అన్వేషించండి

Jabardasth Love Story: 'జబర్దస్త్'లో మరో ప్రేమ జంట?... ఐశ్వర్యను ఇష్టపడిన కమెడియన్

‘జబర్దస్త్’ కామెడీ షో నుంచి మరో లవ్ స్టోరీ బయటకు వచ్చింది. ‘సుమ అడ్డా’ వేదికగా ఈ ప్రేమ గుట్టు బయటపడింది. కమెడియన్ అశోక్ ఐశ్వర్యను ప్రేమిస్తున్నట్లు వెల్లడించాడు.

Jabardasth Ishwarya-Ashok: తెలుగు బుల్లితెరపై గత కొద్ది సంవత్సరాలుగా అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీతో ఉభయ రాష్ట్రాల ప్రేక్షకులను ‘జబర్దస్త్’ కామెడీ షో ఓ రేంజిలో అలరిస్తోంది. ప్రతి వారం సరికొత్త ఫన్నీ స్కిట్లలో ఆయా టీమ్ లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న పలువురు కమెడియన్లు సినిమాల్లోనూ అదరగొడుతున్నారు. హీరోలుగా, కమెడియన్లుగా రాణిస్తున్నారు. ఇక ‘జబర్దస్త్’ షో సాక్షిగా పలువురు ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ‘జబర్దస్త్’ షోలో కమెడియన్లుగా రాణిస్తున్న నూకరాజు, ఆసియా ప్రేమలో పడ్డారు. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇమ్మాన్యుయేల్, వర్ష కూడా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. నిజమా? కాదా? అనేది బయటకు తెలియదు. ఇక సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి సైతం ఒకరినొకరు ఇష్టపడుతున్నట్లు టాక్ వినిపించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని సోషల్ మీడియాలోనూ జోరుగా చర్చలు జరిగాయి. కానీ, కేవలం షో కోసమే అలా చేశామని సుధీర్ చాలాసార్లు చెప్పినా బుల్లితెర పట్టించుకోలేదు. ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే భావిస్తున్నారు.

ఐశ్వర్యతో ప్రేమలో ఉన్నట్లు చెప్పిన అశోక్    

తాజాగా మరో ‘జబర్దస్త్’ జంట ప్రేమలో పడింది. తాజాగా ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య వుల్లింగాల.. రాకెట్ రాఘవ టీమ్ లో అదిరిపోయే పంచులతో ఆకట్టుకుంటున్న కమెడియన్ అశోక్ ప్రేమలో పడ్డారు. వినాయక చవితి సందర్భంగా పలువురు ‘జబర్దస్త్’ కమెడియన్లు ‘సుమ అడ్డా’ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఫన్నీ స్కిట్లతో ఆకట్టుకున్నారు. షో చివరలో ఐశ్వర్యతో తమ ప్రేమ గురించి చెప్పాడు చెప్పాడు అశోక్. ‘మా అమ్మ అంటే ఎంత ఇష్టమో, ఐష్ అంటే నాకు అంతే ఇష్టం” అని చెప్పుకొచ్చాడు. ఆమెకు సర్ ప్రైజ్ అంటూ ఓ ఫోటో ను గిఫ్టుగా ఇచ్చాడు. ఈ ఫోటోను ఐశ్వర్య ఎంతో ఇష్టంగా తీసుకుని ముద్దు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జంట చూడ్డానికి చక్కగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.  

సినిమాల్లోనూ రాణిస్తున్న ఐశ్వర్య

బుల్లితెర షోలతో ఆకట్టుకున్న ఐశ్వర్య సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నది. చక్కటి అందం, మంచి నటన, స్పాంటేనియస్ తో సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్సులు దక్కించుకుంటున్నది. 2021లో  ‘నారి నారి నడుమ మురారి’ అనే మినీ టీవీ సిరీస్ లో నటించింది. గత ఏడాది ‘నాతో నేను’, ‘తురుం ఖాన్లు’ సినిమాల్లో కనిపించింది. ‘కేరింత’ ఫేమ్ పార్వతీశంతో కలిసి ‘మెర్సీ కిల్లింగ్’ అనే సినిమాలో ఫీమేల్ లీడ్ గా చేసింది. ప్రస్తుతం ‘కొంచెం హట్కే’ సినిమాలో నటిస్తున్నది. పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు కూడా చేసింది. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్ కూడా బాగానే ఉంది. అటు అశోక్ కూడా పలు టీవీ షోలో, వెబ్ సిరీస్ లతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నాడు.

View this post on Instagram
 
A post shared by Phani Photography (@photographybyphani)

Read Also: ‘గేమ్ ఛేంజర్’లోనూ పేపర్లు పడతాయ్ - ఎస్జే సూర్య నటనపై దిల్ రాజు పొగడ్తలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Revanth Reddy on Sandhya Theatre Incident: అరెస్ట్ చేస్తామని చెబితేనే అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లిపోయారు: సభలో రేవంత్ రెడ్డి
Revanth Reddy on Sandhya Theatre Incident: అరెస్ట్ చేస్తామని చెబితేనే అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లిపోయారు: సభలో రేవంత్ రెడ్డి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

శ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!హైటెక్ సిటీలో పేలుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పరుగో పరుగుAmbani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Revanth Reddy on Sandhya Theatre Incident: అరెస్ట్ చేస్తామని చెబితేనే అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లిపోయారు: సభలో రేవంత్ రెడ్డి
Revanth Reddy on Sandhya Theatre Incident: అరెస్ట్ చేస్తామని చెబితేనే అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లిపోయారు: సభలో రేవంత్ రెడ్డి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
Embed widget