Janaki Kalaganaledu May 13th: అత్తాకోడళ్ళ ఫన్ టైమ్- గుడ్ న్యూస్ చెప్పిన మల్లిక, బాధలో జానకి
రామ కోర్టు నుంచి నిర్దోషిగా బయటకి రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
![Janaki Kalaganaledu May 13th: అత్తాకోడళ్ళ ఫన్ టైమ్- గుడ్ న్యూస్ చెప్పిన మల్లిక, బాధలో జానకి Janaki Kalaganaledu Serial May 13th Episode 578 Written Update Today Episode Janaki Kalaganaledu May 13th: అత్తాకోడళ్ళ ఫన్ టైమ్- గుడ్ న్యూస్ చెప్పిన మల్లిక, బాధలో జానకి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/13/821d11138f900b63f5b86becc41af5611683955081450521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అఖిల్ సంతోషంగా జెస్సి దగ్గరకి వచ్చి గుడ్ న్యూస్ అంటాడు. అన్నయ్య నిర్దోషని కోర్టు చెప్పేసరికి మా మేనేజర్ కాల్ చేశారు నమ్మకం కుదురిందని ఆఫీసుకి రమ్మని పిలిచారని చెప్తాడు. ఉద్యోగం పొగానే ఎన్ని మాటలన్నావ్ అవన్నీ వెనక్కి తిరిగి వస్తాయా, ఇప్పటికైనా ఓర్పు సహనం నేర్చుకోమని గడ్డి పెడుతుంది. పెద్ద వదినకి బాధ్యత తెలుసు అందుకే అన్నయ్యని నిర్దోషిగా బయటకి తీసుకొచ్చింది నాకే ఎటువంటి బాధ్యత లేదని కోపంగా అంటాడు. జ్ఞానంబ నిద్రపోతుంటే రామ వచ్చి తన కాళ్ళు నొక్కుతాడు. నేను అందరి కొడుకుల మీద ఒకేలా ప్రేమ చూపిస్తున్నా కానీ ఎందుకో పెద్ద కొడుకంటే గుప్పెడంత ఎక్కువ ప్రేమ ఉంటుంది. వాడు సమస్యల్లో ఉంటే ఎవరినీ పట్టించుకోకుండా మొండిగా ఉంటున్నా అది తప్పంటావా అని అడుగుతుంది. తల్లీకొడుకులు కాసేపు మాట్లాడుకుంటారు.
Also Read: రంగంలోకి దిగిన కంచు కోడలు, ఇక అత్తకి దబిడీ దిబిడే- డిప్రెషన్ లో నందు
తల్లికి బిడ్డ ప్రపంచం కావచ్చు కానీ భార్యకి భర్త కంటే వేరే ప్రపంచం లేదు. అలాంటి భార్య భర్తని వదులుకోవాలని పోగొట్టుకోవాలని ఎప్పుడు అనుకోదు. జానకి నన్ను కేసు నుంచి బయట పడేసేందుకు ఎంత కష్టపడిందో నాకు తెలుసు. తను నిన్ను ఎప్పుడు అట్టలా చూడటం లేదు అమ్మలానే చూస్తుందని భార్యని వెనకేసుకొస్తాడు. ఇంకెప్పుడూ అలా జరగనివ్వనని జ్ఞానంబ కొడుక్కి మాట ఇస్తుంది. జానకితోనే కాదు మీ నాన్నతో కూడా అలాగే ప్రవర్తించాను ఆయన ఎంత బాధపడుతున్నారోనని అంటుంది. గోవిందరాజులు జ్ఞానంబ గురించి బాధపడుతుంటే జానకి వచ్చి ఓదార్పు మాటలు చెప్తుంది. కిచెన్ లో మలయాళం వంట చేస్తూ హడావుడి చేస్తాడు. జానకి కోపం తగ్గిందా అని అడుగుతుంది. నీతో దెబ్బలాడాడని రామ నా మీద అలిగాడని చెప్తుంది. కాసేపు ఇద్దరు అత్తాకోడళ్ళు సరదాగా మాట్లాడుకుంటారు. ఊర్లో అన్నదానం చేద్దామని వంట చేయిస్తున్నానని చెప్తుంది.
ఎందుకో ఇంట్లో ఏ శుభకార్యం జరగడం లేదని జ్ఞానంబ అంటుండగా నీలావతి దెప్పి పొడుపు మాటలు అంటూ ఇంట్లోకి వస్తుంది. రామ పలకరించగానే ఏంటి జైలుకి వెళ్ళి వచ్చావంట అని అడుగుతుంది. జైలుకి వెళ్ళి రావడం కాదు కోర్టు నుంచి నిర్దోషిగా వచ్చాడని జ్ఞానంబ కోపంగా చెప్తుంది. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా మల్లిక వాంతులు చేసుకుంటుంది. జెస్సీ వచ్చి జ్ఞానంబ చెవిలో ఏదో చెప్తుంది. డాక్టర్ ని ఇంటికి తీసుకురమ్మని విష్ణుని పంపిస్తుంది. డాక్టర్ వచ్చి మల్లికని టెస్ట్ చేసి గర్భవతి అయ్యిందని గుడ్ న్యూస్ చెప్తుంది.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)