Janaki Kalaganaledu April 3rd: జ్ఞానంబకి నడిరోడ్డు మీద వార్నింగ్ ఇచ్చిన రౌడీ తండ్రి- తప్పు ఒప్పుకుని క్షమించమన్న జానకి
జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జానకి స్వాతిని ఏడిపించిన వ్యక్తిని లాక్కొచ్చి మనోహర్ ముందు పడేస్తుంది. ఎవరైనా టిఫిన్ బాక్స్ తీసుకుని స్టేషన్ కి వస్తారు నువ్వు ఏంటి వాడి షర్ట్ పట్టుకుని డ్యూటీకి వచ్చావ్అని అడుగుతాడు. బస్టాప్ లో ఒకమ్మాయిని ఏడిపిస్తుంటే లాక్కొచ్చానని జానకి చెప్తుంది. లేదు సర్ మామూలుగా మాట్లాడుతుంటే తీసుకొచ్చిందని వాడు అబద్ధం చెప్తాడు. లేదు సర్ వాడు అమ్మాయిని ఏడిపించడం కళ్ళారా చూశాను నేనే ప్రత్యక్ష సాక్షినని అంటే మనోహర్ మాత్రం ఇలాంటివి చెల్లవని నీకు తెలియదా అంటాడు. వీడు ఏడిపించిన అమ్మాయి ఏదని అంటే కాలేజ్ కి వెళ్ళిందని చెప్తుంది.
జానకి: తను మాకు బాగా కావలసిన అమ్మాయి పోలీస్ స్టేషన్ కి రావడానికి ఇబ్బంది పడి ఇంటికి వచ్చి చెప్పింది
మనోహర్; ఈ కుర్రాడి మీద పాత పగలు మనసులో పెట్టుకుని ఇలా స్టేషన్ కి ఎత్తుకొచ్చావ్ అని కుర్రోడి తరఫు వాళ్ళు కంప్లైంట్ చేస్తే
జానకి: గుడ్లలో పొడుస్తా ఏంట్రా ఆ చూపు నువ్వు చేసిన తప్పు నీకు తెలుసు
Also Read: తులసమ్మ ఇంట్లో పెళ్లి భాజాలు- రాజ్యలక్ష్మి కుట్ర నుంచి దివ్యని ప్రియ కాపాడుతుందా?
మనోహర్: పోలీస్ స్టేషన్ అంటే రచ్చ బండ కాదు.. అనగానే వెళ్ళమంటారా అని రౌడీ గాడు అడిగితే లాగిపెట్టి కొడతాడు. ఇక్కడ ఎస్సైని నేను అని సీరియస్ అవుతాడు. అప్పుడే మధు అనే బిల్డర్ ఫోన్ చేసి సెక్యూరిటీ కావాలని అడుగుతాడు.
మల్లిక ఇంట్లో కూర్చుని పంచాగం పుస్తకాలనీ ముందు పెట్టుకుని తెగ చదివేస్తుంది. అది చూసి మలయాళం ఏంటి ఇదని అడుగుతాడు. జాతకం ఎలా ఉందో చూసుకుంటున్నానని చెప్తుంది. కాసేపు మలయాళం, మల్లిక తిట్టుకుంటూ పోట్లాడుకుంటారు. రామ మిఠాయి బండి దగ్గర ఒక వ్యక్తి వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడతాడు. అది జ్ఞానంబ వాళ్ళు చూస్తారు. ఏంటి గొడవని వచ్చి అడుగుతారు.
రౌడీ తండ్రి: మీ ఇంటి గొడవలు గోప్యంగా ఉండాలి, మా పిల్లోడిని మాత్రం కొట్టుకుంటూ తీసుకెళ్తారా
రామ: అమ్మాయిని ఏడిపిస్తుంటే ఊరుకుంటారా
రౌడీ తండ్రి: తనేమైనా ఎస్సైనా కొట్టుకుంటూ తీసుకెళ్లడానికి.. ఊర్లో మీకే కాదు మాకు పరువు ఉంది.. ఆ మాటకు వస్తే మీకే కాదు నాకే ఎక్కువ పరువు ఉంది. ఆయన పెళ్ళానికి ఆయన చెప్పుకోలేరు కోడలికి మీరు చెప్పుకోలేరు. అవమానాభారంతో నా కొడుకు ఏదైనా చేసుకుంటే నీదే బాధ్యత అలాంటిది ఏదైనా జరిగితే మీ ఇంట్లో ఎవరిని వదిలి పెట్టనని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.
జ్ఞానంబ దంపతులు ఏమి మాట్లాడకుండా తల దించుకుని వెళ్లిపోతారు. సందు దొరికింది కదా అని మల్లిక జానకి మీద మరింత నూరిపోస్తుంది. తను కానిస్టేబుల్ మాత్రమే చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటుందని అంటుంది. జానకి చేసింది తప్పు కాదని మావయ్యని చెప్పమని గొడవ చేస్తుంటే అప్పుడే జానకి వస్తుంది. ఏమైంది ఎందుకు అదోలా ఉన్నారని జానకి అడుగుతుంది.
Also Read: వసు బాధని గమనించిన జయచంద్ర- ఒకే గదిలో రిషిధార, దేవయానికి పెద్ద షాక్
మల్లిక: ఆ అమ్మాయి తల్లి స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేసిందా?
జానకి: లేదు వాళ్ళు స్టేషన్ కి రాలేక నా దగ్గరకి వచ్చారు
జ్ఞానంబ: ఆ అబ్బాయి తండ్రి మమ్మల్ని బెదిరించారు. నువ్వు నిబంధనలు తప్పావని అతను మమ్మల్ని బెదిరించాడు. నష్టం ఇంటి దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నా. వాడి బాధని చూసి మాకు ఎంత బాధగా ఉందో తెలుసా? బయట వ్యక్తి వచ్చి రామని బెదిరిస్తుంటే ఎలా ఉంటుంది
వెన్నెల: తప్పు ఒప్పుకుంటున్నావా వదిన ఏం మాట్లాడవు ఏంటి
జానకి: ఒప్పుకుంటున్నా ఇంకెప్పుడు ఇటువంటి పరిస్థితి రానివ్వను క్షమించమని వెళ్ళిపోతుంది.