Janaki Kalaganaledu May 11th: జానకికి ప్రమోషన్, మనోహర్ సస్పెండ్- నిర్దోషిగా ఇంటికి వచ్చిన రామ
జానకి రామని నిర్దోషిగా బయటకి తీసుకొచ్చింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రామని విడిపించుకుని ఇంటికి తీసుకొస్తానని చెప్పి జానకి వాడిని కోర్టుకి తీసుకువెళ్లడం ఏంటని జ్ఞానంబ ఆవేశపడుతుంది. కారణం లేకుండా జానకి ఏది చేయదని గోవిందరాజులు వెనకేసుకొస్తుంటే మావయ్య ఎప్పుడు ఇంతే తను తప్పు చేసిందని మల్లిక పుల్ల వేస్తుంది. కోర్టుకి వెళ్దామని జ్ఞానంబ అంటే వద్దని చెప్తాడు. రామ నిర్దోషని ఎలాంటి ఆధారం లేకుండా కోర్టు దాకా వెళ్లదని అంటాడు. జానకికి ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కోమని చెప్తుంది కానీ ఫోన్ ఆఫ్ అని రావడంతో జ్ఞానంబ మరింత కంగారుపడుతుంది. కోర్టులో వాదనలు మొదలవుతాయి. కోటి అనే వ్యక్తి మత్తుమందు ప్యాకెట్లతో దొరికాడు. అవి ఎక్కడవని అంటే రామ అనే మిఠాయి బండి అతను దగ్గర కొన్నానని చెప్పాడు ఇల్లంతా సెర్చ్ చేశాము ప్యాకెట్లు దొరికాయని మనోహర్ జడ్జికి చెప్తాడు.
కోటి కూడా ఎస్సై చెప్పిన విధంగానే రామ తనకి మత్తు పదార్థాలు కొన్నానని చెప్తాడు. ఐదారేళ్ల నుంచి రామ దగ్గర నుంచి మత్తు పదార్థాలు కొంటున్నానని అంటాడు. అతను ఎవరో తనకి తెలియదని రామ చెప్తాడు. అలాంటప్పుడు నీ మిఠాయి బండిలో మత్తు పదార్థాలు ఎలా వచ్చాయో చెప్పమని జడ్జి అడుగుతాడు. ఎలా వచ్చాయో తనకి నిజంగా తెలియదని అంటాడు.
Also Read: అదిరిపోయే ట్విస్ట్, ఇక రాజ్యలక్ష్మి ఆట కట్టు- నందు ఇంటి ముందు ధర్నాకు దిగిన లాస్య
జడ్జి: నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నాడా? న్యాయ సహాయం ఏమైనా కావాలా?
జానకి: ముద్దాయి తరఫున మాట్లాడటానికి నాకు అనుమతి ఇవ్వండి సర్
జడ్జి: ఇదేం గొడవయ్య పోలీసువు అయ్యి ఉంది ముద్దాయి తరఫున మాట్లాడటం ఏంటి
జానకి: నేను రామ భార్యని
మనోహర్: జానకి నువ్వు బయటకి వెళ్ళు
జానకి: నేను చెప్పాల్సింది చెప్పకుండా ఇక్కడ నుంచి కదలను
లాయర్: ఇదేమైన నీ ఇల్లు అనుకుంటున్నావా ఆవిడని పక్కకి తీసుకెళ్లండని అంటే తనకి మాట్లాడే అవకాశం ఇవ్వమని జానకి బతిమలాడుతుంది.
జానకి: పెన్ డ్రైవ్ ఇచ్చి చూడమని చెప్తుంది. అందులో మధుకర్ హత్య చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది.
జడ్జి: ఏంటమ్మా ఏదో మర్డర్ కేసుకు సంబంధించిన వీడియోలా ఉంది
జానకి: ఆ మర్డర్ చేసిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు మీరే చూడండి. ఈ హత్య ఒక అపార్ట్ మెంట్ లో జరిగింది అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని
జడ్జి: నీ చేతిలో ఎవిడెన్స్ పెట్టుకుని ఎందుకు కేసు బుక్ చేయలేదు
జానకి: ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్తారా నేను చెప్పనా? ఈ పెన్ డ్రైవ్ ఎస్సైది. రాత్రి దొంగతనంగా ఆ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాము.
Also Read: భార్యతో సరసాలు, ప్రేమికురాలితో ఎంగేజ్మెంట్- మురారీతో భవానీ మాట్లాడుతుందా?
జడ్జి: ఈ హత్యకి దీనికి లింకు ఏంటి
జానకి: ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఎస్సై అడ్డుపడ్డాడు. అతన్ని అడ్డు పెట్టుకుని రామని మత్తు పదార్థాల కేసులో ఇరికించాడు. మర్డర్ కేసులో కోటికి కూడా సంబంధం ఉంది
కోటి: అమ్మ బాబోయ్ వెయ్యి రూపాయల కోసం ఇలా చేశాను. ఇదంతా ఈ ఎస్సై చెప్తేనే చేశాను. మిఠాయి బండిలో ప్యాకెట్ పెట్టమంటే పెట్టాను నాకేం తెలియదు సర్
జడ్జి: కోర్టుకి సమర్పించిన సాక్ష్యాలను బట్టి రామని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం. ఎస్సైని మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నా అతడిపై న్యాయ విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశిస్తున్నా. న్యాయం కోసం పోరాడిన కానిస్టేబుల్ కి ప్రమోషన్ ఇవ్వాలని రికమండ్ చేస్తున్నా