అన్వేషించండి

Karate kalyani : అందుకే ‘మా’ ఎన్నికలు జరగలేదు, సీఎంకు విన్నవించుకున్నాం: కరాటే కళ్యాణి

Karate kalyani : క‌రాటే క‌ల్యాణి. ప్ర‌స్తుతం ఎక్కువ‌గా వార్త‌ల్లో క‌నిపిస్తున్నారు. డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి మాట్లాడుతూ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు.ఇప్పుడు మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల గురించి మాట్లాడారు.

Karate kalyani About Why MAA Elections Was Not Conducted & About Banglore Rev Party: క‌రాటే క‌ల్యాణి.. ఎన్నో క్యారెక్ట‌ర్లు చేసి ఆమెకంటే ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు. అయితే, ఎప్ప‌టిక‌ప్పుడ కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్ చేస్తూ, కాంట్ర‌వ‌ర్సీల‌పై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తారు ఆమె. ఇక ఈ మ‌ధ్య బెంగ‌ళూరులో జ‌రిగిన రేవ్ పార్టీపై కూడా త‌న‌దైన శైలీలో కామెంట్స్ చేసి వార్త‌ల్లో నిలిచారు. ఇక ఇప్పుడు ఆమె ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో మా బిల్డింగ్ నిర్మాణం గురించి చాలా విష‌యాలు పంచుకున్నారు. అంతే హేమ విష‌యంలో ఆమె ఎందుకు స్పందించాల్సి వ‌చ్చిందో కూడా క్లారిటీ ఇచ్చారు క‌రాలే క‌ల్యాణి. 

మా ఎల‌క్ష‌న్స్ అందుకే వ‌ద్దు అనుకున్నారు.. 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ కి ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఆ అసోసియేష‌న్ ప్రెసిడెంట్, మెంబ‌ర్స్ అంద‌రినీ ఎన్నిక‌ల ద్వారా ఆర్టిస్ట్ లు ఓటు వేసి గెలిపించుకుంటారు. అయితే, ఈ ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేదు. రెండేళ్ల కింద‌ట జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వారే ఇప్పుడు కూడా కొన‌సాగుతున్నారు. దానిపై క్లారిటీ ఇచ్చింది క‌రాటే క‌ల్యాణి. "మా ట‌ర్మ్ లోనే ఆరు నెల‌ల్లో మీటింగ్ పెట్టుకున్నాం. బిల్డింగ్ గురించి వ‌చ్చింది. రూ.4 కోట్ల‌తో నార్సింగిలో వాళ్ల ఆఫీస్ ప‌క్క‌నే బిల్డింగ్ కొందామ‌ని విష్ణు బాబు ప్ర‌పోజ‌ల్ పెట్టారు. లేదా ఇప్పుడు అద్దెకు ఉంటున్న ఫిలిమ్ ఛాంబ‌ర్ ని కూల‌గొట్టి 8 ఫ్లోర్లు క‌ట్టాల‌ని అనుకున్నారు. శేష‌గిరిరావు గారు వాళ్లంతా అనుకున్నారు. ప్లాన్ చేశారు అప్ప‌ట్లో. దాంట్లో మేమంతా క‌లిసి ఒక ఫ్లోర్ కొనుక్కుని అక్క‌డే అన్ని ఏర్పాటు చేయాల‌ని అనుకున్నాం. సెప‌రేట్ లిఫ్ట్, హాల్, కాన్ఫ‌రెన్స్ కి ప్లాన్ చేస్తాం అన్నారు. కానీ, కూల‌గొట్టే ప్ర‌క్రియ ఆగిపోయింది. అందుకే, మ‌ళ్లీ మీటింగ్ పెట్టుకుని మీరు కంటిన్యూ అవ్వండి. వేరే వాళ్లు వ‌చ్చి, వాళ్లంతా మ‌ళ్లీ మొద‌టి నుంచి అంటే క‌ష్టం అవుతుంది అని అన్నారు. అందుకే, కంటిన్యూ అయ్యాం. బిల్డింగ్ పూర్త‌య్యే వ‌ర‌కు మీరే ప్రెసిడెంట్ గా ఉండండి అని చెప్పారు. ఎక్స్ ట్రాడిన‌రీ బాడీ మీటింగ్ పెట్టి ఈ విష‌యాన్ని డిసైడ్ చేశారు. బిల్డింగ్ పూర్తయ్యే వ‌ర‌కు విష్ణు గారే ప్రెసిడెంట్ అని తీర్మానం చేశారు. అందుకే, కంటిన్యూ అయ్యాం" అని చెప్పారు క‌రాటే క‌ల్యాణి.  

కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని అడిగాం.. 

కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి తామంతా రిక్వెస్ట్ పెట్టుకున్నామ‌ని చెప్పారు క‌రాటె క‌ల్యాణి. స్థ‌లం కేటాయించ‌మ‌ని, దాంట్లో తామే బిల్డింగ్ క‌ట్టుకుంటామ‌ని చెప్పామ‌ని అన్నారు. స్థ‌లం వెత‌క‌మ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు చెప్పారు ఆమె. దాని కోసం వెతుకుతున్నార‌ని, కొన్ని స్థ‌లాలు చూసిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ ఎలక్ష‌న్స్ రావ‌డంతో బ్రేక్ ప‌డింద‌ని అన్నారు. వాళ్లు ఇవ్వ‌గానే బిల్డింగ్ పూర్తి చేసేస్తాం అని చెప్పారు ఆమె. దాదాపు రెండేళ్ల‌లో బిల్డింగ్ అయిపోతుంది. అప్ప‌టి వ‌ర‌కు దాదాపు ఎల‌క్ష‌న్స్ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అన్నారు. మ‌ధ్య‌లో ఏమైనా అయితే, చెప్ప‌లేం అని అన్నారు. బిల్డింగ్ కావాల‌ని అంద‌రూ అనుకుంటున్నార‌ని, అందుకే ఎవ్వ‌రూ దీన్ని అపోజ్ చేయ‌లేద‌ని చెప్పారు కారాటే క‌ల్యాణి. 

హేమ మీద క‌క్ష లేదు... 

"బాధ్య‌తగా అమ్మాయిల వైపు నిల‌బ‌డ‌తాను అని ఇలాంటి ప‌నులు చేయ‌డం క‌రెక్ట్ కాదు అనిపించింది. నేనేం పాత క‌క్ష‌లు తీర్చుకోలేదు. నాకేం క‌క్ష ఉంది హేమ‌తో. ఎల‌క్ష‌న్ అప్పుడు మాట మాట అనుకున్నాం అయిపోయింది. బ‌య‌ట క‌నిపిస్తే హేమ అక్క ఎలా ఉన్నావు అని మాట్లాడ‌తాను నేను. ఇలాంటి పార్టీల‌కి వెళ్ల‌డం చాలా త‌ప్పు. నువ్వు పెద్ద దాని లాగా అంద‌రికీ స‌మాధానం చెప్తూ, నీతులు చెప్తూ ఇలాంటి ప‌నులు చేయ‌డం క‌రెక్ట్ కాదు క‌దా. ఇంట్లో ఉండి వీడియో పెట్టినా ర‌చ్చ జ‌రుగుతుంది. అలాంటి సినిమా వాళ్ల జీవితం. నాకు స‌మాజం ప‌ట్ల బాధ్య‌త ఉంది. రేవ్ పార్టీలు బ్యాన్ చేయాలి అనేది నా ఉద్దేశం.  అందుకు ఆ రోజు స్పందించాను. కానీ, ఆ త‌ర్వాత హేమ ఉంద‌ని తెలిసింది. అందుకే, వెంట‌నే ఆమెను కూడా త‌గులుకున్నాను అంతే త‌ప్ప హేమ మీద నాకు ఎలాంటి పాత క‌క్ష‌లు లేవు" అని క్లారిటీ ఇచ్చారు క‌రాటే క‌ల్యాణి.

Also Read: సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ సినిమాకి త్రివిక్ర‌మ్ - కానీ, చిన్న ట్విస్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget