Karthi FB Page Hacked: హీరో కార్తీకి షాకిచ్చిన హ్యాకర్స్ - ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ చేసి..
హీరో కార్తీ ఫేస్ బుక్ హ్యాక్ అయ్యిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇతర సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తన ఎఫ్.బి ఖాతా హ్యాక్ కు గురైందని చెప్తూ అభిమానుల్ని అప్రమత్తం చేశారు.
తమిళ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉంది. కార్తీ నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. అటు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటారాయన. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా హీరో కార్తీ ఫేస్ బుక్ హ్యాక్ అయ్యిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇతర సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ కు గురైందని చెప్తూ అభిమానుల్ని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఖాతా రికవరీ కోసం ఫేస్ బుక్ టీమ్‌తో కలసి పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన అకౌంట్‌ను హ్యాక్ చేసి.. వీడియో గేమ్ వీడియోను రన్ చేశారు. లక్కీగా ఎలాంటి అశ్లీల ఫొటోలు, సందేశాలు పోస్ట్ చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇలా సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవ్వడం ఇదేమి కొత్త కాదు. నిత్యం ఎవరో ఒక సెలబ్రెటీల ఖాతాలు హ్యాక్ అవుతూనే ఉంటాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం ఇలా వేదిక ఏదైనా ఖాతాలు హ్యాక్ అవుతూ ఉంటున్నాయి. అయితే వీటి వల్ల ఒక్కోసారి కొత్త సమస్యలు కూడా రావొచ్చు. కొంత మంది సెలబ్రెటీల ఖాతాలు హ్యాకై వాటిని గమనించకపోవడం వలన పబ్లిక్ లోకి ఫేక్ ఇన్ఫర్మేషన్ వెళ్లే ప్రమాదం ఉంది. ఇటీవల ఓ టీవీ యాంకర్ ఫేస్ బుక్ కూడా ఇలాగే హ్యాక్ అయింది. దాన్ని ఆమె సరిచేసుకోకపోవడంతో ఆమె ఖాతాలో అసభ్యకర పోస్ట్ లు వస్తూనే ఉన్నాయి. అందుకే హీరో కార్తీ సమస్యను వెంటనే గుర్తించి తన అభిమానుల్ని అప్రమత్తం చేశారు. సోషల్ మీడియా వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో తెలీదుగాని.. నష్టాలు అయితే చాలానే ఉన్నాయి. అందుకే సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటుంన్నారు టెక్ నిపుణులు.
హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు అయిన 'పొన్నియిన్ సెల్వన్'లో వల్లవరాయగా ప్రేక్షకులను అలరించారు. మొదటి భాగం మొత్తం కార్తీ చుట్టూనే కథ తిరిగింది. ఈ సినిమాలో కార్తీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తమిళ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'పొన్నియిన్ సెల్వన్' నిలిచింది. ఇక ఈ సినిమా రెండవ భాగం కూడా రానుంది. ఈ చిత్రం తర్వాత కార్తీ నుంచి వచ్చిన సినిమా 'సర్దార్' స్పై థ్రిల్లర్ బ్యాగ్రౌండ్ లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ మూవీని తమిళ్, తెలుగులో ఒకేసారి విడుదల చేశారు. తెలుగులో కూడా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది 'సర్దార్'. ఈ మూవీ తో పీఎస్ మిత్రన్ మరోసారి మ్యాజిక్ చేశారనే చెప్పాలి. వాటర్ బాటిళ్ల స్కామ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇందులో కార్తీ నటన అదిరిపోయింది.
ఇక ఈ సినిమా తర్వాత కార్తీ నుంచి రాబోతోన్న సినిమా 'జపాన్'. ఇందులో కార్తీ సరసన అను ఇమ్మన్యుయల్ హీరోయిన్ గా కనిపించనుంది. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
Also Read : 'ఆహ నా పెళ్ళంట' to 'గాడ్ ఫాదర్', 'సర్దార్' - ఓటీటీల్లో ఈ వారం సందడి
Hello guys, my Facebook page has been hacked. We are trying to restore it with Fb team.
— Karthi (@Karthi_Offl) November 14, 2022