Janaki Kalaganaledu April 4th: జానకి మీద నింద వేసి అవమానించిన మల్లిక- కష్టాల సంద్రంలో భార్యకి అండగా నిలిచిన రామ
జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జానకి గదిలోకి వచ్చి జ్ఞానంబ అన్న మాటలు తలుచుకుని బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. రామ మల్లెపూలు తీసుకొచ్చి మాట్లాడుతూనే ఉంటాడు. కాసేపటికి జానకి కన్నీళ్ళు చూసి ఏమైందని అడుగుతాడు. ప్రతిసారీ నా వల్ల మీరు ఎందుకు బాధపడుతున్నారు. నిజంగానే తప్పు చేశానేమో సోరి క్షమించండని అడుగుతుంది. అలా ఏమి లేదు మీ డ్యూటీ మీరు చేశారని అంటాడు. నన్ను బాధ పెట్టకూడదని పైకి నన్ను సమర్తిస్తున్నారా అంటే లేదని వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్తానని చెప్తాడు. జానకి బాధపడుతుంటే ఓదారుస్తాడు. మీరు నా మాట వినడం లేదు వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నా స్నాననం చేయమని నెత్తి కెక్కించుకోవడం వల్లే కదా ఇదంతా అని సీరియస్ గా ఫేస్ పెట్టేస్తాడు. తర్వాత మల్లెపూలు చూపించి భార్యని కూల్ చేస్తాడు.
జానకి తన కళ్ల ముందు ఉంటేనే బాగుంటుందని అనుకుని తన పోలీస్ శారీ తీసి దుప్పటి కింద దాచి పెట్టేస్తాడు. అది జానకి చూస్తుంది. ఫోటోలో పిల్లలని చూసి మురిసిపోతున్నా వాళ్ళు నా ఒడిలో కూర్చుని ఆడుకున్నట్టు కలలు కంటున్నా అని చెప్తాడు. డ్యూటీ మానేసి తనతో సరసాలు ఆడొచ్చు కదా గోముగా అడుగుతాడు. ఈ ఒక్కరోజు డ్యూటీ మానేయొచ్చు కదా అని అడుగుతాడు. కానీ కుదరదని అనేసి రెడీ అయిపోతుంది. రామ, జానకి సంతోషంగా ఉండటం చూసి మల్లిక కుళ్ళు కుంటుంది. ఎలాగైనా భర్తకి దగ్గర అవాలని మల్లెపూలు పెట్టి మరీ విష్ణు దగ్గరకి వెళ్తుంది. మల్లెపూలు వాసన చూస్తూ మొగుడ్ని టెంప్ట్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ విష్ణు మాత్రం అదేమీ పట్టించుకోకుండా పని చేసుకుంటూ ఉంటాడు. రేపో మాపో మీ అన్నయ్య వాళ్ళకి చంటి పాప పుడుతుంది మన పరిస్థితి ఏంటని అడుగుతుంది.
Also Read: కావ్యని తప్పుబట్టిన కుటుంబం- రాజ్ కంట పడకుండా స్వప్న తప్పించుకుంటుందా?
మా అమ్మానాన్నని చూసిన తర్వాత బిడ్డల మీద ఆసక్తి తగ్గిపోయిందని, రేపు మన పరిస్థితి కూడా ఇలానే అవుతుందేమోనని విష్ణు బాధగా అంటాడు. బిడ్డలు కావాలని మల్లిక అంటుంది. పూలు తెమ్మని అంటే గుడికి వెళ్దామా అని తిక్క తిక్కగా మాట్లాడతాడు. దీంతో మల్లిక చిరాకుగా తలలో పూలు విసిరి కొట్టేసి వెళ్ళిపోతుంది. జెస్సీ బాబుని మలయాళంకి ఇచ్చి పాలు కలుపుకు రావడానికి వెళ్తుంది. పాల డబ్బా తీసుకొస్తుంది. అవి విరిగిపోవడంతో మరొక బాటిల్ కోసం వెళ్తుంది. అదంతా మల్లిక చూస్తూనే ఉంటుంది. మలయాళాన్ని జ్ఞానంబ పిలిచేసరికి బాబుని బెడ్ మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. వాడు ఏడుస్తుంటే జానకి వచ్చి ఎత్తుకుని పాల డబ్బా చూసుకోకుండా తాగించబోతోంది. మల్లిక వెంటనే ఆగు అనేసి జానకి చేతిలోని బాటిల్ లాగేసుకుంటుంది.
Also Read: యష్ లైఫ్ లో వైఫ్ ఉండకూడదని అభిమన్యు స్కెచ్- గుండెలు పగిలేలా ఏడుస్తున్న వేద
పిల్లాడిని చంపేద్దామని అనుకుంటున్నావా అని అరుస్తుంది. ఏడుస్తుంటే పాలు తాగిస్తున్నానని చెప్తుంది. విరిగిపోయిన పాలు తాగించి బిడ్డని ఏం చేద్దామని అనుకుంటున్నావ్ అని గొడవ చేస్తుంది. అవి విరిగిపోయానని చూసుకోలేదని జానకి చెప్తుంది. బాబుని ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళావాని అఖిల జెస్సి మీద అరుస్తాడు. అందరి ముందు కావాలని జానకిని దోషిని చేసి మాట్లాడుతుంది. మల్లిక మాటలకు జానకి చాలా బాధపడుతుంది. బాబు ఏడుస్తున్నాడాని తాగించాలని చూశాను కానీ అవి చెడిపోయిన పాలని చూసుకోలేదని చెప్తుంది. అఖిల్ కూడా జానకిని నోటికొచ్చినట్టు మాటలు అంటాడు.