News
News
X

Janaki Kalaganaledu September 15th: పర్మినెంట్ గా వదిలేస్తానన్న అఖిల్- ఆత్మహత్యకి సిద్ధపడ్డ జెస్సి, అఖిల్ ని నిలదీసిన గోవిందరాజులు

జెస్సి విషయం జ్ఞానంబకి తెలియడంతో ఇంట్లో రచ్చ చెలరేగుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

నీలావతి పెద్దమ్మగారి నోరు మూయించినంత మాత్రాన ఊర్లో అందరి నోర్లు మూయించలేము కదా. అసలు ఇదంతా జానకి తప్పు. ఆ అమ్మాయిని అందరి ముందు తీసుకురావడం తప్పు, ఆ అమ్మాయి మాటలు నమ్మి మన అఖిల్ మీద నిందలు వేయడం ఇంకా తప్పు అని మల్లిక జానకి మీద ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. ఈ తప్పులు అన్నింటినీ క్షమిస్తూ మీరు ఎందుకు ఊరుకుంటున్నారు అత్తయ్యగారు వెంటనే వెళ్ళి గోడ మీద ఉన్న ఐదు తప్పుల్లో ఒకటి కొట్టేయండి అని అంటుంది. కొట్టేయండి అత్తయ్యగారు వెళ్ళండి అనేసరికి జ్ఞానంబ ఇంట్లోకి వెళ్తుంది. జ్ఞానంబ వెళ్లినందుకు మల్లిక డాన్స్ వేస్తుంది.

జానకి అఖిల్ గురించి ఆలోచిస్తూ ఉంటే రామా వచ్చి పిలుస్తాడు కానీ వినిపించుకోదు. దీంతో రామానే వెళ్ళి బ్యాగ్ బుక్స్ తీసుకొచ్చి ఎగ్జామ్ కి టైమ్ అవుతుందని చెప్పి కాలేజీకి వెళ్దాం అని అంటే వద్దు అని జానకి అంటుంది. మీరంతా నామీద పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని నా ఆశ కానీ జెస్సి ప్రాబ్లం నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు, అది ఎటు నుంచి వచ్చి మన కుటుంబం పరువు తీస్తుందో అని ఆలోచిస్తూ సరిగా చదవలేకపోతున్నా అని జానకి చెప్పడం జ్ఞానంబ వింటుంది. జెస్సి ప్రాబ్లం తీరితే తప్ప నేను ఎగ్జామ్స్ సరిగా రాయలేనని అనిపిస్తుంది అనేసరికి జ్ఞానంబ జానకి అని పిలుస్తుంది. మన ఆలోచన ఏకాగ్రత సాధించే ఆశయం మీద ఉండాలి కానీ నిజమో కాదో తెలియని సమస్య మీద కాదు. కొత్తగా సమస్యని తలకెక్కించుకుని ఆ సమస్య గురించి ఆలోచిస్తూ నలుగురు నానారకాలుగా మాట్లాడుకునే అవకాశం ఇచ్చావు నీ భవిష్యత్ మీద ఆధారపడిన అందరినీ ఇబ్బంది పెడుతున్నావ్ అది మంచిది కాదు’ అని జ్ఞానంబ చెప్తుంది.

Also Read: 'నీ తమాషా ఇంటి దగ్గర పెట్టుకో' అని లాస్యని వాయించేసిన సామ్రాట్- లాస్యకి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన తులసి

ఈరోజు కాకపోతే రేపు అయినా నిజం బయటపడుతుంది. దాని కోసం నీ ఆశయం నిర్లక్ష్యం చేయకు అని గోవిందరాజులు కూడా చెప్తాడు. నాకు చదువుతో పాటు పరువు మర్యాదలు కూడా ముఖ్యమే అంటుంది. జానకి నేను నీకు ఎంత చెప్పినా కూడా అదే ఆలోచిస్తున్నావ్ అని జ్ఞానంబ కొప్పడుతుంది. నీతో పాటు రామా వస్తే నీ ఆలోచనలతో రామా బుర్ర కూడా పాడు చేస్తావ్ నేనే నీ ఎగ్జామ్ కోసం కాలేజీకి తీసుకెళ్తాను పదా అని అంటుంది. వద్దులేమ్మ నేనే తీసుకెళ్తాను అని రామా అంటాడు. గోవిందరాజులు అఖిల్ ప్రవర్తన మీద అనుమానపడతాడు. మీ వదిన అనవసరంగా ఒకరిని వేలెత్తి చూపదు, నిజం లేకపోతే ఆ అమ్మాయిని ఇంటి దాకా తీసుకువచ్చేది కాదు మీ అమ్మకి ఎదురు పడి మాట్లాడదు అని గోవిందరాజులు అడుగుతాడు.

అప్పుడే జ్ఞానంబ రావడం చూసిన అఖిల్ మీరు కూడా నన్నే అనుమానిస్తున్నారా నాన్న అని డ్రామా మొదలుపెడతాడు. మీరు కూడా మన పెంపకాన్ని అనుమానిస్తే ఎలాగా అని జ్ఞానంబ వెనకేసుకొస్తుంది. అందరూ వదిన మాటే నమ్ముతున్నారు, అమ్మ కూడా నమ్మేలోపు ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలి అని అఖిల్ టెన్షన్ పడతాడు. జెస్సి అఖిల్ ఫోటో చూసుకుంటూ బాధపడుతుంది. నేనే నీ లైఫ్ అన్నావ్ నన్ను పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేశావ్ అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అఖిల్ జెస్సికి ఫోన్ చేస్తాడు. మన పెళ్లికి ఆంటీ ఒప్పుకున్నారా అని జెస్సి ఆత్రంగా అడుగుతుంది. నాటకాలు ఆడుతున్నావా నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి అబార్షన్ చేయించుకోమని చెప్తే మా వదిన్ని అడ్డుపెట్టుకుని ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావ్ అని అరుస్తాడు. అది కుదరదు అఖిల్ ఇంట్లో విషయం తెలిసింది అది నాతో పాటు నీకు కూడా ప్రాబ్లం అని జెస్సి చెప్తుంది.

Also Read: జానకి కంటపడిన మాధవ్ వక్ర బుద్ధి- ఆదిత్యకి బుద్ధి చెప్పిన దేవుడమ్మ, సంతోషంలో సత్య

అదంతా నాకు తెలియదు జెస్సి మా అమ్మ ఒప్పుకోదు అని అంటాడు. మన పెళ్లి ఇప్పట్లో అవదు తర్వాత అయిన మన పెళ్లి జరగాలి నేను నీకు కావాలి అనుకుంటే అబార్షన్ చేయించుకో లేదంటే పర్మినెంట్ గా నన్ను వదులుకోవాల్సి వస్తుంది అని అఖిల్ హెచ్చరిస్తాడు. అఖిల్ ఇలా తెగించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అమ్మానాన్నకి ఈ విషయం తెలిస్తే చచ్చిపోతారు. వాళ్ళకి బాధ లేకుండా చేస్తాను చచ్చిపోయి అయినా చేస్తాను’ అని జెస్సి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. జెస్సి తల్లిదండ్రులు జానకికి ఫోన్ చేసి కంగారుగా ఏదో చెప్తారు.

Published at : 15 Sep 2022 10:36 AM (IST) Tags: Janaki Kalaganaledu Serial Today Episode Written Update Janaki Kalaganaledu Serial Janaki Kalaganaledu Serial Today Janaki Kalaganaledu September 15th

సంబంధిత కథనాలు

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!