళితే మోనిత గురించి తెలుస్తుంది, మళ్లీ ఏవేవే ప్రశ్నలు అడుగుతారు అనే ఆలోచనలో పడతాడు. 

మోనిత కండిషన్ పెట్టిందో, ఆఫర్ ఇచ్చిందో తెలీదు కానీ అంటూ మోనిత డీల్ గురించి కార్తీక్ దీపకి చెబుతాడు. ఇంతకాలం మోనిత గురించి మనం ఎక్కువ ఆలోచించలేదు కాబట్టి రెచ్చిపోతోంది, ఆలోచనల్లో తనకన్నా ముందుంటే కానీ బుద్ధి చెప్పలేం అంటుంది. ఎందుకిదంతా అని కార్తీక్ అడిగితే మన పక్కన క్రూర జంతువు వెళుతుంటే పట్టించుకోవాలన్న దీప..మీకు డాక్టర్ లైసెన్స్ రావడం వెనుక ఏదో కుట్ర ఉందని నా అనుమానం అంటుంది. ఇంత నెగిటివ్ గా ఆలోచిస్తున్నావ్ అంటని కార్తీక్ అంటే..మోనిత అంటే కుట్ర, మోనిత అంటేనే మోసం, మోనితని ఎదుర్కోవాలంటే ఎక్కువగానే ఆలోచించాలంటుంది. అసలు లైసెన్స్ రావడానికి మోనిత హెల్ప్ చేసిందంటున్నారు కానీ లైసెన్స్ పోవడానికి మోనితే కారణం అయి ఉండొచ్చేమో అంటుంది దీప. ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నావేంటి దీప అని కార్తీక్ అడుగుతాడు. తనలాంటి వాళ్లని ఎదుర్కోవాలంటే తనలాగే ఆలోచించాలని క్లారిటీ ఇస్తుంది దీప.

రేపటి (శుక్రవారం) ఎపిసోడ్ లో
భోజనం చేద్దాం రండి అని శ్రావ్య పిలవడంతో పదండి అందరం సంతోషంగా, తృప్తిగా తిందాం అనుకుని లేస్తారు. మీరు వెళ్లండి డాక్టర్ బాబు అంటుంది దీప. డాక్టర్ బాబుపై నిషేధం పోవడానికి మోనిత హెల్ప్ చేసిందంటే దీని వెనుక ఏదో కుట్ర ఉందని దీప ఆలోచిస్తుంది. ఆపరేషన్ చేస్తే మోనిత తలనొప్పి పోతుందని ఆలోచిస్తే..దీప ఏంటి ఇలా చేస్తోందని కార్తీక్ అనుకుంటాడు. ఏదేమైనా మోనితని తక్కువ అంచనా వేయకూడదు, తన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని దీప ఆలోచనలో పడుతుంది....

Published at : 17 Feb 2022 08:57 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala premi viswanath karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ karthika Deepam Serial Today Episode Karthika Deepam 17th February Episode 1278

సంబంధిత కథనాలు

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!

Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

Akhil Sardhak: ఆ విషయంలో ‘అఖిలే నెంబర్ వన్’, సీజన్-4 హిస్టరీ రిపీట్, కానీ..

Akhil Sardhak: ఆ విషయంలో ‘అఖిలే నెంబర్ వన్’, సీజన్-4 హిస్టరీ రిపీట్, కానీ..
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

Petrol-Diesel Price, 22 May: బిగ్ గుడ్ న్యూస్! నేడు భారీగా తగ్గిన ఇంధన ధరలు, లీటరుకు ఏకంగా రూ.9కి పైగా తగ్గుదల

Petrol-Diesel Price, 22 May: బిగ్ గుడ్ న్యూస్! నేడు భారీగా తగ్గిన ఇంధన ధరలు, లీటరుకు ఏకంగా రూ.9కి పైగా తగ్గుదల

Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ

Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ

MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!

MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!