Ennenno Janmalabandham May 12th: భార్యని ముద్దులతో ముంచెత్తుతున్న యష్- చిత్ర మీద అఘాయిత్యానికి తెగబడ్డ అభిమన్యు
చిత్ర, వసంత్ పెళ్లి ముహూర్తం పెట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
పెళ్లి మండపం దగ్గరకి యష్, వేద వాళ్ళు వస్తే అభిమన్యు ఎదురుపడతాడు. మాజీ భార్యకి పెళ్లి చేయడం ఎక్కడ జరగలేదని యష్ బాధపడేలా మాట్లాడతాడు. మీరు ఇప్పుడు పరాయి మనిషి కాదు బంధువులు అవుతారు. ఎప్పుడో జరిగిపోయిన మాళవిక విషయం తీసి న్యూసెన్స్ క్రియేట్ చేయవద్దని వేద చక్కగా చెప్తుంది. నిజానికి హ్యపీగా ఉంది ఇలా రెండు ముహూర్తాలు ఒకేసారి జరగడమే నాకు కావాలని అనేసరికి వేద అనుమానంగా చూస్తుంది. అంటే కలిపి ముహూర్తాలు పెట్టడం వల్ల మాళవికతో పెళ్లి మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యేదని అర్థమని కవర్ చేస్తాడు. ఈ ప్లాన్ వర్కౌట్ అవాలి ఎలాగైనా చిత్ర మెడలో తాళి కట్టాలని అభి అనుకుంటాడు. చిత్ర మెహందీ వేడుక మొదలవుతుంది. ఖుషిని గోరింటాకు పెట్టుకోమని చిత్ర అంటే వేద అమ్మ వచ్చి పెడుతుందని అంటుంది. అప్పుడే మాళవిక వచ్చి ఖుషిని పిలుస్తుంది. లేదు నేను మా వేద అమ్మ దగ్గరే ఉంటానని చెప్తుంది.
Also Read: జానకికి ప్రమోషన్, మనోహర్ సస్పెండ్- నిర్దోషిగా ఇంటికి వచ్చిన రామ
వేద మాళవిక అమ్మ దగ్గరకి వెళ్ళమని అంటే వెళ్లనని చెప్తుంది. సరే నువ్వు చెప్పావు కదా నీకోసం వెళ్తానని మాళవిక దగ్గరకి వెళ్తుంది. యష్, వసంత్ కూర్చుని మాట్లాడుకుంటుంటే అభి అక్కడకి వస్తాడు. యష్ వేద లేకపోతే మన రెండు పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తానికి జరిగేవి కావని అభి అంటాడు. పెళ్ళాం వదిలేసి వెళ్ళిపోయిన బామ్మర్దిని ఇంత బాగా చూసుకోవడమంటే మామూలు విషయం కాదని అభి రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. యష్ చాలా గ్రేట్ వదిలేసిన పెళ్ళానికి దగ్గరుండి మరీ పెళ్లి చేస్తున్నాడంటే మామూలు విషయం కాదు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావ్ చేసుకుని వెళ్ళమని యష్ వార్నింగ్ ఇస్తాడు. ఫ్రెండ్స్ వచ్చి డ్రింక్ తీసుకుంటావా అంటే వద్దని అంటాడు. భార్య పర్మిషన్ లేకుండా తాగడని అసలే పెళ్ళాం వదిలేసి వెళ్లిపోతే వేద పెళ్లి చేసుకుందని అభి నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. పెళ్లి డిస్ట్రబ్ అవుతుందని ఊరుకుంటున్నా లేదంటే గూబ పగిలిపొద్దని అంటాడు.
Also Read: అదిరిపోయే ట్విస్ట్, ఇక రాజ్యలక్ష్మి ఆట కట్టు- నందు ఇంటి ముందు ధర్నాకు దిగిన లాస్య
యష్ కోపంగా ఉంటే వేద గోరింటాకు పట్టుకుని వస్తుంది. తనని చూడగానే వెంటనే కూల్ అయిపోతాడు. ఏంటి సంథింగ్ సంథింగ్ లుక్స్ చూస్తున్నారని అంటుంది. మీతో గోరింటాకు పెట్టించుకోవాలని ఉందని గోముగా అడుగుతుంది. దీంతో వేదకి ప్రేమగా గోరింటాకు పెడతాడు. నీలో ఏదో మ్యాజిక్ ఉంది అలా కాసేపు నీ మొహం చూస్తే చాలు ఎంత కోపం ఉన్నా ప్రశాంతంగా ఉంటుంది. ఏదో మ్యాజిక్ ఉంది నీ కళ్ళలో అంటాడు. అది మాయ వేద మాయ అంటుంది. చూశారా గుర్తించాను మరి గిఫ్ట్ ఇవ్వరా? కానీ కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలని చెప్తుంది. యష్ ప్రేమగా వేద నుదుటిన ముద్దు పెడతాడు. మనసుకి ఇంపుగా ఉండే ఈ బహుమతి ఇస్తారని అసలు ఊహించలేదని సిగ్గు పడుతూ వెళ్ళిపోతుంటే ఆపి అందరూ నిన్నే చూస్తున్నారని నడుము మీద దిష్టి చుక్క పెడతాడు. తను పెట్టుకున్న గోరింటాకు చూపించడం కోసం చిత్ర వసంత్ ని వెతుక్కుంటూ వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఒక గదిలో ఉన్నారని చెప్పేసరికి నిజంగా అందులో వసంత్ ఉన్నాడనుకుని వెళ్తుంది. తీరా చూస్తే అక్కడ అభిమన్యు ఉంటాడు.పెళ్లి ఎలాగూ జరుగుతుంది కదా పెళ్ళికి ముందే శోభనం చాలా బాగుంటుందని తనని బలవంతం చేయబోతాడు. తనని వదిలించుకుని గది నుంచి బయటకి వచ్చేసరికి ఎదురుగా వేద, యష్ ఉంటారు.