Swathi Sathish: వికటించిన సర్జరీ - గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హీరోయిన్!
కన్నడ స్వాతికి సర్జరీ వికటించడంతో ఆమె గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.
సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఇండస్ట్రీ. అందుకే సెలబ్రిటీలంతా అందంగా, ఫిట్ గా కనిపించడం కోసం చాలా కష్టపడుతుంటారు. కొందరు యోగా, జిమ్ లను నమ్ముకొని తమ అందాన్ని కాపాడుకుంటుంటే మరికొందరు మాత్రం షార్ట్ రూట్ లో సర్జరీతో అందాలను కొని తెచ్చుకుంటున్నారు. గ్లామర్ గా కనిపించడానికి ఇంజెక్షన్స్ ఉంటాయని.. ఒక్కొక్కటి పదివేలకు మించి ఉంటుందని ఇటీవల ఓ నటి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇలాంటి సర్జరీ కాన్సెప్ట్ ను కొన్ని సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో కూడా చూపించారు. రీసెంట్ గా విడుదలైన 'ఫింగర్‌టిప్ 2' వెబ్ సీరిస్‌లో నటి రెజీనా క్యారెక్టర్ సెలబ్రిటీ అయిన తర్వాత ముక్కుకి సర్జరీ చేయించుకుంటుంది. దానివల్ల ఆమె ముఖం ఉబ్బిపోయి సినిమాలకు పనికిరాదు. సరిగ్గా ఇలాంటి సంఘటనే రియల్ లైఫ్ లో ఓ హీరోయిన్ కి జరిగింది. ఇప్పుడు ఆమెకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఆ నటి ఎవరంటే.. స్వాతి సతీష్. కన్నడ ఇండస్ట్రీలో 'ఎఫ్ఐఆర్', '6 టు 6' వంటి సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. రీసెంట్ గా బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ డెంటల్ ట్రీట్మెంట్ కోసం చేరింది. ఆమెకి రూట్ కెనాల్ థెరపీ చేశారు డాక్టర్స్. అయితే ఆ ఆపరేషన్ వికటించడంతో ముఖం మొత్తం వాచిపోయింది. ఆ వాపు రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్స్ చెప్పారట. కానీ మూడు వారాలైనా తగ్గలేదు.
అంతేకాకుండా.. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు స్వాతి చెప్పుకొచ్చింది. ముఖం ఉబ్బిపోవడంతో ఎవరూ గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని.. ఇంటి నుంచి బయటకు వెళ్లడం కూడా కష్టంగా ఉందని చెప్పింది. ముఖంపై వాపు ఉండడంతో తనకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆ డెంటిస్ట్ తనకు తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చాడని స్వాతి ఆరోపిస్తుంది. సర్జరీతో భాగంగా అనస్థీషియాకు బదులు సాలిసిలిక్ యాసిడ్ ఇచ్చినట్లు తెలిపింది. వేరే హాస్పిటల్ కి వెళ్లడంతో తనకు విషయం తెలిసిందని స్వాతి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె కోలుకున్న తరువాత సదరు హాస్పిటల్ పై, డాక్టర్ పై కేసు వేయనున్నట్లు తెలుస్తోంది!
Also Read: కరణ్ జోహార్ కిడ్నాప్ - బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ ఇదే!
Also Read: నా బర్త్ డే రోజే ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది: అడివి శేష్
View this post on Instagram
View this post on Instagram