Brahmamudi May 20th: పెళ్లి చూపులు చెడగొట్టుకున్న స్వప్న- రాహుల్ పెళ్లి కోసం ఇంట్లో గొడవకు దిగిన రుద్రాణి
స్వప్నకి పెళ్లి చేయాలని కనకం వాళ్ళు నిర్ణయించుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కావ్య రాజ్ ఫోన్లో రికార్డు చేసిన గురక వీడియో చూపిస్తుంది. అది చూసి రాజ్ బిత్తరపోతాడు. అసలు గురకే రాదని అన్నారు మరి ఇప్పుడు ఏమంటారు? రోజు నేను ఎంత సఫర్ అవుతున్నానో అర్థం అయ్యిందా అంటుంది. ఏదో అలిసిపోయి కాస్త గురక పెట్టానులే అని కవర్ చేసుకుంటాడు. జస్ట్ రెండు రోజుల్లో గురక లేని రాజ్ ని చూస్తావని ఛాలెంజ్ చేస్తుంది. చెవుల్లో దూది పెట్టుకుని పడుకుంటుంది. డాక్టర్ ఇంటికి రావడంతో అందరూ షాకింగ్ గా చూస్తారు. రాజ్ రమ్మన్నాడు వచ్చాను అనేసరికి అందరూ తలా ఒక ప్రశ్నతో ఆశ్చర్యపోతారు. కావ్య వెళ్ళి రాజ్ ని పిలుచుకుని వస్తుంది. డాక్టర్ వచ్చాడని చెప్పేసరికి గురక కోసం పిలిచానని అందరికీ తెలిసిపోతుందా ఏంటి అనుకుని రాజ్ కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. డాక్టర్ విషయం చెప్పే టైమ్ కి రాజ్ పరుగున వచ్చి చెప్పనివ్వకుండా ఆపుతాడు.
Also Read: ఢీ అంటే ఢీ అంటున్న ముకుంద, మురారీ- రోజురోజుకీ భర్తకి మరింత దగ్గరవుతున్న కృష్ణ
ఏమైందని ఇంట్లో వాళ్ళు అడిగేసరికి జస్ట్ వెయిట్ పెరిగాను అందుకే డైట్ కోసం పిలిచానని కవర్ చేసి గదికి తీసుకుని వెళ్ళిపోతాడు. కావ్య వచ్చి రాజ్ వాళ్ళ మాటలు వింటుంది. తన గురక వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని అంటాడు. నాణేనికి మరోవైపు ఈయన ఇంత మెత్తటి మనిషా అని కావ్య అనుకుంటుంది. కొంచెం మొండి వాడే కానీ మంచి మొండివాడనుకుని మురిసిపోతుంది. కనకం ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తారు. స్వప్న గురించి ఏమి చెప్పలేదని మీనాక్షి అనేసరికి కనకం చెప్పలేదా అని గట్టిగా అరుస్తుంది. ఏదో ఒక అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది. స్వప్న పెళ్లి చూపులకు సిద్ధం కాలేదని చెప్పి కనకం తిడుతుంది. నన్ను చూడగానే వాళ్ళు ఒకే చెప్తారు ఇప్పుడే నాకౌ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని స్వప్న అంటుంది. ఇష్టం లేకపోతే ఇప్పుడే కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని అరుస్తుంది.
Also Read: అభిమన్యుని పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిన చిత్ర- వేద చెల్లి జీవితాన్ని కాపాడగలుగుతుందా?
కనకం ఫోన్లో పెళ్లి వల్ల నెంబర్ దొంగిలిస్తుంది స్వప్న. అపర్ణ తన ఫ్రెండ్ అరుంధతి, ఆమె కూతురి వెన్నెల ఇండియా వస్తున్నారని చెప్తుంది. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి రాజ్ ని వెళ్ళమని అంటే రుద్రాణి రాహుల్ ని పంపించమని అడుగుతుంది. అరుంధతి కూతురు రాహుల్ కి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందని అనేసరికి కావ్య షాక్ అవుతుంది. నీ ఫ్రెండ్ ని నువ్వే ఒప్పించాలని రుద్రాణి అడుగుతుంది. రాహుల్ ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పాలని అపర్ణ నిలదీస్తుంది. అరుంధతి కూతుర్ని కళ్యాణ్ కి ఇచ్చి చేయాలని అనుకున్నట్టు అపర్ణ చెప్పేసరికి రుద్రాణి ఏం మాట్లాడుతున్నావని లేస్తుంది. కళ్యాణ్ మాత్రం ప్రయోజకుడు అయ్యాడా ఎప్పుడూ రాజ్ వెనుక షాడోలా తిరుగుతాడని అవమానిస్తుంది. ఈ విషయం మీద గొడవ చేసేందుకు రుద్రాణి మొదలుపెడుతుంది. నా కొడుక్కి ఈ సంబంధం ఫిక్స్ చేసి తీరాల్సిందేనని రుద్రాణి తెగేసి చెప్తుంది. రుద్రాణి డల్ గా ఉంటే రాహుల్ ఏమైందని అడుగుతాడు. నీకు ఒక సంబంధం చూస్తున్నానని చెప్పాను కదా అది ఇదే బుద్ధిగా ఉండాలని హెచ్చరిస్తుంది.