News
News
X

Janaki Kalaganaledu August 16th Update: గర్ల్ ఫ్రెండ్ జెస్సితో అఖిల్ రొమాన్స్, మల్లికని ఓ ఆట ఆడుకున్న గోవిందరాజులు- జ్ఞానంబ ఇంట్లో రాఖీ సంబరాలు

అఖిల్ తన గర్ల్ ఫ్రెండ్ జెస్సి తో కలిసి రొమాన్స్ నడిపిస్తాడు. తనతో బైక మీద షికార్లు చేస్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

మల్లిక ఆకలితో అల్లాడిపోతుంది. మరో వైపు విష్ణు గుర్రు పెట్టి నిద్రపోవడం చూసి కాలితో తన్నుతుంది కానీ విష్ణు మాత్రం కదలకుండా ఉంటాడు. అదే టైం కి కరెంట్ కూడ పోతుంది. బయటకి వచ్చేసరికి లైట్ ఒకటి ఊగుతూ కనిపించడంతో దెయ్యం అని భయపడి మల్లిక దెయ్యం దెయ్యం అని హడావిడి చేస్తుంది. ఆ అరుపులకి ఇంట్లో అందరూ వస్తారు. జ్ఞానంబ మల్లిక మల్లిక అని ఎంత పిలిచిన వినిపించుకోకపోయేసరికి తల మీద మొట్టికాయ వేస్తుంది. ఇంట్లో దెయ్యం తిరుగుతూ ఉందని మల్లిక అంటుంది. జానకి గదిలో కొరివి దెయ్యం తిరుగుతూ ఉందని అనేసరికి రామా, జానకి నవ్వుతారు. అది కొరివి దెయ్యం కాదు చదువుకునే లైట్ అని రామా దాన్ని చూపిస్తాడు. నిజంగా దెయ్యం అనుకుని భయపడి చచ్చాను అని అంటుంది. జ్ఞానంబ తిడుతుంది.

జానకి త్వరలో పరీక్షలు ఉన్నాయంట, అవి అయిపోయే వరకు ఇంటి పనులన్నీ నువ్వే చూసుకో, అప్పటి వరకు తను ఎలాంటి పనులు చెయ్యదు అని జ్ఞానంబ మల్లికకి చెప్తుంది. పరవాలేదు అత్తయ్య ఇంటి పనులు చేసుకుంటూనే చదువుకుంటాను అని జానకి అంటుంది. నిన్ను పనులు చేయవద్దని చెప్పింది పరీక్షలు అయ్యేంత వరకే తర్వాత ఇంటి పనుల్లో ఎటువంటి లోపం జరిగినా ఊరుకునేది లేదని జ్ఞానంబ చెప్తుంది. ఇక మల్లిక పొద్దునే లేచి ఇల్లు తుడుస్తూ ఉంటుంది. గోవిందరాజులు మల్లికని చూసి కావాలని తను తుడిచిన చోటే నడుస్తూ ఉంటాడు. అత్తయ్యగారు అత్తయ్యగారు అని పిలుస్తుంది. పిలువమ్మ బాగా పిలువు నువ్వు పని చెయ్యకుండా చికితను కొట్టి మా అత్తయ్యకి కాకపోతే వాళ్ళ అత్తయ్యకి చెప్పుకో అని అన్నదంతా వీడియో తీశాను అని చెప్తాడు. ఆ మాటకి మల్లిక నోరెళ్ళబెట్టి మావయ్యగారు మీరు కూడా చివరికి బ్లాక్ మెయిల్ చేస్తారా అని ఏడుస్తుంది. ఇక గోవిందరాజులు అక్కడే తిరుగుతూ ఒక ఆట ఆడుకుంటాడు.

Also Read: సంతోషంలో రుక్మిణి, దేవి - పసిమనసు చెడగొట్టేందుకు మాధవ కొత్త ప్లాన్

జెస్సి అఖిల్ బైక్ మీద తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. నువ్వు కూడా ఇలా ఒక బైక్ తీసుకోవచ్చు కదా అని అంటుంది, మా అమ్మని అడిగి బైక్ తీసుకుంటాను అంటాడు. రేపు రాఖీ కదా బయటకి వెళ్దాం అంటాడు, రేపు తన పుట్టిన రోజని గుర్తు చేస్తుంది జెస్సి. అవును కదా అయితే బయటకి వెళ్ళి గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకుందామని అంటాడు. మొన్నటి లాగా ఈసారి కూడా మనం.. అని అఖిల్ జెస్సిని కౌగలించుకుని అంటాడు. అంటే వాళ్ళిద్దరి మద్య అది కూడా జరిగిపోయిందని హింట్ ఇచ్చాడు డైరెక్టర్. షటప్ అని జెస్సి అఖిల్ ని సరదాగా కొడుతుంది. ఇద్దరి మధ్య కాసేపు రొమాన్స్ నడుస్తుంది.

