Karthika Deepam ఫిబ్రవరి 16 ఎపిసోడ్: కార్తీక్ చేతిలో బాబుని చూసిన మోనిత, ఇప్పటి వరకూ ఓలెక్క ఇకపై మరో లెక్క అన్న వంటలక్క, కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ ఫిబ్రవరి 16 బుధవారం 1277 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

FOLLOW US: 

కార్తీకదీపం ఫిబ్రవరి16 బుధవారం ఎపిసోడ్

ఇల్లంతా సర్దుతున్న దీపని చూస్తూ నిల్చుంటుంది సౌందర్య. ఇల్లంతా సరిగాలేదు..ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడలేవు అని దీప అంటే.. ఉండాల్సిన వాళ్లు ఇంట్లో ఉంటే వస్తువులు కూడా ఎక్కడఉండేవి అక్కడ ఉంటాయని సరదాగా కౌంటర్ ఇస్తుంది. ఇష్టమైన వాళ్లు దూరమైతే ఎంత బాధేస్తుందో మీరు దూరమయ్యాకే తెలుస్తుంది, మీరు ఎలా ఉన్నారో, ఏం తిన్నారో అని ప్రతిక్షణం బాధపడ్డాం. మనం బాధపడడంలో అర్థం ఉంది కానీ బస్తీవాళ్లు కూడా నిన్ను తలుచుకుని బాధపడ్డారంట అని సౌందర్య అంటుంది. అవును అన్న దీప..మోనిత ఇప్పటికే బస్తీవాసుల్లో విషం నింపి ఉంటుంది అని బాధపడుతుంది. అన్నింటికన్నా నాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే మీరొచ్చారు, పెద్దోడి తప్పు లేదని తేలింది అంటుంది. మన పేరుని ఎవ్వరూ చెడగొట్టలేరు డాక్టర్ బాబు ఎప్పుడూ డాక్టర్ బాబే, ఇక డబ్బు అంటారా ఒక్కోసారి డబ్బు పోగొట్టుకోవడం కూడా మంచిదే అవుతుంది అని చెబుతుంది దీప. అందరం కలిశాం ఇంత ఆనందం ఎంత డబ్బు ఉంటే వస్తుంది అత్తయ్యా అన్న దీపతో... నీ విషయంలో కార్తీక్ చాలా అదృష్టవంతుడు అంటుంది సౌందర్య. 

Also Read: బస్తీకి వంటలక్క, హాస్పిటల్ కి డాక్టర్ బాబు, మోనిత ప్లాన్ తో కథలో మరో మలుపు, కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్

కట్ చేస్తే హాస్పిటల్లో ఉన్న కార్తీక్ దగ్గరకి మోనిత వస్తుంది. వెల్ కమ్ బ్యాక్ డాక్టర్ కార్తీక్..బొకే తేలేదని ఫీలవకు.. భూమ్మీద ఉన్న పూలన్నీ కలపి ఇచ్చినా నా ప్రేమ ముందు సరిపోవు అంటుంది. ఇంతకీ ఎందుకొచ్చావ్ అంటే..నిన్ను డాక్టర్ గా చూడడం బావుంది, బాలేదని ఏంటంటే వంటలక్క ప్రజా వైద్యశాల కార్తీక్ ఆశీస్సులతో అని రాయించి, కింద డాక్టర్ మోనితా కార్తీక్ అని రాయించా, ఇంట్లో మనం శాంతి పూజ చేయించిన ఫొటో పెట్టించా.. అని చెబుతుంటే మోనిత ఆపు చాలా ఎక్కువ చేస్తున్నావ్ అని కార్తీక్ అంటే.. అవును మోనిత ఏదైనా ఎక్కువే చేస్తుందని కౌంటర్ ఇస్తుంది మోనిత. ఏంటి కార్తీక్ నువ్వు నన్ను నమ్మవు కదా.. బస్తీలో బోర్డు, హాస్పిటల్, ఇంట్లో ఫొటో ఉండదు కావాలంటే ఆ ఇల్లే అమ్మేస్తా ఇవన్నీ నేను చేయాలంటే నువ్వొక పని చేయాలని అడుగుతుంది. అనుమానంగా చూడకు నేనేం పెద్దపెద్ద కోరికలు కోరనులే...ఇవన్నీ నేను చేసినందుకు బదులుగా నువ్వు మా బాబాయ్ కి హార్ట్ ఆపరేషన్ చేయాలని అడుగుతుంది. ఎంతో మంది ఉన్నారుగా నేనే ఎందుకు చేయాలన్న కార్తీక్ తో... ఎంతోమంది ఉన్నారు కానీ అందరూ కార్తీక్ కాదు కదా, అమెరికాలో అయికే ఖర్చు ఎక్కువ అవుతుందని ఇక్కడకు వచ్చేశారు, పైగా అక్కడి డాక్టర్స్ కూడా నిన్నే సజెస్ట్ చేశారు, నువ్వు ఆపరేషన్ చేస్తే మా బాబాయ్ బతికేస్తాడు అది నాకు చాలుఅంటుంది మోనిత. ఆపరేషన్ చేస్తే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా అంటే...మన మధ్య కోపాలుంటాయి కానీ మోసాలుండవ్ అంటుంది. అయితే సరే అంటాడు కార్తీక్.. నువ్వు సరే అంటే మా బాబాయ్ బతికినట్టే అంటుంది. 

Also Read: గౌతమ్ తీసుకొచ్చిన గులాబీ లాక్కుని వసుధారకి ఇచ్చిన రిషి, గుప్పెడంతమనసు మంగళవారం ఎపిసోడ్
చాలా రోజులైంది కదా కాఫీ షేర్ చేసుకుందామా అనేసి..సరే సరే నువ్వు కోపంగా చూడకు జీవితమే పంచుకోబుతున్నా ఈ కాఫీ ఎందుకు అనేసి వెళ్లిపోతుంది. నిన్ను అందరూ మంచివాడు అంటారు కానీ నువ్వు కనిపించినంత మంచోడివి కాదు కార్తీక్, మనబ్బాయిని ఎవరో ఎత్తుకెళ్లారు తెలుసుకదా, నీ భజన సంఘం ఇప్పటికే చెప్పి ఉంటారు కదా, ఆ విషయం గురించి అడిగావా నన్ను, ఎంత కాదన్నా తల్లినే కదా నువ్వు తనకి తండ్రివే కదా అని మాట్లాడుతుంటే షటప్ అని అరుస్తాడు కార్తీక్. షటప్ ఏంటి మీ నాన్నగారి పేరు పెట్టుకున్నాను, అయినా నీకు ప్రేమ లేదు, హిమ , శౌర్య, దీపు వీళ్లేనా నీకు లోకం, వాడు కూడా నీ కొడుకే కదా అంటుంది. సరేలే..బాబాయ్ ఆపరేషన్ సంగతి త్వరగా చూడు, నువ్వు మాట తప్పొద్దు, నేను మాట తప్పను నీ ఆరోగ్యం జాగ్రత్త అనేసి వెళ్లిపోతూ... మొత్తానికి మాటిచ్చావు కదా, ఇక నా ఆట నేను ఆడతాను అనుకుని వెళ్లిపోతుంది.

దీప రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుని మోనిత గురించి సౌందర్య, ఆదిత్య చెప్పిన విషయాలన్నీ తలుచుకుంటుంది. ఆ తర్వాత దీప...ఆటో డ్రైవర్ వారణాసికి కాల్ చేస్తుంది. అక్క నువ్వేనా, ఎక్కడున్నావ్, ఎలా ఉన్నావ్ అని బాధపడతాడు. నువ్వెలా ఉన్నావ్ అని దీప అడిగితే ఎలా ఉంటాను రాముడు లేని ఆంజనేయుడిలా ఉన్నా అంటాడు. ఇంటికొచ్చాను, నేను బాగానే ఉన్నానన్న దీపతో ఇంటికి వస్తానక్కా అంటాడు. వద్దు..నేను చెప్పినప్పుడు వద్దుగానివి, మోనిత హాస్పిటల్ దగ్గరకు వెళ్లి వీడియో కాల్ చెయ్యి అని చెబుతుంది. వీడియో కాల్ చేసిన వారణాసితో ఓసారి హాస్పిటల్ బోర్డు చూపించు అని అడిగి, నా కార్తీక్ అని రాస్తావా ఎక్కడ కొన్నావ్ నీ కార్తీక్ ని అనుకుంటూ..ఆ బోర్డు తీసి ముక్కలు చేయి వారణాసి అని చెబుతుంది. ఆ బోర్డు నాకు కనిపించకూడదు అని రెట్టిస్తుంది. గొడవ అవుతుందేమో అని వారణాసి అంటే..హనుమంతుడు రాముడు చెప్పిన పనులకు ఆలస్యం చేయలేదు వారణాసి అన్న దీప.. ఆబోర్డుని తీసేస్తుంటే నేను వీడియోలో చూడాలి అంటుంది. సరే అని ఆపనిలో పడతాడు వారణాసి.

