Gruhalakshmi September 15th Update: 'నీ తమాషా ఇంటి దగ్గర పెట్టుకో' అని లాస్యని వాయించేసిన సామ్రాట్- లాస్యకి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన తులసి
తులసి, సామ్రాట్ మళ్ళీ ఒక్కటయ్యారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తులసి ఇంట్లో జరిగిన దానికి నందు, లాస్య మండిపోతూ ఉంటారు. తులసి కావాలనే ఆ నిజం సామ్రాట్ చెవిన ఊదేసింది అది తప్పు కదా అని లాస్య అంటాడు. తనే చెప్పింది అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావ్ అని నందు అడుగుతాడు. ఇంకోకళ్ళు చెప్పే ఛాన్స్ లేదు, చెప్పినా సామ్రాట్ నమ్మడు అని లాస్య అంటుంది. మాజీ భర్త నేనే విషయం అని దాచిపెట్టమని నేనే అడిగాను అని సామ్రాట్ కి తెలిసిపోయిందని నందు ఫీల్ అవుతూ ఉంటే ఈ విషయం సామ్రాట్ సీరియస్ గా తీసుకోలేదని లాస్య అనుమానపడుతుంది. పెద్ద పనిష్మెంట్ ప్లాన్ చేశాడని ఇంక తన మొహం చూపించను అని నందు చెప్తాడు.
ఆఫీసులో సామ్రాట్ తులసి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు తులసికి దూరంగా ఉండాలనుకున్నా విధి నిన్ను ఉండనివ్వదు అని పెద్దాయన సామ్రాట్ తో అంటాడు. తులసి సామ్రాట్ గది బయట ఉండటం చూసి సంతోషంగా వెళ్ళి పలకరిస్తాడు. నేను ఇక్కడికి రాను ఏమో అనుకున్నారు కదా అని తులసి అడుగుతుంది. ప్రాబ్లంకి కారణం నేనే అని సామ్రాట్ సోరి చెప్తాడు. సమస్య నెత్తి మీద పెట్టుకుని తిరుగుతుంది నేనే నా వల్ల మీరు నిందలు మోయాల్సి వచ్చింది సోరి అని తులసి కూడా చెప్తుంది. కొన్ని రోజుల పాటు మీ వాళ్ళకి దూరంగా ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని సామ్రాట్ అంటాడు. నా ఇల్లు నా ప్రపంచం, నా బలం.. నేను ఎదగాలని ఆశపడింది వాళ్ళ కోసం నా కోసం కాదని వేదాంతం చెప్తుంది. మీ మనసు ఏంటో తెలిసి కూడా తప్పు సలహా ఇచ్చాను సోరి అని తులసితో అంటాడు. వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే లాస్య వస్తుంది.
Also Read: జానకి కంటపడిన మాధవ్ వక్ర బుద్ధి- ఆదిత్యకి బుద్ధి చెప్పిన దేవుడమ్మ, సంతోషంలో సత్య
కాల్ చేసి వచ్చి ఉండాల్సిందని సామ్రాట్ కోపంగా లాస్యతో అంటాడు. తప్పే కానీ తప్పలేదు మీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి అని లాస్య అడుగుతుంది. నాకు సంబంధం లేని విషయాలు వినడం నాకు ఇబ్బందిగా ఉంటుందని తులసి అంటుంది. దేని గురించి అని సామ్రాట్ అడుగుతాడు.. మా జాబ్ గురించని లాస్య చెప్తుంది. నా క్యాబిన్ లో వెయిట్ చెయ్యండి నేనే వస్తాను అని అంటాడు. నందు మీకు చాలా అన్యాయం చేశారని సామ్రాట్ అంటే వద్దు అని తులసి అంటుంది. ఓపెన్ గా మాట్లాడుకోవాలి.. అన్నీ నిజాలు బయట పడిన తర్వాత కూడా ఎందుకు ఇలా అని సామ్రాట్ అంటాడు. మీ ఫ్యామిలికి సంబంధించిన విషయాలు అన్నీ నాకు తెలిసిపోయాయని వాళ్ళని ఇక లోపలకి రానివ్వను అని తెలిసి లాస్య పసిగట్టింది. ఇప్పుడు దాని గురించే మాట్లాడటానికి వచ్చింది నాకు తెలుసు. జీవితాన్ని డిస్ట్రబ్ చేసిన వాళ్ళతో కలిసి పని చేయడం మీకు ఎంత ఇబ్బందో నాకు తెలుసు అని సామ్రాట్ అంటాడు.
