News
News
వీడియోలు ఆటలు
X

Janaki Kalaganaledu May 12th: పగతో రగిలిపోతున్న మనోహర్- జ్ఞానంబ ఇంట వెల్లివిరిసిన ఆనందం

రామ నిర్దోషిగా విడుదల కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

జానకి రామని నిర్ధోషిగా బయటకి తీసుకొస్తుంది. రోడ్డు మీద నడుస్తూ దారిన పోయే వాళ్ళందరికీ మా రామ్ నిర్దోషని కోర్టు తీర్పు ఇచ్చిందని సంబరంగా చెప్తుంది. ఇంటి దగ్గర జ్ఞానంబ టెన్సిన్ గా ఎదురుచూస్తూ ఉంటుంది. మల్లిక బయట కూర్చుని బొమ్మా బొరుసు వేసుకుంటుంటే విష్ణు వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఏదైనా కోరుకున్నప్పుడు బొమ్మ బొరుసు వేస్తానని కోర్టులో కేసు జానకి ఒడిపోవాలని కోరుకుంటున్నానని చెప్తుంది. అప్పుడే రామ జానకి రావడం చూసి అందరూ సంతోషంతో ఉబ్బితబ్బిబవుతారు. నీకొడుకు నిర్ధోషిగా తిరిగొచ్చాడు ఇది నీ కోడలి గెలుపు, భార్యగానే కాదు పోలీస్ గా కూడా తన బాధ్యత నెరవేర్చారు. మాటలు పడుతూ కూడా తను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కుటుంబ గౌరవం తగ్గకుండా చూసుకున్నారని రామ భార్యని మెచ్చుకుంటాడు.

Also Read: రాహుల్ కి వార్నింగ్ ఇచ్చిన కావ్య- స్వప్నకి పెళ్లి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కృష్ణమూర్తి

జ్ఞానంబ జానకిని దగ్గరకి తీసుకుంటుంది. నా వల్ల మీరు బాధపడ్డారు రాక్షశిలా ప్రవర్తించానని క్షమించమని జానకి అడుగుతుంది. లేదు తప్పు నాదే సమస్య నావైపు నుంచి చూసి నిన్ను మానసికంగా హింసించాను నువ్వే నన్ను క్షమించాలని జ్ఞానంబ అంటుంది. రామనే కాదు ఇక నుంచి నన్ను కూడా మీ బిడ్డనే అనుకోమని జానకి అడుగుతుంది. జానకి గెలవడమే కాదు హత్య చేసిన వాడు జైలుకి వెళ్ళాడు, ఎస్సై సస్పెండ్ అయ్యాడని చెప్తాడు. జ్ఞానంబ కొడుక్కి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్తుంది. కేసు గెలిచినందుకు మల్లిక షాక్ లో ఉండిపోతుంది. గదిలో ఇప్పుడు విష్ణు బొమ్మా బొరుసు వేస్తూ ఉంటాడు. మల్లిక వచ్చి ఏం చేస్తున్నారని అడుగుతుంది. అనుకున్నది జరిగేలా లేదని విష్ణు ఏడుపు మొహం పెడతాడు. ఇంతకీ ఏం కోరుకున్నారని అంటుంది. మా ఆవిడకి మంచి బుద్ధి రావాలని కోరుకున్నా చాలా చిన్న కోరిక అది కూడా జరిగే పని కాదని దేవుడు చెప్పేశాడని పెళ్ళాన్ని తిడతాడు. మల్లిక విష్ణుని తిట్టి ఎస్సై ఊరికే ఏమి ఉండదని విష్ణుని భయపెడుతుంది. 

Also Read: భార్యని ముద్దులతో ముంచెత్తుతున్న యష్- చిత్ర మీద అఘాయిత్యానికి తెగబడ్డ అభిమన్యు

ఎస్సై పగతో రగిలిపోతూ ఉంటాడు జానకిని వదిలిపెట్టడని మల్లిక అంటుంది. అటు మనోహర్ ఇంట్లో కూర్చుని కోర్టులో జరిగింది తలుచుకుని ఆవేశంతో ఊగిపోతాడు. భర్త జైల్లో ఉంటే లొంగిపోతుందని యూనిఫాంకి దూరం అవుతుందని అనుకుంటే నా యూనిఫాం దూరం చేస్తుందా? ఏంటి దాని ధైర్యం దాని జీవితం మీద దెబ్బ కొడతానని అంటాడు. జానకి మౌనంగా వచ్చి రామని కౌగలించుకుంటుంది. మిమ్మల్ని నేను కాపాడకపోయి ఉంటే పరిస్థితి ఏంటని జానకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. జానకి అన్యాయం ముందు తలవంచకూడదని నేను జైలుకి వెళ్ళడానికి కూడా రెడీ అయ్యానని రామ ధైర్యం చెప్తాడు. ముక్కుసూటిగా ఉండటం ఖాకీ యూనిఫాంకి పనికిరాదేమో అప్పుడు నా పరిస్థితి ఏంటని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. కాసేపు మాటలు చెప్పి పెళ్ళాన్ని ముగ్గులోకి దించేస్తాడు. ఇద్దరూ సంతోషంగా ఉంటారు. 

Published at : 12 May 2023 11:06 AM (IST) Tags: janaki kalaganaledu serial today episode Janaki Kalaganaledu Serial Written Update Janaki Kalaganaledu Serial Janaki Kalaganaledu Serial May 12th Update

సంబంధిత కథనాలు

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

టాప్ స్టోరీస్

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!

CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా