Janaki Kalaganaledu May 20th: జానకి చేతిలో నుంచి జారిపడిన అమ్మవారి ముడుపు - జ్ఞానంబ చేతిలోని ఫోటోలో పిల్లలు ఎవరు?
జానకి మీద మనోహర్ పగ తీర్చుకోవాలని అనుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
![Janaki Kalaganaledu May 20th: జానకి చేతిలో నుంచి జారిపడిన అమ్మవారి ముడుపు - జ్ఞానంబ చేతిలోని ఫోటోలో పిల్లలు ఎవరు? Janaki Kalaganaledu Serial May 20th Episode 584 Written Update Today Episode Janaki Kalaganaledu May 20th: జానకి చేతిలో నుంచి జారిపడిన అమ్మవారి ముడుపు - జ్ఞానంబ చేతిలోని ఫోటోలో పిల్లలు ఎవరు?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/20/cafc798bd5c3abeb2d3c15b9169722351684561372879521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
జ్ఞానంబ నిద్రలేచి ఇద్దరు పిల్లలున్న ఫోటో పట్టుకుని ఏడుస్తుంది. ఏమైందని గోవిందరాజులు కంగారుగా అడుగుతాడు. బాధపెట్టే గతాన్ని మర్చిపోవాలి గుర్తు చేసుకుని లాభమేముందని గోవిందరాజులు భార్యకి సర్ది చెప్తాడు. ఆ జ్ఞాపకం అంత త్వరగా మర్చిపోయేది కాదని అంటుంది. అన్నీ సవ్యంగా జరుగుతున్నప్పుడు ఈ కష్టాలు గుర్తు తెచ్చుకోవడం అవసరమా దాచేయమని చెప్తాడు. ఆ ఫోటో వెనుక గతం ఏంటో మిస్టరీగా మారింది. కష్టాన్ని దాచేస్తాను కానీ మీరు ఇచ్చిన మాట కోసం మాత్రం ఎదురుచూస్తున్నానని చెప్తుంది. భవానీ నిద్రలేచి బయటకి వచ్చేసరికి రామ, జానకి ఇంకా నిద్రపోతూనే ఉంటారు. వాళ్ళని నిద్రలేపడానికి చాటుగా నిలబడి భవానీ గులాబీ పూలు విసురుతుంది. జానకి పైకి లేచేసరికి రామ చొక్కాలో తన చీర కొంగు ఇరుక్కుపోతుంది.
Also Read: రసవత్తరంగా మారిన కథ, అత్తతో నేరుగా ఢీ కొట్టిన దివ్య- లాస్య చెంప పగలగొట్టి కేఫ్ నుంచి గెంటేసిన నందు
ఇక నిద్రలేవండి పోద్దేక్కిందని భవానీ పిలుస్తుంది. భవానీ గోవిందరాజులకి ఫోన్ చేస్తుంది. కాసేపు గోవిందరాజులని ఆడుకుంటుంది. రామ, జానకి ఎలా ఉన్నారని జ్ఞానంబ అడుగుతుంది. రెండో కోడలు నెల తప్పింది వదిలి రావడానికి లేదు అది కోతి అనడం జ్ఞానంబ వింటుంది. అసలు కుదురుగా ఉండదు వెనుకాలే ఉంటూ చూసుకుంటూ ఉండాలని అంటుంది. పెద్ద కోడలు గురించి చెప్పాలంటే లక్ష్మీ, సరస్వతి పేర్లు వస్తాయి కానీ తన గురించి చెప్పాలంటే కోతి, కుక్క గుర్తుకు వస్తాయని మల్లిక తిట్టుకుని వెళ్ళిపోతుంది. భవానీ రామ వాళ్ళతో పల్లెటూరి అలవాట్లు అన్ని నేర్పిస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టినట్టు ఉన్నారని భవానీ చెప్తుంది. వాళ్ళ గురించి దిగులు పెట్టుకోకు త్వరలోనే జానకి నీళ్ళు పోసుకుంటుందని హామీ ఇస్తుంది.
Also Read: పెళ్లి చూపులు చెడగొట్టుకున్న స్వప్న- రాహుల్ పెళ్లి కోసం ఇంట్లో గొడవకు దిగిన రుద్రాణి
మలయాళం వంట గదిలో బిజీగా ఉంటే మల్లిక కోపంగా వస్తుంది. తను రావడం చూసి పారిపోదామని అనుకుంటాడు కానీ మల్లిక వాడిని పట్టేసుకుంటుంది. ఉప్మా చేయడానికి చూస్తున్నాడు అందులో గుప్పెడు ఉప్పు వేస్తే అత్తయ్య వీడిని బయటకి గెంటేస్తుందని అనుకుంటే ఉప్పు వేయబోతుంటే మలయాళం ప్రత్యక్షమవుతాడు. ఇంకొక సారి పోలేరమ్మ దగ్గర ఇరికిస్తే ఇంట్లో నుంచి బయటకి పంపించేస్తానని, పెళ్లి కూడా కానివ్వనని బెదిరిస్తుంది. మల్లికమ్మ మాట వినకపోతే ఉద్యోగం పోతుంది పెద్దమ్మ మాట వినకపోతే మాట పోతుందని మలయాళం డైలమాలో పడతాడు. భవానీ జానకి వాళ్ళని తీసుకుని గుడికి వస్తుంది. ఊర్లో అందరూ భవానీని ప్రేమగా పలకరిస్తారు. వాళ్ళతో పూజ మొదలుపెట్టిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒకరికాళ్ళ మీద ఒకరు నిలబడి ప్రదక్షిణలు చేయాలని భవానీ చెప్తుంది. రామ వాళ్ళు అలాగే చేస్తారు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)