OTT Releases this week : 'ఆహ నా పెళ్ళంట' to 'గాడ్ ఫాదర్', 'సర్దార్' - ఓటీటీల్లో ఈ వారం సందడి
Upcoming Web Series and Movies in November 2022 : ఓటీటీ వేదికల్లో ఈ వారం ఏయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి? అందులో స్ట్రెయిట్ ఎన్ని? డబ్బింగ్ ఎన్ని?
థియేటర్లలో విడుదలైన సినిమాలు ఓటీటీల్లోకి ఎప్పుడు వస్తాయి? అని ఎదురు చూసే వీక్షకులు కొందరు ఉన్నారు. అయితే... ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, డైరెక్టుగా డిజిటల్ రిలీజ్ అయ్యే సినిమాల కోసం వేచి చూసే వీక్షకులు సైతం ఉన్నారు. థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు ధీటుగా ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకూ... ఈ వారం ఓటీటీల్లో సందడి చేయడానికి రెడీ అయిన వెబ్ సిరీస్ (OTT Web Series This Week)లు ఏం ఉన్నాయి? ఏయే ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి? అనేది అని చూస్తే...
పీటల మీద పెళ్లి ఆగింది...
మరో పిల్లతో ప్రేమ మొదలైతే?
రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించిన వెబ్ సిరీస్ 'అహ నా పెళ్ళంట' (Aha Na Pellanta Web Series). గురువారం (ఈ నెల 17) నుంచి జీ 5 ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఈ వారం వస్తున్న వెబ్ సిరీస్‌లలో ఎక్కువ మంది చూపు ఈ సిరీస్ మీద ఉంది.
ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. పీటల వరకు వచ్చిన పెళ్లి అమ్మాయి లేచిపోవడంతో ఆగితే ఆ పెళ్లి కొడుకు ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది? తర్వాత మోడ్రన్ అమ్మాయితో అతను ప్రేమలో పడితే? కొత్తగా అపార్ట్‌మెంట్‌లోకి దిగితే? అనే అంశాలను ట్రైలర్‌లో చూపించారు. అయితే... హీరో హీరోయిన్లు చేసిన ఓ పని వల్ల తల్లిదండ్రులు బాధపడినట్లు చెప్పినా, ఆ పని ఏంటనేది రివీల్ చేయకుండా సస్పెన్స్ మైంటైన్ చేశారు. యువ హీరో రాజ్ తరుణ్ ఓటీటీకి పరిచయం అవుతున్న సిరీస్ ఇది. 'ఎబిసిడి' తీసిన సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. సినిమాకు ఏమాత్రం తీసిపోని రీతిలో విజువల్స్ ఉన్నాయి.
Also Read : 'మసూద', 'మిస్టర్ మమ్మీ' to 'గాలోడు' - థియేటర్లలో ఈ వారం ఏయే సినిమాలు వస్తున్నాయంటే?
ఓటీటీ వేదికల్లో ఈ వారం మరికొన్ని వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటి వివరాలు :
- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో గురువారం నుంచి తెలుగు వెబ్ సిరీస్ 'ఐరావతం' స్ట్రీమింగ్ కానుంది.
- బుధవారం (16న) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 'హాస్టల్ డేజ్' సీజన్ 3 రిలీజ్ అవుతోంది.
- మరో ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'ది శాంటా క్లాజెస్' విడుదల కూడా బుధవారమే. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో!
- నెట్‌ఫ్లిక్స్‌లో గురువారం నుంచి హాలీవుడ్ వెబ్ సిరీస్ '1899', 'డెడ్ టు మి' సీజన్ 3 స్ట్రీమింగ్ కానున్నాయి.
- జీ5 ఓటీటీలో 18వ తేదీ నుంచి హిందీ వెబ్ సిరీస్ 'కింట్రీ మాఫియా' స్ట్రీమింగ్ కానుంది.
- ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో 18వ తేదీ నుంచి 'ధారవి బ్యాంక్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.
OTT Movies This Week : థియేటర్లలో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్', కార్తీ 'సర్దార్' సినిమాలు ఈ వారమే ఓటీటీల్లోకి వస్తున్నాయి. ఎక్స్‌క్లూజివ్‌గా ఓటీటీ విడుదలకు రెడీ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో చూడండి.
కాబోయే అమ్మల కోసం స్పెషల్ క్లాస్!
నదియా, నిత్యా మీనన్, నదియా, పార్వతి తిరువొతు, పద్మప్రియ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'వండర్ వుమన్' (Wonder Women Telugu Movie). అంజలీ మీనన్ దర్శకత్వం వహించారు. ప్రెగ్నెంట్స్ కోసం నదియా ఓ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేశారు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన మహిళలు అక్కడ కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 18 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Also Read : త్రివిక్రమ్ - ప్రేక్షకుడితో నడిచే జీవితం, ఎప్పటికీ మరువలేని పుస్తకం!
కెమెరాలో మోడల్...
రియల్‌గా బ్యూటీషియన్!
అమర్‌దీప్ చౌదరి, తన్వీ నేగి జంటగా, ఎస్తేర్ ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ 'ఐరావతం'. నిజ జీవితంలో బ్యూటీషియన్ అయిన అమ్మాయి, ఓ కెమెరాలో మోడల్‌గా ఎందుకు కనబడుతోంది? అనేది ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న అంశం. ఈ 17వ తేదీ (గురువారం) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల కానుంది.
ఓటీటీలో వస్తున్న మరికొన్ని సినిమాలు :
- నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 16న హాలీవుడ్ సినిమా 'ద వండర్' విడుదల కానుంది.
- ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా 'అనల్ మేల్ పని తుళి'. వేడి లేదా సెగపై హిమబిందువులు అని అర్థం. సోనీ లివ్ ఓటీటీలో 18వ తేదీ నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది.
- ఆహా ఓటీటీలో ఈ నెల 18న కార్తీ 'సర్దార్' తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
- మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమా ఈ నెల 19న తెలుగు, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతోంది.