Janaki Kalaganaledu October 24th: జ్ఞానంబకి తారసపడిన ఉమ్మడి కుటుంబం- మల్లికలో మార్పు తీసుకొస్తుందా?
మల్లిక పెట్టిన చిచ్చు వల్ల విడిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జ్ఞానంబ కుటుంబం అంతా గుడిలో విజయదశమి వేడుకలు జరుపుకునేందుకు వెళ్తారు. జానకి ఎంత ప్రయత్నించిన మేము విడిపోవడం గ్యారెంటీ, తల్లి నువ్వే ఎలాగైనా మమ్మల్ని విడగొట్టు అని మల్లిక అమ్మవారిని కోరుకుంటుంది. మల్లిక పూజారితో జ్ఞానంబ వాళ్ళతో కాకుండా విడిగా పూజ చెయ్యమని అడుగుతుంది. అదేంటమ్మా మీరెప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా పూజ చేస్తారు కదా మరి ఇప్పుడేంటి విడిగా చెయ్యమని అడుగుతున్నారని పూజారి అనుమానంగా అడుగుతాడు. జానకి మల్లిక కడుపుతో ఉంది కదా అందుకని విడిగా చెయ్యమని అడుగుతుందిలే అని సర్ది చెప్తుంది. అయినా కూడా మల్లిక చెప్పబోతుంటే తన మాటలు వినిపించకుండా చేసేందుకు జానకి గుడిలో గంట కొడుతూనే ఉంటుంది.
Also Read: బాబోయ్ ఇవేమి అరచకాలు సామీ!- అనసూయకి నూరిపోస్తున్న లాస్య
నోరు కాస్త అదుపులో పెట్టుకొమ్మా అని గోవిందరాజులు మల్లికని బతిమలాడతాడు. కానీ మల్లిక పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. గుడిలో ఒక కుటుంబం జ్ఞానంబ వాళ్ళకి ఎదురుపడుతుంది. మీరందరిని ఇలా చూసినా ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మేమంతా కలిసి మెలిసి ఉంటున్నామంటే మీరే కారణం జ్ఞానంబగారు అని ఆమె చెప్తుంది. నా వల్ల వీళ్ళు ఉమ్మడిగా కలిసి ఉండటం ఏంటి అని జ్ఞానంబ మనసులో అనుకుంటుంది. విడిపోయి ఉండటం వల ఏదో చేదు అనుభవం జరిగింది వీళ్ళకి అదేంటో తెలుసుకుంటే విష్ణు, అఖిల్ కి కనువిప్పు కలుగుతుందని జానకి వాళ్ళని అడుగుతుంది.
ఒక కుటుంబం కలిసి ఉండాలనేది ఆ ఇంటి కోడళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అదే మేము చేశాము. మేము స్వేచ్చగా ఉండాలని విడిపోయాము. అప్పుడే తెలిసొచ్చింది కలిసి ఉంటే ఉండే సుఖం కలిగే లాభం ఎంత అద్భుతంగా ఉంటాయో. మేము వేరు కాపురం పెట్టుకున్నాక ఎవరి నుంచి సహాయం లేదు మాటల్లో ప్రేమ లేదు, సమస్య ఎదురైతే తోడుండే మనిషి లేదు, ఒక్క మాటలో చెప్పాలంటే సమాజం వెలివేసిన బతుకు అయిపోయింది మా పరిస్థితి అని జ్ఞానంబ వాళ్ళకి ఎదురుపడిన కుటుంబం చెప్తుంది. విడిగా ఉండటం వల్ల వాళ్ళు పడిన కష్టాలు ఏకరువుపెడతారు. వాళ్ళు చెప్పిన మాటలకి వీళ్లలో మార్పు తీసుకురా తల్లి అని జానకి మనసులోనే అమ్మవారిని వేడుకుంటుంది. బయట వాళ్ళకి ఆదర్శమైన నా కుటుంబం ఇప్పుడు విడిపోతుందని జ్ఞానంబ మనసులో బాధపడుతుంది.
Also Read: యష్, వేద మధ్య అగాథం- పాత మొగుడి మీద మోజుతో అభిమన్యుకి హ్యాండ్ ఇస్తున్న మాళవిక
ఇక విష్ణు, అఖిల్ విడిపోవాలనే ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాం అని అనుకుంటారు. జ్ఞానంబ కుటుంబం అంతా కలిసి ఒక చోట మీటింగ్ పెడతారు. విడిగా ఉంటే అందరం ఉన్న అనాథల్లాగా అయిపోతాము ఒక్కసారి ఆలోచించు అని జానకి మల్లికని అడుగుతుంది. భార్యభర్తలు కలిసి నిర్ణయం తీసుకోవడం బాగుంది కానీ ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోతే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కలిసి ఉంటే ఎంత బాగుంటుందో మల్లికకి నువ్వే అర్థం అయ్యేలా చెప్పు అని విష్ణుకి చెప్తుంది. అఖిల్ నీ ప్రపంచం అమ్మ, అన్న నీడలో పెరిగావ్ తప్పొప్పులు తెలియక వేరుగా వెళ్లిపోతాను అని మాట అనేశావ్. ఒకసారి గడప దాటి బయటకి వెళ్తే నిన్ను ఇంత ప్రేమగా చూసే వాళ్ళు ఉండరు ఆలోచించు అని జానకి అంటుంది.
ఇంటి పెద్దగా కూర్చోబెట్టి అందరితో గట్టిగా మాట్లాడండి అర్థం చేసుకుంటారని గోవిందరాజులుతో చెప్తుంది. మనం అందరం కలిసి ఉండాలో విడిపోవాలో మీరు మా అందరితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ఒక్కసారి మాట్లాడి ప్రయత్నం చేయండి అని అంటుంది.