News
News
వీడియోలు ఆటలు
X

Brahmamudi May 13th: స్వప్నకి పెళ్లి చూపులు ఫిక్స్ చేసిన కనకం- కావ్యని ఎందుకు వదిలేస్తున్నావని రాజ్ ని నిలదీసిన ధాన్యలక్ష్మి

స్వప్న, రాహుల్ ని కావ్య రెడ్ హ్యాండెడ్ గా రాజ్ కి చూపించడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

అపర్ణ గుడిలో జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటే రుద్రాణి వచ్చి మరింత ఆజ్యం పోస్తుంది. కొడుకు ఇచ్చిన షాక్ కి తల్లి తల తిరిగిపోతున్నట్టు ఉందని మనసులో అనుకుంటుంది. కావ్యని అర్థం చేసుకోవడం మొదలు పెట్టావన్న మాట అంటుంది. నీ కొడుకు, కోడలు కలిసిపోయి ఒకే గదిలో కలిసి కాపురం చేస్తున్నారు. తనకి సపోర్ట్ చేయడం కూడా మొదలు పెట్టాడు. అందరి ముందు కావ్య మీద కోపం చూపించి గదిలో మాత్రం ప్రేమ చూపిస్తున్నాడేమోనని అంటుంది. తన కొడుక్కి ఆ అవసరం లేదని అపర్ణ అంటే అలాంటప్పుడు తనని వెనకేసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని మైండ్ లో విషం నింపేసి వెళ్ళిపోతుంది. రాజ్ గదిలోకి వచ్చి నా గది నాకే కొత్తగా ఉంది ఇన్ని రోజులు నీ టాలెంట్ ఎక్కడ పెట్టావ్. నా గది నాకే ఇంత కొత్తగా ఉందని అంటాడు. కావ్య పిలుస్తుంది అది చూసి నువ్వా రెడీ చేసింది అయితే చండాలంగా ఉందని చెప్తాడు. అయినా ఇదంతా ఎందుకు చేశావని అడుగుతాడు.

Also Read: పగతో రగిలిపోతున్న మనోహర్- జ్ఞానంబ ఇంట వెల్లివిరిసిన ఆనందం

మూడు రోజుల్లో వెళ్లిపోయే దానికి ఎందుకు ఇవన్నీ అంటాడు. నేను తప్పు చేశానని నిరూపణ అయితే కదా వెళ్ళేదని కావ్య బదులిస్తుంది. పాలు తాగు రాత్రి పూట గురక వినలేకపోతున్నానని కావ్య అంటే తనకేమి గురక రాదని అంటాడు. మీ గురక ఎలా ఉంటుందో మీకే వినిపిస్తానని అనుకుంటుంది. ఇంట్లో నా మీద ఎవరికీ నమ్మకం లేదు రాహుల్ ని నమ్మి తప్పు చేశాను ఏమో? నేను వచ్చేశాక అసలు ఏం జరిగిందని స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది. రాజ్ కొట్టిన దాని గురించి రాహుల్ ఆలోచిస్తూ ఉంటాడు. రాహుల్ కి ఫోన్ చేసి ఎందుకు రాజ్ తో నిజం చెప్పొద్దని నిలదీస్తుంది. మంచి టైమ్ చూసి నేనే మన పెళ్లి గురించి మాట్లాడతానని అంటాడు. ఆలస్యం చేయకుండా త్వరగా పెళ్లి విషయం చెప్పమని అంటుంది. మన పెళ్లి జరగకూడదని అందరి దృష్టిలో నువ్వు దిగజారిపోయేలా చేస్తున్నా, ఈ ఆటలో నువ్వే నాకు రక్షణ కవచం. నిన్ను అడ్డు పెట్టుకుని కావ్యని ఇరికించి తన మాటలు విని రాహుల్ ని అనవసరంగా అపార్థం చేసుకున్నానని రాజ్ అనుకునేలా చేస్తాను. కావ్య మీద రాజ్ కి ద్వేషం కలిగేలా చేస్తాను. దోషం నీకు, ద్వేషం కావ్యకి ఒకే దెబ్బకి రెండు పిట్టలని మనసులో అనుకుంటాడు. వీలైనంత త్వరగా మన పెళ్లి జరిగేలా చూడమని, మళ్ళీ రేపు కలుద్దామని చెప్తుంది.

Also Read: రాహుల్ కి వార్నింగ్ ఇచ్చిన కావ్య- స్వప్నకి పెళ్లి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కృష్ణమూర్తి

రాజ్ పడుకుని గురక పెడుతుంటే కావ్య ఫోన్ తీసుకుని రికార్డు చేస్తుంది. ఆ ఫోన్ మళ్ళీ రాజ్ తల దిండు కింద ఆన్ చేసి పెడుతుంది. ఆ సౌండ్ కి రాజ్ ఉలిక్కిపడి నిద్ర లేస్తాడు. నువ్వు గురక పెడుతూ నేను గురక పెడుతున్నా అంటావా రేపు చెప్తా నీ సంగతని పడుకుంటాడు. కనకం చీర తెచ్చి స్వప్న బెడ్ మీద విసిరేస్తుంది. నువ్వు నాకోసం చీర తీసుకొచ్చావా అని సంతోషంగా మాట్లాడుతుంది. తెలిసో తెలియకో నేను చేసిన తప్పుకి మీరందరూ నన్ను దూరం పెడుతున్నారు. కానీ నువ్వు కూడా నన్ను పరాయిదానిలా చూస్తున్నావ్ ఈ బాధ భరించలేకపోతున్నానని అంటుంది. నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు ఈసారి లేచిపోవడాలు, పారిపోవడాలు చేస్తే తోలు తీస్తానని కనకం వార్నింగ్ ఇస్తుంది. మేం నిర్ణయించిన అబ్బాయితోనే పెళ్లి జరుగుతుందని చెప్పేసి వెళ్ళిపోతుంది.

Published at : 13 May 2023 07:55 AM (IST) Tags: manas Brahmamudi Serial Brahmamudi Serial Today Episode Brahmamudi Serial Written Update Brahmamudi Serial May 13th Episode

సంబంధిత కథనాలు

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

OTT Actors: వెబ్‌సీరీస్‌ల్లో అత్యధిక పారితోషికం తీసుకొనే మూవీ స్టార్స్ వీళ్లే - టాప్‌లో ఉన్నది ఎవరో తెలుసా?

OTT Actors: వెబ్‌సీరీస్‌ల్లో అత్యధిక పారితోషికం తీసుకొనే మూవీ స్టార్స్ వీళ్లే - టాప్‌లో ఉన్నది ఎవరో తెలుసా?

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

Noise Buds Trance: రూ. వేయి లోపే ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ నాయిస్!

Noise Buds Trance: రూ. వేయి లోపే ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ నాయిస్!