ఇక ఇంట్లో రాఖీ ఏర్పాట్లు చేస్తుంది జానకి. తనని చూస్తుంటే ఒకవైపు బాధగా ఉంది మరో వైపు గర్వంగా ఉంది. ఈ రాఖీ పండగ పూట తన అన్నయ్యకి రాఖీ కట్టే అవకాశం లేకుండా పోయిందని మనసులో బాధపడుతూ ఉంటూనే ఇంట్లో రాఖీ ఏర్పాట్లు చూడు ఎలా చేస్తుందో అని గోవిందరాజులు జ్ఞానంబతో అంటాడు. ఇక పూజ చేస్తుంది జానకి. తర్వాత వెన్నెల తన అన్నయ్యలు రామా, విష్ణు, తమ్ముడు అఖిల్ కి సంబరంగా రాఖీ కడుతుంది. రామా గురించి చాలా గొప్పగా చెప్తుంది వెన్నెల. చక్రికి చికిత రాఖీ కడుతుంది. మల్లిక తమ్ముడు కూడా ఇంటికి వస్తాడు. పిలవకుండానే వచ్చావ్ ఏంట్రా అని మల్లిక అంటుంది. నీతో రాఖీ కట్టించుకోడానికి రమ్మని రాత్రి అత్తయ్యగారు ఫోన్ చేసి రమ్మన్నారని చెప్తాడు. ఆ మాటకి మల్లిక ఆశ్చర్యపోతూ ఏడుపు లకించుకుంటుంది. మీరు నిజంగా దేవత అంటూ అతివినయం ప్రదర్శిస్తుంది. అది చూసి జ్ఞానంబ కౌంటర్ వేస్తుంది. తమ్ముడికి రాఖీ కడుతూ జానకి వైపు చూస్తూ అన్నయ్యకి రాఖీ కట్టలేకపోతున్నందుకు బాధపడుతుంది.. దానికి మనం ఇంకొంచెం కారం చల్లి సంతోషపడదామని మల్లిక మనసులో అనుకుంటుంది.

Also Read: ప్రేమ్ ని నందుతో పోల్చిన శ్రుతి- బంధం తెంచేసుకుని వెళ్ళిపోయిన ప్రేమ్, గుండెలు పగిలేలా ఏడుస్తున్న శ్రుతి

Published at : 16 Aug 2022 10:06 AM (IST) Tags: janaki kalaganaledu serial janaki kalaganaledu serial today Janaki Kalaganaledu Serial Today Episode Written Update Janaki Kalaganaledu August 16th

సంబంధిత కథనాలు

Chiranjeevi - Najabhaja song : గజగజ వణికించే గజరాజడిగోరో - మెగాస్టార్ రేంజ్ సాంగ్ అంటే ఇదీ

Chiranjeevi - Najabhaja song : గజగజ వణికించే గజరాజడిగోరో - మెగాస్టార్ రేంజ్ సాంగ్ అంటే ఇదీ

DJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్ డైరెక్టర్ ఎవరో క్లారిటీ వచ్చేసింది!

DJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్ డైరెక్టర్ ఎవరో క్లారిటీ వచ్చేసింది!

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకి పూర్ బుకింగ్స్ - పాజిటివ్ టాక్ వస్తుందా?

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకి పూర్ బుకింగ్స్ - పాజిటివ్ టాక్ వస్తుందా?

Satyadev Interview : చిరంజీవి స్థాయిని తగ్గించేలా నటించలేదు... వాళ్ళ డౌట్స్ వాళ్ళవి, నా కాన్ఫిడెన్స్ నాది - సత్యదేవ్ ఇంటర్వ్యూ

Satyadev Interview : చిరంజీవి స్థాయిని తగ్గించేలా నటించలేదు... వాళ్ళ డౌట్స్ వాళ్ళవి, నా కాన్ఫిడెన్స్ నాది - సత్యదేవ్ ఇంటర్వ్యూ

Bigg Boss 6 Telugu: నేహా ఎలిమినేట్ అయ్యాక ఆదిరెడ్డి - రాజశేఖర్ ఏమన్నారంటే, నాగార్జున చెప్పినా రివ్యూలు మానని ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: నేహా ఎలిమినేట్ అయ్యాక ఆదిరెడ్డి - రాజశేఖర్ ఏమన్నారంటే, నాగార్జున చెప్పినా రివ్యూలు మానని ఆదిరెడ్డి

టాప్ స్టోరీస్

హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు

Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి