News
News
X

Avatar 2 Digital Release: ‘అవతార్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, బోనస్ కంటెంట్ కూడా!

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘అవతార్ 2’ సినిమా ఓటీటీ విడుదలకు సిద్దమైంది. డిజిటల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

FOLLOW US: 
Share:

అంతర్జాతీయ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్(ది వే ఆఫ్ వాటర్)’. దాదపు 13 ఏళ్ల తర్వాత కామెరూన్ ‘అవతార్’ సినిమాకు సీక్వెల్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా గతేడాది డిసెంబర్ లో విడుదల అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ భారీ వసూళ్లను సాధించి రికార్డులు సృష్టించింది. మరోసారి జేమ్స్ కామెరూన్ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ ‘అవతార్ 2’ సినిమాను ఓటీటీ లోకి ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. మూవీ ఓటీటీ రిలీజ్ పై రకరకాల వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమా డిజిటల్ వేదికగా విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ అనౌన్స్మెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ సినిమాను ఓటీటీలో చూడటానికి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో దీనిపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ‘అవతార్ 2’ సినిమాను మార్చి 28 నుంచి డిజిటల్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. మీరు ఎప్పుడూ చూడని విశేషాలను మూడు గంటల పాటు చూడటానికి సిద్దంకండి అంటూ అనౌన్స్ చేశారు దర్శకనిర్మాతలు. అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవి తదితర ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. హెచ్.డి, 4K ఆల్ట్రా, డాల్బి అట్మాస్ ఆడియోతో ఈ సినిమా డిజిటల్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను ముందుగా ఆన్ డిమాండ్ లేదా అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ చేయనున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకూ ప్రేక్షకులు ఎవరూ చూడని బోనస్ కంటెంట్ ను కూడా అందించనున్నారు మేకర్స్. ఇందులో ‘అవతార్ 2’ సినిమా తెర వెనుక చేసిన కృషిను చూపించనున్నారు. ఉదాహరణకు.. దర్శకుడు పండోరా గ్రహాన్ని సృష్టించడం, గ్రాఫిక్స్ వర్క్స్, కెమెరాల పనితీరు, సిబ్బంది పనితీరు, నీటి అడుగున చేసే షూటింగ్ లో ఇబ్బందులు, ఆడియో, వీడియో క్యాప్చరింగ్ చిక్కులు ఇలా ఆ సినిమా వెనుక ఎంత కష్టం ఉందో ప్రేక్షకులకు అర్థం అయ్యేలా ఓ ప్రత్యేక వీడియోలను కూడా విడుదల చేయనున్నారు. 

సినిమా విషయానికొస్తే.. ‘అవతార్ 2’లో క్వాట్రిచ్ విలన్ మళ్లీ పండోర గ్ర‌హంపై దాడి చేస్తాడు. అయితే ఈ సారి గ్రహం మొత్తం కాకుండా కేవలం హీరో అయిన జాక్ సల్లీ నే టార్గెట్ చేస్తాడు. ఆ దాడి నుంచి తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు జాక్ తన ఫ్యామిలీను ఓ సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తాడు. జాక్ త‌న పిల్ల‌ల్ని ఎలా ర‌క్షించుకున్నాడు, ఎలా ఆ పిల్ల‌లు త‌మ పేరెంట్స్‌ను కాపాడుకున్నారో వంటి కలర్ఫుల్ డ్రామాను సినిమాలో చూడాలి. వాస్తవానికి ‘ద వే ఆఫ్ వాట‌ర్’ టైటిల్‌ లోకి క‌థ వెళ్ల‌డానికి క‌నీసం గంట స‌మ‌యం ప‌డుతుంది. అయితే కథను మాత్రం ఎక్కడా పక్కదారి పట్టించలేదు దర్శకుడు. ఆ వెళ్లిన చోట జాక్ ఫ్యామిలీ అక్కడ పరిస్థితులకు తగ్గట్టు మారతారు. అయితే అవ‌తార్ మొదటి భాగంలో పండోరా గ్రహం, అడ‌వులు, ప‌క్షులు, జంతువుల‌తో ఓ కొత్త లోకాన్ని చూపించిన కామెరూన్, ఈ సీక్వెల్‌ లో జ‌లచ‌రాల‌తో మెస్మరైజ్ చేశాడనే చెప్పాలి. సముద్ర అడుగు భాగంలో జరిగే సన్నివేశాలు థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఈ సెకండ్ ఆఫ్ మొత్తం కంప్లీట్ యాక్షన్ ఉంటుంది. మొత్తంగా ‘అవతార్ 2’ నీటి అడుగు భాగాన ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించాడు. అందుకే ఈ ‘అవతార్ 2’ సినిమా 95వ ఆస్కార్ అవార్డుల పోటీల్లో ఉత్తమ చిత్రంతో కలపి నాలుగు విభాగాల్లో నామినేట్ అయింది. ఈ నెల 13న అమెరికాలో ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది.

Also Read హీరోగా కాదు అభిమానిగా ఆస్కార్స్‌కు రామ్ చరణ్ - అక్కడ వాళ్ళిద్దర్నీ చూడాలని... 

Published at : 08 Mar 2023 04:59 PM (IST) Tags: Avatar 2 Avatar The Way of Water Avatar 2 Digital Release

సంబంధిత కథనాలు

Allu Arjun Net Worth: అల్లు అర్జున్ మొదటి జీతం రూ.3500 మాత్రమే - ఇప్పుడు ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?

Allu Arjun Net Worth: అల్లు అర్జున్ మొదటి జీతం రూ.3500 మాత్రమే - ఇప్పుడు ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?

Janaki Kalaganaledu March 29th: తండ్రిని నోటికొచ్చినట్టు తిట్టిన అఖిల్- సర్దుకుపొమ్మని చెప్పిన జ్ఞానంబ

Janaki Kalaganaledu March 29th: తండ్రిని నోటికొచ్చినట్టు తిట్టిన అఖిల్- సర్దుకుపొమ్మని చెప్పిన జ్ఞానంబ

Keerthy Suresh: నాలుగు పళ్లతో నవ్వమన్నాడు - కీర్తి సురేష్‌కు షాకిచ్చిన ‘దసరా’ దర్శకుడు

Keerthy Suresh: నాలుగు పళ్లతో నవ్వమన్నాడు - కీర్తి సురేష్‌కు షాకిచ్చిన ‘దసరా’ దర్శకుడు

Gruhalakshmi March 29th: రాజ్యలక్ష్మి అసలు స్వరూపం తెలుసుకున్న ప్రియ- లాస్య ట్రాప్ లో పడిపోయిన దివ్య

Gruhalakshmi March 29th: రాజ్యలక్ష్మి అసలు స్వరూపం తెలుసుకున్న ప్రియ- లాస్య ట్రాప్ లో పడిపోయిన దివ్య

Guppedanta Manasu March 29th: కొత్త గేమ్ స్టార్ట్ చేసిన రిషిధార, క్షమించమని జగతిని అడిగిన ఈగో మాస్టర్!

Guppedanta Manasu March 29th:  కొత్త గేమ్ స్టార్ట్ చేసిన రిషిధార, క్షమించమని జగతిని అడిగిన ఈగో మాస్టర్!

టాప్ స్టోరీస్

Amalapuram Riots Case: అమలాపురం అల్లర్ల ఘటనపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం

Amalapuram Riots Case: అమలాపురం అల్లర్ల ఘటనపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా-  రేవంత్ ఎమోషనల్ ట్విట్