ఇంతలో బయటకు వచ్చిన మోనిత బాబాయ్ బాబు ఏం చేస్తున్నావ్ ఆగు అంటాడు. బస్తీవాళ్లు కూడా కొందరు వచ్చి ఏం చేస్తున్నావ్ ఆగు అంటారు. అయినా పోస్టర్ చింపేసి దీపక్క నువ్వు చెప్పినట్టే చేశాను అంటాడు. మోనిత ఇప్పుడేమంటావ్ అని దీప గర్వంగా నవ్వుకుంటుంది. ఆనందరావుతో ఫోన్లో మాట్లాడిన సౌందర్య.. మీ మావయ్యగారు శ్రావ్య...రావడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది.. కార్తీక్, దీప పిల్లల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆరాటపడుతున్నారు, ఆశ్రమం వాళ్లు నాలుగైదు రోజుల్లో పంపించేస్తా అన్నారని చెబుతుంది. చాలామంది జీవితంలో ఏవేవో కోరుకుంటారు కానీ అందరూ కలసి ఉండడంలో ఎంత ఆనందం ఉందో తెలుసుకోరు అంటుంది.

రూమ్ లో కూర్చున్న కార్తీక్ ...మోనిత మాటలు తలుచుకుంటాడు. మోనిత నిజంగా తన బాబాయ్ మీద ప్రేమతోనే ఆపరేషన్ చేయమంటోందా, నిజంగా మాటమీద నిలబడుతుందా, ఎటూ నిర్ణయించుకోలేకున్నా ఉన్నాను, అయినా వాళ్ల బాబాయికి ఆపరేషన్ చేస్తే తప్పేముంది, మోనిత అన్నమాట ప్రకారం అన్నీ ఆపేస్తే తన తలనొప్పి పోతుందనే నిర్ణయానికి వస్తాడు. ఈ విషయం ఓసారి దీపతో మాట్లాడితే బావుంటుందేమో అనుకుంటాడు.

రేపటి (గురువారం) ఎపిసోడ్ లో
దీపక్కా అని అరుచుకుంటూ వస్తుంది మోనిత. వస్తావని తెలుసు అని దీప అంటే..వచ్చేలా చేశావ్ అని మోనిత అంటుంది. పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఊరుకోను, సిద్ధంగా ఉండు మోనితా..దీప అంటే ఏంటో అతి త్వరలో చూపిస్తా అంటుంది. 

Published at : 16 Feb 2022 09:10 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala premi viswanath karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ karthika Deepam Serial Today Episode Karthika Deepam 16th February Episode 1277

సంబంధిత కథనాలు

Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్

Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్

Jabardasth: బిగ్ బాస్ బ్యూటీకి 'జబర్దస్త్' ఛాన్స్ - అనసూయ రేంజ్ లో క్లిక్ అవుతుందా?

Jabardasth: బిగ్ బాస్ బ్యూటీకి 'జబర్దస్త్' ఛాన్స్ - అనసూయ రేంజ్ లో క్లిక్ అవుతుందా?

Ramya Raghupathi: ఆమెకు మాటిచ్చాను, నరేష్‌కు విడాకులు ఇవ్వను: రమ్య రఘుపతి

Ramya Raghupathi: ఆమెకు మాటిచ్చాను, నరేష్‌కు విడాకులు ఇవ్వను: రమ్య రఘుపతి

Dasara Movie: 'దసరా' మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

Dasara Movie: 'దసరా' మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

Supritha: 'మా బట్టలు మా ఇష్టం, మీరేమైనా కొనిస్తున్నారా?' సురేఖావాణి కూతురు ఫైర్!

Supritha: 'మా బట్టలు మా ఇష్టం, మీరేమైనా కొనిస్తున్నారా?' సురేఖావాణి కూతురు ఫైర్!

టాప్ స్టోరీస్

Udaipur Murder Case : ముంబయి ఉగ్రదాడిని గుర్తుచేసేలా 26/11 బైక్ నెంబర్, అదనంగా రూ.5 వేలు చెల్లించిన ఉదయ్ పూర్ కిల్లర్

Udaipur Murder Case : ముంబయి ఉగ్రదాడిని గుర్తుచేసేలా 26/11 బైక్ నెంబర్, అదనంగా రూ.5 వేలు చెల్లించిన ఉదయ్ పూర్ కిల్లర్

Vishal No Politics : కుప్పంలో చంద్రబాబుపై పోటీ - విశాల్ క్లారిటీ ఇదే

Vishal No Politics :  కుప్పంలో చంద్రబాబుపై పోటీ - విశాల్ క్లారిటీ ఇదే

Rahgurama : నీ దారిలో నువ్వు రా... నా దారిన నేను వస్తా - సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ సలహా !

Rahgurama :  నీ దారిలో నువ్వు రా... నా దారిన నేను వస్తా -  సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ సలహా !

TTD TSRTC Darshan Tickets : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు టీటీడీ గుడ్ న్యూస్, ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి వెయ్యి టికెట్లు జారీ

TTD TSRTC Darshan Tickets : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు టీటీడీ గుడ్ న్యూస్, ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి వెయ్యి టికెట్లు జారీ