Janaki Kalaganaledu October 6th: జానకికి మరో సమస్య, మంట పెట్టేసిన పెట్రోల్ మల్లిక- జ్ఞానంబ ఇంటికి ఆవేశంగా జెస్సి పేరెంట్స్
జానకి తన తెలివితో ఇంట్లో బొమ్మల కొలువు వేడుకగా చేస్తుంది. అది చూసి అందరూ సంతోషిస్తారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జానకి ఇంటికి వచ్చిన శ్రీతో బొమ్మల కొలువు పూజ చేయిస్తుంది. తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు మల్లిక ఫీల్ అవుతుంది. దసరాకి ఈ బొమ్మల కొలువు ఎందుకు పెడతారని శ్రీ జానకిని అడుగుతుంది. చాలా చక్కగా జానకి బొమ్మల కొలువు విశిష్టత గురించి చెప్తుంది. రామా, సీతా విగ్రహాలు ఎందుకు పెట్టారని అడిగితే ఇంట్లో అందరూ వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఓర్పు సహనంగా ఉండాలని చెప్తుంది. విష్ణు, అఖిల్ గురించి నేను బాధపడుతున్నా అని జానకి నన్ను ఊరడించడానికి చూస్తుంది. కాస్త ఓర్పుతో ఉంటుంది వాళ్ళు మారతారని చెప్పకనే చెప్పి నాకు కాస్త ప్రశాంతత ఇచ్చిందని జ్ఞానంబ మనసులో అనుకుంటుంది.
Also Read: నిజం బయటపెట్టిన సామ్రాట్- తులసితో కలిసి కోలాటం ఆడి అందరికీ షాక్ ఇచ్చిన సామ్రాట్
పెద్ద కోడలిని డిస్ట్రబ్ చెయ్యడానికి మల్లిక మరో ప్లాన్ వేస్తుంది. జెస్సి తండ్రి పీటర్ కి ఫోన్ చేస్తుంది. జెస్సి కష్టం చూసి చెప్పలేకపోతున్నా బాబాయ్ గారు అని మల్లిక నటిస్తుంది. ఒక్కగానొక్క కూతురు అని గారబంగా చూసుకున్నారు. అఖిల్ ని ప్రేమించి తొందరపడిందని పెళ్లి చేసి పంపించారు. ముఖ్యంగా జానకి మాటలు నమ్మారు. మా అత్తయ్యగారు చాలా గొప్పది అని భ్రమ పడి పంపించారు. కానీ మీరు ఆశపడినట్టు ఇక్కడ ఏమి జరగడం లేదు. పరువు కోసం భయపడి పెళ్లి చేసి జానకి నాటకం ఆది జెస్సిని కోడలిగా తీసుకొచ్చింది కానీ మా అత్తయ్యగారు మీ అమ్మాయిని చాలా చులకనగా చూస్తున్నారు. కోడాలిగానే కాదు ఒక మనిషిగా కూడా విలువ ఇవ్వడం లేదు. మీరు నమ్మిన జానకి, మా బావగారు చూస్తున్నారే కానీ జెస్సికి తోడుగా ఉండటం లేదని పుల్ల పెట్టేస్తుంది. జెస్సి బాధ చూస్తుంటే నాకే కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అఖిల్ కూడా పట్టించుకోవడం లేదు, ఇక్కడ జెస్సి నరకవేదన అనుభవిస్తుంది, తన బాధ చూడలేక నేను చెప్తున్నా నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకండని ఫోన్ పెట్టేస్తుంది.
Also Read: మాధవ్ ప్లాన్ సక్సెస్, ప్రకృతి వైద్యశాలకి సత్య- నర్స్ చెంప పగలగొట్టిన రుక్మిణి
జానకి నిద్ర వస్తున్నా ఆపుకుంటూ చదువుకుంటుంటే రామా టీ పెట్టి తీసుకొస్తాడు. మీ ఏకాగ్రత అంతా చదువు మీదే ఉంచండి, ఏది మనసులో పెట్టుకోకండి. మీ పరీక్షలు పూర్తయ్యేంత వరకు నేను మీతోనే ఉంటానని రామ చెప్తాడు. జెస్సి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చి గొడవ చేసేటప్పుడు తప్పించుకోవడానికి నా మీదకు రాకుండా ఉండేలా ఇలా ఇంత దూరం వచ్చాను అనుకుని ఒక పార్క్ లో తెగ వ్యాయామం చేస్తూ ఉంటుంది మల్లిక. రామా, జానకి కూడా అదే చోట జాగింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మల్లిక నోరెళ్ళబెడుతుంది. ఇంత దూరం వచ్చి ఇలాంటి వ్యాయాయం చేస్తున్నావ్ ఏంటి కడుపుతో ఉన్న వాళ్ళు ఇలాంటివి చెయ్యకూడదు అని జానకి అంటుంది. నాకు తోడి కోడల్ని ఇవ్వకుండా తోడేలుగా పీక్కునే దాన్ని ఇచ్చారు అని మల్లిక తిట్టుకుంటుంది. మల్లిక మళ్ళీ పరిగెడుతూ ఉంటుంది. అది చూసి మళ్ళీ జానకి వాళ్ళు వస్తారు. ఏమైంది నీకు మళ్ళీ ఎందుకు పరిగెడుతున్నావ్ అని అడుగుతారు. నువ్వే కదా జాగింగ్ చెయ్యమన్నావ్ అని అంటుంది. నేను చేయమన్నది వాకింగ్ జాగింగ్ కాదని జానకి అంటుంది.