ఎట్టి పరిస్థితిల్లోనూ వాళ్ళని మళ్ళీ జాబ్ లోకి తీసుకోవడం నాకు ఇష్టం లేదని సామ్రాట్ చెప్తాడు. నందు, లాస్యని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోవాలో వద్దో పూర్తిగా మీ నిర్ణయం అని తులసికి చెప్తాడు. మీ నిర్ణయం నిర్మొహమాటంగా చెప్పండి అది నా నిర్ణయంగా లాస్యతో చెప్తాను అని అంటాడు. నా కారణంగా మీరు అల్లరి అవుతున్నారని నేను దిగులు పడుతున్నా అని తులసి చెప్తుంది. సరే లాస్యని నేను డీల్ చేస్తాను అని సామ్రాట్ అంటాడు. లాస్య దగ్గరకి వచ్చి ఏంటో చెప్పు అంటాడు. మాకు ఈ జాబ్ అవసరం అందుకే ఆ నిజం దాచాల్సి వచ్చింది, నిజం చెప్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని నా భయంతో నేనే ఆపాను. అదే భయంతో నందు తులసిని కూడా రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడు మా జాబ్స్ పోతే మేము రోడ్డున పడతాం అని లాస్య చెప్తుంది. నందు ఎక్కడ అని సామ్రాట్ అడుగుతాడు. నిన్న జరిగిన దానికి మీకు మొహం చూపించలేక రాలేదు.. మా జాబ్స్ మమ్మల్ని చేసుకొనివ్వండి ప్లీజ్ సర్ అని అడుగుతుంది.
Also Read: వేదకి సైట్ కొడుతున్న యష్- వసంత్, నిధి ఎంగేజ్మెంట్లో కల్లోలం సృష్టించేందుకు మాళవిక ప్లాన్
చేసుకొనిస్తాను మళ్ళీ ఇలాంటి గొడవలు జరగవని గ్యారంటీ ఏంటి అని అడుగుతాడు. మీరు ఇంట్లో ఎలాగైనా గొడవ పడండి ఆ సీరియల్ ఇంట్లో పెట్టుకోండి అదే సీరియల్ ఆఫీసులో జరగడం నాకు ఇష్టం లేదు. నాకు మూడు విషయాలు ముఖ్యం. నా ఆఫీసు, నేను ప్రశాంతంగా ఉండాలి, నా బిజినెస్ పార్టనర్ ప్రశాంతంగా ఇక్కడ పని చేసుకోవాలి. వీటిల్లో ఏ ఒక్కటి డిస్ట్రబ్ అయినా నేను ప్రశాంతంగా మాట్లాడను. నిజంగా మీకు ఈ జాబ్ అవసరం అనుకుంటే నిన్న జరిగిన తమాషా లాంటివి మళ్ళీ ఈ ఆఫీసులో జరగడానికి వీల్లేదు. నువ్వు నీ భర్త కంట్రోల్ తప్పకుండా ప్రవర్తించడం నీ భాధ్యత అల్లా అని మాట ఇస్తేనే మీ జాబ్ నీకుంటుంది అని సామ్రాట్ అంటాడు.
మిమ్మల్ని క్షమించింది నేను కాదు తులసి గారు. ఈ నిర్ణయం ఆమెదే. మీరు తనకే థాంక్స్ చెప్పాలి. మీ వల్ల ఎలాంటి తప్పు జరిగినా కంపెనీ సమయం డబ్బు నాశనం అవడం కాదు మీ కెరీర్ పోతుందని సింపుల్ గా వార్నింగ్ ఇస్తాడు. ఎలాంటి ప్రాబ్లం రాదని మీకు మాట ఇస్తున్నా అని లాస్య కాళ్ళ బెరానికి వస్తుంది. లాస్య తులసి దగ్గరకి వచ్చి థాంక్స్ చెప్తుంది. నీ వల్లే మాకు జాబ్స్ మళ్ళీ వచ్చాయి అని అంటుంది. మీరు చేసిన తప్పు మర్చిపోయి కాదు క్షమించి కాదు అపకారికి ఉపకారం చేస్తే అడి శిక్ష వేయడం అవుతుంది. నేను బాధపెట్టిన లాభం చేశారే అని వద్దన్నా మనిషిని పీక్కుతింటుంది. సిగ్గుపడేలా చేస్తుంది అది శిక్షే కదా అని తులసి అంటుంది.
తరువాయి భాగంలో..
నేను ఒక్క రోజు మీ ఇంట్లో వాళ్ళతో గడిపితేనే స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది, సంతోషం అంటే ఇలా ఉండాలని అనిపించింది. దేవుడు నీకు ఇచ్చిన విలువైన వరం తులసి గారు అసలు ఆ వరాన్ని ఎందుకు వదులుకున్నావ్ అని సామ్రాట్ నందుని అడుగుతాడు.