Janaki Kalaganaledu August 29th Update: అఖిల్ షాక్, జెస్సి ప్రగ్నెంట్ - జ్ఞానంబ ఇంట్లో సందడిగా కృష్ణాష్టమి వేడుకలు
జ్ఞానంబ పెద్ద కోడలు జానకికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసి తట్టుకోలేని మల్లిక కడుపు డ్రామా పెడుతుంది.
కృష్ణాష్టమి సందర్భంగా జానకి పొద్దున్నే లేచి ఇల్లంతా అందంగా అలంకరిస్తుంది. ఇంటి బయట కృష్ణుడి పాదాలు వేసి ముగ్గులు వేస్తుంది. అప్పుడే బయట నుంచి వస్తున్న రామా ఆ కృష్ణుడి పాదాల మీదే నడుచుకుంటూ వస్తాడు. అది చూసి జానకి, జ్ఞానంబ మురిసిపోతారు. మా రాముడు చక్కగా అందంగా చిన్ని కృష్ణుడు పాదాల మీద నడుచుకుంటూ వస్తుంటే నేను చూసుకుంటూ మురిసిపోతున్నా మీరు నాకు ఎప్పుడు చిన్ని కృష్ణుడే అని చెప్తుంది. మన జానకికి రామా అంటే ఎంత ప్రేమ, భర్తని గుండెల్లో పెట్టి చూసుకుంటుందని గోవిందరాజులు జ్ఞానంతో చెప్పుకుని సంతోషిస్తాడు. మల్లిక వచ్చి అది చూసి వీళ్ళు ఏంటి పొద్దునే రొమాంటిక్ సినిమా స్టార్ట్ చేశారు, వాళ్ళేమో కన్ను ఆర్పకుండా చూస్తూ ఉన్నారని కుళ్ళుకుంటుంది.
అది చెడగొట్టడానికి వాగుతుంది. మేడ మీద ఉండే వాళ్ళకి కింద ఉన్న చీమలు కనిపించనట్టు వీళ్ళ కంటికి మనం కనిపించడం లేదనుకుంటా ప్రపంచాన్నే మర్చిపోయి ప్రేమలో మునిగిపోతున్నారు అని మల్లిక నవ్వుతుంది. అమ్మా పెట్రోల్ మల్లిక వచ్చేశావా ఈ సంతోషాన్ని చెడగొట్టలేదు ఏంటా అని అనుకుంటున్నా అని గోవిందరాజులు కౌంటర్ వేస్తాడు. మీరు ఇంక ప్రేమ్ పక్షుల్లాగా ఉన్నారని అఖిల్ అంటాడు. ఆ మాటకి జానకి సిగ్గుపడుతుంది. ఇక్కడ ఏదో కుళ్లిన వాసన వస్తుందని చికిత అంటే నలుగురు పచ్చగా ఉన్న చోటకి మల్లిక వస్తే కుళ్లిన వాసన వస్తుంది కదమ్మా అని గోవిందరాజులు అంటాడు. ఆ మాటకి అందరూ నవ్వుతారు. రామా, జానకి ఇద్దరూ జ్ఞానంబ దంపతుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.
Also Read: కార్తీక్ కి దీప గతం గుర్తొచ్చేలా చేయగలదా, మోనితపై సౌందర్యలో మొదలైన అనుమానం!
జానకికి వీళ్ళ ఆశీర్వాదం ఫలించి కడుపు పండితే ఈ ఇంట్లో నా జీవితం ఎండిపోయిన తాటి టెంకలా మారిపోతుందేమో అని మల్లిక మనసులో అనుకుంటుంది. ఏవండీ మనం కూడా వెళ్ళి ఆశిరవడం తీసుకుందాం అని విష్ణుతో చెప్తూ అత్తయ్యగారు మాకు కూడా కడుపు పండి పండంటి బిడ్డ పుట్టాలని ఆశీర్వదించండి అని నోరు జారుతుంది. నువ్వు కడుపుతో ఉన్నావ్ కదా మల్లిక మళ్ళీ నీ కడుపు పండటం ఏంటి అని జ్ఞానంబ అంటుంది. మాకు కూడా పండంటి బిడ్డ పుట్టాలని దీవించండి అని కవర్ చేస్తుంది.
జెస్సిని డాక్టర్ పరిశీలిస్తుంది. ఉన్నట్టుండి జెస్సి అలా కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అని జెస్సి వాళ్ళ తల్లిదండ్రులు కంగారు పడతారు. డాక్టర్ జెస్సిని పరిశీలించి బయటకి వచ్చి తను ప్రగ్నెంట్ అని ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. ఎంత పని చేశావే అని జెస్సిని తన తల్లి కొడుతుంది. ఎందుకు బేబీ ఇలాంటి పని చేశావని జెస్సి తండ్రి బాధగా అడుగుతాడు. ఎవరమ్మా అతను అని అడుగుతాడు. జెస్సి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇప్పుడు అఖిల్ పేరు చెప్తే ఏం ప్రాబ్లం అవుతుంది, ఒకసారి అఖిల్ తో మాట్లాడిన తర్వాత ఇంట్లో చెప్తాను అని జెస్సి మనసులో అనుకుంటుంది. ఇన్నాళ్ళూ నాలో ఉన్న ప్రేమని మాత్రం చూశావ్ దయచేసి మరో మనిషిని బయటకి తియ్యకు అని జెస్సి తండ్రి వార్నింగ్ ఇస్తాడు. జ్ఞానంబ ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇంట్లో వాళ్ళందరూ కోలాటం ఆడుతూ సందడిగా గడుపుతారు.
Also Read: ఆవేశంలో సామ్రాట్ ముందు నిజం కక్కేసిన నందు- బెడిసికొట్టిన లాస్య స్కెచ్