News
News
X

Ennenno Janmalabandham September 15th: వేదకి సైట్ కొడుతున్న యష్- వసంత్, నిధి ఎంగేజ్మెంట్లో కల్లోలం సృష్టించేందుకు మాళవిక ప్లాన్

యష్ వసంత్, నిధి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తాడు. వాటిని చెడగొట్టాలని మాళవిక ప్లాన్ వేస్తుంది.

FOLLOW US: 

వేద తన అక్క,బావ నుంచి తప్పించుకుంటూ వచ్చి యష్ కి డాష్ ఇస్తుంది. దీంతో ఇద్దరు కిందపడిపోతారు. అమ్మా.. నడుము విరిగింది రా బాబోయ్ అని యష్ అరుస్తాడు. నేను చూసుకోలేదు సరే మీ కళ్ళకి ఏమైంది మీరు అయినా చూసుకోవచ్చు కదా అని వేద అమాయకంగా మొహం పెట్టి అంటుంది. యష్ నొప్పితో అల్లాడిపోతూ ఉంటాడు. వాళ్ళని చూసి వేద అక్క, బావ మురిసిపోతారు. చూడచక్కని జంట భలే ఉంటారు.. కొట్లాడుకుంటునట్టే ఉంటారు కాని దాని వెనక ప్రేమ ఉంటుందని వేద అక్క శశితో అంటుంది.

మాళవిక చిత్ర, వసంత్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వసంత్ దామోదర్ చెల్లితో చిత్ర వేరే అబ్బాయితో ఉండటం మాల్ లో చూశాను. నాకే తెలిసిన వాళ్ళ ప్రేమ విషయం యష్, వేదకి తెలియకుండా ఉంటుందా. ఒకవేళ తెలియకపోతే ఆ విషయం వాళ్ళని బాధపెట్టి మేలు చేసే అంశంగా మారుతుందా అని మాళవిక అనుమానపడుతుంది. ఇవన్నీ బయటపడాలంటే మా ఏంజెట్ ని అడగాల్సిందే అని ఖైలాష్ కాంచనకి ఫోన్ చేస్తాడు. యష్ నడుము నొప్పితో బాధపడుతూ ఉంటాడు. కిందపడేసినందుకు యష్ వేద మీద చితపటలాడుతూ ఉంటాడు. ఎప్పుడూ ఏదో ఒక రకంగా నన్ను టచ్ చేయాలనే చూస్తావ్ అని వేదని అంటాడు. ఆహా.. మిమ్మల్నే టచ్ చెయ్యాలి మరి అని వేద అంటుంది. పెయిన్ బామ్ రాసుకోలేక యష్ ఇబ్బంది పడుతుంటే వేద రాస్తాను అంటుంది.

Also Read: తులసి చెయ్యి అందుకున్న సామ్రాట్- అందరి ముందు నిజం బట్టబయలు

బుగ్గ గిల్లి జోల పాడటం అంటే ఇదే నువ్వే కిందపడేసి ఇప్పుడు నువ్వే పెయిన్ బామ్ రాస్తున్నావ్.. ఇలాంటి గతి ఏ మగాడికి రాకూడదు అని యష్ కామెడీ చేస్తాడు. వేద మందు రాసి మసాజ్ చేసింది. దామోదర్ చెల్లి ఎంగేజ్మెంట్ కి నిన్ను ఇన్వైట్ చేశారా అని మాళవిక అభిమన్యుని అడుగుతుంది. దామోదర్ యష్ కి ఎంత క్లోజ్ నాకు అంతే నిన్ను కూడా తీసుకుని రమ్మని చెప్పాడు అని అభి చెప్తాడు. చిత్ర, వసంత్ మధ్య ఉన్న సీక్రెట్ వేద, యష్ మధ్య సమస్యగా మార్చాలి అని మాళవిక ప్లాన్ వేస్తుంది. యష్.. వసంత్, నిధి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. అక్కడికి వేద యష్ కొనిచ్చిన చీర కట్టుకుని వస్తుంది. తనని చూసి మైమరచిపోతాడు. వెదకి దొంగచాటుగా సైట్ కొడతాడు.

వేద వచ్చి యష్ ని పలకరిస్తుంది. యష్ తో పొగిడించుకోవాలని చూస్తుంది కానీ తను మాత్రం బయటపడదు. అందంగా ఉన్నానా అని యష్ ని అడుగుతుంది. అందంగానే ఉంది చీర అని యష్ తప్పించుకోవడానికి చూస్తాడు.. కానీ వేద మాత్రం నిజంగా చీర మాత్రమే అందంగా ఉందా అంటుంది. నిన్న షాప్ లో నేను చూసినప్పుడు ఈ చీర అంతగా అనిపించలేదు కానీ కట్టుకున్న తర్వాత చీర చాలా బాగా అందంగా ఉందని అంటాడు. సరే కళ్ళు కిందకి దించకుండా నేను కట్టుకున్న చీర బోర్డర్ ఏ కలర్ లో ఉందో చెప్పమని వేద అడగటంతో యష్ అలా ఎలా చెప్పగలను అంటాడు. ఒప్పిస్తాను మీతోనే నేను అందంగా ఉన్నాను అని ఒప్పిస్తాను అని వేద మనసులో అనుకుంటుంది.  

Also Read: మాధవ్ కి ఝలక్ ఇచ్చిన రుక్మిణి- దేవుడమ్మకి నిజం చెప్పిన సత్య

Published at : 15 Sep 2022 07:40 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham September 15th

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu October 7th: జ్ఞానంబని నిలదీసిన పీటర్, మేరీ- ఆగ్రహించిన జెస్సి, ధైర్యం చెప్పిన జానకి

Janaki Kalaganaledu October 7th: జ్ఞానంబని నిలదీసిన పీటర్, మేరీ- ఆగ్రహించిన జెస్సి, ధైర్యం చెప్పిన జానకి

Guppedantha Manasu October 7th Update: టామ్ అండ్ జెర్రీ రిషిధార మళ్లీ గొడవ మొదలెట్టారు, ఆలోచనలో పడిన మహేంద్ర-జగతి

Guppedantha Manasu October 7th Update: టామ్ అండ్ జెర్రీ రిషిధార మళ్లీ గొడవ మొదలెట్టారు, ఆలోచనలో పడిన మహేంద్ర-జగతి

Karthika Deepam October 7th Update: కార్తీకదీపంలోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దీపని ఫాలో అవుతున్న డాక్టర్ బాబు

Karthika Deepam October 7th Update: కార్తీకదీపంలోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దీపని ఫాలో అవుతున్న డాక్టర్ బాబు

Gruhalakshmi October 7th Update: తులసి కోసం వచ్చి అనసూయ ముందు అడ్డంగా బుక్కైన సామ్రాట్- తప్పించుకోలేక తిప్పలు

Gruhalakshmi October 7th Update: తులసి కోసం వచ్చి అనసూయ ముందు అడ్డంగా బుక్కైన సామ్రాట్- తప్పించుకోలేక తిప్పలు

Devatha October 7th Update: సత్య ముందు ఆదిత్యని ఇరికించిన రుక్మిణి- జానకమ్మని ఇంటికి తీసుకొచ్చేసిన రాధ

Devatha October 7th Update: సత్య ముందు ఆదిత్యని ఇరికించిన రుక్మిణి- జానకమ్మని ఇంటికి తీసుకొచ్చేసిన రాధ

టాప్ స్టోరీస్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!