News
News
X

Trivikram Birthday : త్రివిక్రమ్ - ప్రేక్షకుడితో నడిచే జీవితం, ఎప్పటికీ మరువలేని పుస్తకం!

Trivikram Birthday Special: త్రివిక్రమ్‌ను మొదట్లో మాటల మాంత్రికుడు అన్నారు. ఇప్పుడు 'గురూజీ' అంటున్నారు. ఎందుకు? ఆయనలో స్పెషల్ ఏంటి?

FOLLOW US: 
 

త్రివిక్రమ్...
స్నేహితుడా? ప్రేమికుడా?
మనల్ని మందలించే తండ్రా?
సమాజానికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడా?
ఎవరీ ఆకెళ్ళ శ్రీనివాసుడు? మనకు ఏమవుతాడు?

త్రివిక్రమ్ సినిమాలకు ఒక్కసారి అలవాటు పడితే... ఆయన కబుర్లతో కాలక్షేపం చేస్తే... మనకు ఆత్మీయ బంధువు అవుతాడు.

అమ్మాయిపై మనసు పడితే ముందుగా షేర్ చేసుకునేది స్నేహితుడితోనే! అప్పుడు స్నేహితుడు ఏం చెబుతాడు? మీకు స్నేహితులు లేరా? ఏం పర్లేదు... త్రివిక్రమ్ సినిమాలు అన్నీ చూసేయండి! మీరేం చేయాలో ఓ క్లారిటీ వస్తుంది. ఇంకా అర్థం కాలేదా?

ప్రేమించిన అమ్మాయి మీకు మంచి ఫ్రెండ్ అనుకోండి? ఆ మానసిక సంఘర్షణ, మనసులో అలజడి ఎలా ఉంటుందో 'నువ్వే కావాలి'లో చెప్పారు. ఒకవేళ మనల్ని ప్రేమించిన అమ్మాయికి మన ఫ్రెండ్ లైన్ వేస్తున్నాడనుకోండి? 'స్వయం వరం' చూసేయండి. ఆఫీసులో వచ్చిన అమ్మాయితో ప్రేమలో పడ్డారా? ఆల్రెడీ బ్రేకప్ అయ్యి అమ్మాయిల్ని ప్రేమించకూడదని భీష్మించుకున్నారా? అయితే, మీరింకా 'మన్మథుడు' చూడలేదేమో!? కాలేజీలో ప్రేమ, ఆస్థిపాస్తుల్లో అంతరాలు... దర్శకుడిగా తీసిన 'నువ్వే కావాలి', 'అ ఆ'లో చూపించారు. అఫ్‌కోర్స్... ఆయన ప్రతి సినిమాలో ప్రేమ ఉంది.

News Reels

బహుశా... రియల్ లైఫ్‌లో లవ్ ఎలా ఉంటుందనేది త్రివిక్రమ్ చూపించినంత రియాలిటీగా ఎవరూ చూపించలేదంటే అతిశయోక్తి కాదు. ప్రేమలో యువతరాన్ని... వాళ్ళ తల్లిదండ్రులను... త్రివిక్రమ్ తన సినిమాల్లో చూపించారు. ప్రేమ ఒక్కటే కాదు... ప్రేమతో పాటు బాధ్యత కూడా ఉండాలని త్రివిక్రమ్ చెప్పారు.

'సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు... చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు' - 'నువ్వే నువ్వే'లో చంద్రమోహన్ డైలాగ్. ప్రేమించామని చెప్పడానికి ధైర్యమే కాదు... సంపాదన కూడా అవసరం అని పరోక్షంగా ఆయన చెప్పారు. తండ్రిలా మనకు మంచి మాట చెప్పారు. 

'ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పును కూడా మనం క్షమించగలగాలి. లేదా వాళ్ళను ప్రేమించడం లేదని ఒప్పుకోవాలి' - ఇదీ 'నువ్వే నువ్వే'లో డైలాగ్. శ్రియతో తరుణ్ చెబుతారు. ఆ సీన్ మొత్తం చూస్తే... ఒకవేళ ప్రేమించిన అమ్మాయి లేచిపోదామని వచ్చిందనుకో, ఇంట్లో వాళ్ళపై కోపంతో వచ్చిందా? లేదా? అనేది చూడమని అంతకంటే చక్కగా ఎవరు చెప్పగలరు? ఇక్కడ తండ్రి గురించి ఆలోచించమని త్రివిక్రమ్ చెప్పారు. ఫాదర్ సైడ్ తీసుకున్నారు. 

'తీన్‌మార్'లో తమ పంతాలు, పట్టింపులు నెగ్గాలని పిల్లల ఇష్టాలకు వ్యతిరేకంగా పెళ్లిళ్లు చేసే తండ్రులకు త్రివిక్రమ్ చురకలు అంటించారు. 'పిల్లను ఇచ్చేటప్పుడు ఉన్నోడా? లేనోడా? అని కాదు... మనసున్నోడా? అలవాట్లు లేనోడా? అని చూడండి. ఎందుకంటే... సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు' అంటూ పవన్ కళ్యాణ్ చేత చెప్పించారు.

అమ్మాయిలను ప్రేమలో పడేయడానికి, హీరోయిజం చూపించుకోవడానికి ఫైట్ చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ''భీముడు, అర్జునుడు - ఒట్టి చేతులతో వందమందిని చంపగలరు. వాళ్ళ ఐదుగురుకు కలిపి ఒక్క ద్రౌపది. కృష్ణుడు కత్తి పట్టుకున్న ఫోటో అయినా చూశారా? కానీ, ఆయనకు ఎనిమిది మంది! అర్థమైందా? మాకు ఎవరు నచ్చుతారో?'' - 'అరవింద సమేత వీర రాఘవ'లో పూజా హెగ్డే చెప్పే ఈ డైలాగ్ వింటే అర్థం కాలేదా? అమ్మాయిలకు ఎవరు అర్థం అవుతారో?? 

అమ్మాయిలకు ఎటువంటి వాళ్ళు నచ్చుతారో మాత్రమే కాదు...  మహిళలకు గౌరవం కూడా ఇవ్వాలని త్రివిక్రమ్ చెప్పారు. ''దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్! ఒకటి నేలకు... రెండు వాళ్ళకు (మహిళలకు)! అలాంటి వాళ్ళతో మనకి గొడవ ఏంటి సార్? జస్ట్ సరెండర్ అయిపోవాలంతే!'' - అని 'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్ చేత చెప్పించారు. ''పాలు ఇచ్చి పెంచిన తల్లులు సార్... పాలించడం ఓ లెక్కా వీళ్ళకు'' - అని 'అరవింద సమేత వీర రాఘవ'లో ఎన్టీఆర్ నోటి వెంట వినిపించారు. అమ్మను, అమ్మాయిని అందలం ఎక్కించమని ఇంత సూటిగా చెబుతుంటే ప్రేక్షకులు వినకుండా ఉంటారా!? ఇంత కంటే మంచి టీచర్ ఎవరుంటారు!?

ప్రేమలో మాత్రమే కాదు, జీవితంలో కూడా ఎలా ఉండాలో త్రివిక్రమ్ చెప్పారు. తన సినిమాల ద్వారా చెబుతున్నారు. 

  • నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం - మహేశ్‌ బాబు, 'అతడు' సినిమాలో!
  • 'నిజం చెప్పేటప్పుడు మాత్రమే భయం వేస్తుంది. చెప్పకపోతే ఎప్పుడూ భయం వేస్తుంది' - అల్లు అర్జున్, 'అల వైకుంఠపురములో'
  • 'మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు... మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు నలుగురు లేనప్పుడు... ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా తేడా ఏమీ ఉండదు' - వెంకటేష్, 'నువ్వు నాకు నచ్చావ్'
  • 'కన్నతల్లిని, గుడిలో దేవుడిని మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరకు రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది'  - ప్రకాష్ రాజ్, 'నువ్వే నువ్వే'
  • 'హెల్ప్ చేసి థాంక్స్ అడగకూడదు' - వెంకటేష్, 'మల్లీశ్వరి'
  • 'అందంగా ఉండటం అంటే మనకు నచ్చేలా ఉండటం, ఎదుటి వాళ్లకు నచ్చేలా ఉండటం కాదు - పవన్ కళ్యాణ్, 'జల్సా'
  • 'బాగుండటం అంటే బాగా ఉండటం కాదు... నలుగురితో ఉండటం, నవ్వుతూ ఉండటం' - పవన్ కళ్యాణ్, 'అత్తారింటికి దారేది'
  • 'మనం బావున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్... కరెక్ట్ కాదు' - అల్లు అర్జున్, 'సన్నాఫ్ సత్యమూర్తి' 

కమర్షియల్ సినిమాల్లో స్పేస్ తీసుకుని మరీ, తన సంభాషణల ద్వారా సమాజానికి చక్కటి సందేశాలను ఇస్తున్నారు త్రివిక్రమ్. 'వాసు' సినిమాలో ఆయన రాసిన డైలాగ్ ఒకటి ఉంది. ''ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఏఎస్, ఐపీఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా? మిగతా వాళ్ళు మనుషులు కాదా?'' అని! తల్లిదండ్రుల ఆశయాలను పిల్లలపై రుద్దవద్దని చెప్పారు. అదే సమయంలో మనుషుల్ని మనుషులుగా చూడమని చెప్పారు. అవసరంలో ఉన్న వారికి సాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుడితో సమానం అని 'ఖలేజా'లో చెప్పారు. ''దేవుడి డెఫినిషన్ అర్థమైపోయింది. ఎక్కడో పైన ఉండదు. నీలో, నాలో గుండెల్లో ఉంటాడు. అవతలి వాడు సాయం కోసం అడిగినప్పుడు లోపల నుంచి బయటకు వస్తాడు'' - డైలాగ్, సీన్ గుర్తున్నాయిగా!
   
జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనుక ఒక మినీ యుద్ధమే ఉంటుందని చెప్పిన త్రివిక్రముడికి ఒక సినిమా తీయడం వెనుక ఎంత యుద్ధం చేయాల్సి ఉంటుందో తెలియదా? ప్రేక్షకుడికి మంచి చెప్పడం కోసం బహుశా ప్రతి సినిమాలో, ప్రతి సంభాషణలో ఆయన ఒక మినీ యుద్ధమే చేయాల్సి వస్తుందేమో!?

Also Read : తెలుగు సినిమా దర్శకులందు త్రివిక్రమ్ వేరయా!

మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం అని చెబుతారు. మరి... పురాణాలు, మంచి పుస్తకాల సారాన్ని కాచి వడపోచి మాటలతో మన ముందుకు తీసుకు వస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్‌?
త్రివిక్రమ్...
ప్రేక్షకుడితో నడిచే జీవితం!
ఎప్పటికీ మరువలేని జ్ఞాపకం!!
అందుకే, ఆయన్ను అభిమానులు 'గురూజీ' అనేది
'థాంక్యూ... థాంక్యూ... థాంక్యూ...' 
హ్యాపీ బర్త్ డే గురూజీ!
త్రివిక్రమ్‌కు ఏం చెప్పగలం? ఇంతకన్నా!!

- సత్య పులగం

Published at : 06 Nov 2022 10:49 PM (IST) Tags: Trivikram Birthday Special HBD Trivikram Why Trivikram Is Called Guruji Trivikram Philosophy In Movies Trivikram Speciality

సంబంధిత కథనాలు

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్

Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

టాప్ స్టోరీస్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం  - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!