News
News
X

Viruman: ప్రభాస్ ఫ్లాప్ సినిమా పాయింట్‌తో కార్తీ సినిమా - సూపర్ హిట్ అయిందే!

ప్రభాస్ సినిమాలో పాయింట్ తీసుకొని దర్శకుడు ముత్తయ్య విలేజ్ బ్యాక్ డ్రాప్ లో 'విరుమాన్'ను తెరకెక్కించారు.

FOLLOW US: 

కోలీవుడ్ లో కార్తీ(Karthi) హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'విరుమాన్'(Viruman). ఇందులో అదితి శంకర్(Aditi Shankar) హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను సూర్య నిర్మించారు. తమిళంలో ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. ఈ వారం కోలీవుడ్ లో పెద్దగా సినిమాలేవీ లేవు. దీంతో 'విరుమాన్'కి భారీగా థియేటర్లు దొరికాయి. అందుకే ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. 

ఒక విధంగా కార్తీ కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా తమిళ నేటివిటీకి తగ్గట్లుగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలో కొత్తదనం ఏదీ లేదు. పైగా ఈ సినిమా కథ ప్రభాస్ ఫ్లాప్ సినిమాకి దగ్గరగా ఉంటుంది. కొన్నేళ్లక్రితం ప్రభాస్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో 'మున్నా' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో పాయింట్ తీసుకొని దర్శకుడు ముత్తయ్య విలేజ్ బ్యాక్ డ్రాప్ లో 'విరుమాన్'ను తెరకెక్కించారు.

తల్లి మరణానికి కారణమైన తండ్రిపై కొడుకు పగ తీర్చుకునే స్టోరీ ఇది. సినిమాలో హీరో, విలన్ యాక్షన్.. ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ హైలైట్ కావడంతో క్లిక్ అయిపోయింది. నిజానికి కార్తీ తన సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. కానీ 'విరుమాన్' విషయంలో అలా జరగలేదు. కనీసం తెలుగు ఓటీటీలో అయినా.. సినిమాను రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. 

ఈ మధ్యకాలంలో సినిమా హిట్ అయితే నటీనటులకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వడం ఆనవాయితీగా మారింది. రీసెంట్ గా కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తన టీమ్ అందరికీ ఖరీదైన బహుమతులను అందించారు కమల్. దర్శకుడు లోకేష్ కి కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. సినిమాలో గెస్ట్ రోల్ పోషించిన హీరో సూర్యకి రోలెక్స్ వాచ్ ఇచ్చారు. ఇప్పుడు సూర్యకి మరో కాస్ట్లీ గిఫ్ట్ దొరికింది. ఆయనతో పాటు కార్తీకి కూడా మంచి గిఫ్ట్ దొరికింది. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ శక్తి వేలన్.. సినిమా టీమ్ కు డైమండ్ బ్రేస్ లైట్స్ ను గిఫ్ట్ గా అందించారు. డైరెక్టర్ ముత్తయ్య కు డైమండ్ రింగ్ ఇవ్వగా.. సూర్య, కార్తీలకు బ్రేస్ లైట్స్ ను ఇచ్చారు.

Also Read: తిరు రివ్యూ : ధనుష్, నిత్యా మీనన్ సినిమా ఎలా ఉందంటే?

Also Read: విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్'కు సీక్వల్, ఆ పాత్ర చేసేందుకు కంగనా తిరస్కరణ?

View this post on Instagram
 
A post shared by Karthi Sivakumar (@karthi_offl)

Published at : 18 Aug 2022 03:18 PM (IST) Tags: Surya Karthi #Prabhas Munna Movie Viruman

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: నామినేషన్లో ఇనయా వయసుపై చర్చ, యాటిట్యూడ్ చూపించిన శ్రీహాన్

Bigg Boss 6 Telugu: నామినేషన్లో ఇనయా వయసుపై చర్చ, యాటిట్యూడ్ చూపించిన శ్రీహాన్

Janaki Kalaganaledu September 26th: జెస్సి, అఖిల్ ని జ్ఞానంబకి దగ్గర చేసేందుకు జానకి ప్రయత్నాలు- చెడగొట్టేందుకు మల్లిక కుట్రలు

Janaki Kalaganaledu September 26th: జెస్సి, అఖిల్ ని జ్ఞానంబకి దగ్గర చేసేందుకు జానకి ప్రయత్నాలు- చెడగొట్టేందుకు మల్లిక కుట్రలు

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Gruhalakshmi September 26th: సామ్రాట్ విషయంలో తగ్గేదెలే అన్న తులసి- 'నాన్న కానీ ఈ నాన్న'ని క్షమించమని హనీని అడిగిన సామ్రాట్

Gruhalakshmi September 26th: సామ్రాట్ విషయంలో తగ్గేదెలే అన్న తులసి- 'నాన్న కానీ ఈ నాన్న'ని క్షమించమని హనీని అడిగిన సామ్రాట్

Guppedanta Manasu September 26th Update: వసు కోసం మల్లెపూలు కొన్న రిషి - నాకోసం వచ్చేస్తావా వసుధార అని అడిగేసిన మిస్టర్ ఇగో

Guppedanta Manasu September 26th Update: వసు కోసం మల్లెపూలు కొన్న రిషి - నాకోసం వచ్చేస్తావా వసుధార అని అడిగేసిన మిస్టర్ ఇగో

టాప్ స్టోరీస్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Jupiter Closest To Earth: నేడు అంతరిక్షంలో అద్భుతం, 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా గురు గ్రహం

Jupiter Closest To Earth: నేడు అంతరిక్షంలో అద్భుతం, 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా గురు గ్రహం