అన్వేషించండి

మెగాస్టార్‌కు మరో స్టార్ అవసరమా? చిరు సినిమాల్లో ‘బడా’ స్టార్లు ఎందుకు?

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అభిమానులు ఏ రేంజ్‌లో ఊహించుకుంటారో తెలిసిందే. అలాంటి చిరుకు మరో స్టార్ సపోర్ట్ అవసరమా?

⦿ మెగాస్టార్ కు ఇంకో స్టార్ అవసరమా..?
⦿ సల్మాన్ ఖాన్ లిరికల్ సాంగ్ పై ఫ్యాన్స్ అప్ సెట్
⦿ ‘గాడ్ ఫాదర్’ కోసం ప్రత్యేకంగా సాంగ్ చేయించిన టీం
⦿ ఒరిజినల్ ‘లూసిఫర్’లో లేని స్పెషల్ సాంగ్
⦿ స్టెప్పుల్లేకుండా చప్పగా కనిపించిన ‘తార్ మార్ తక్కర్ మార్’
⦿ చిరంజీవి స్థాయికి ఇంకో యాక్టర్ తో పనేంటని కామెంట్లు
⦿ ‘ఖైదీ నెంబర్ 150’ రీఎంట్రీలో చరణ్ తో సాంగ్
⦿ ‘సైరా నరసింహారెడ్డి’లో అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్
⦿ ‘ఆచార్య’లో ఏకంగా రామ్ చరణ్ తో మల్టీస్టారర్
⦿ ‘గాడ్ ఫాదర్’లో స్పెషల్ రోల్ లో సల్మాన్ ఖాన్
⦿ ‘వాల్తేరు వీరయ్య’లో మాస్ రాజా రవితేజతో చిరు

మెగాస్టార్ చిరంజీవి... తెలుగు సినీ చరిత్రలో ఈ పేరు గురించి ప్రత్యేకంగా ఇంట్రో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన స్వాగ్, ఆయన స్టైల్ మ్యాచ్ చేసే దమ్మున్న హీరో ఇప్పుడప్పుడే తెలుగు సినిమా చూడటం కష్టం. స్టార్ లు ఎంత మందైనా ఉండొచ్చు..కానీ మెగా స్టార్ రేంజ్ సింహాసనం. నలభై ఏళ్లుగా ఆయన సినిమా మీద సినిమా పెడుతూ సినిమా అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. కానీ టూ బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే ఆఫ్టర్ ఏ గ్యాప్ బాస్ ఈజ్ బ్యాక్ అన్న తర్వాతి నుంచే చిరంజీవి తీసుకుంటున్న నిర్ణయాలపై నిఖార్సైన అభిమానుల్లో సందేహాలున్నాయి. అన్నయ్య ఏం చేసినా ఓకే అనుకుంటే ప్రాబ్లం లేదు..కానీ అన్నయ్య రేంజ్ ఎప్పటికీ అలానే ఉండాలని అనుకోనే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి చిరంజీవి తీసుకుంటున్న నిర్ణయాలు ఒకింత నిరాశనే మిగులుస్తున్నాయని చెప్పాలి. చిరంజీవి తాజా సినిమా 'గాడ్ ఫాదర్ ' నుంచి తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజైంది. దీంట్లో బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ తో కలిసి స్టెప్పులేస్తూ కనిపించారు చిరంజీవి. ప్రభుదేవా కొరియోగ్రఫీలో, ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో , అనంతర్ శ్రీరామ్ లిరిక్స్ తో శ్రేయాఘోషల్ లాంటి సింగర్ పాడిన పాట లో హుషారెత్తించే ప్రయత్నించారు చిరంజీవి, సల్మాన్ ఖాన్.

‘లూసిఫర్’లో లేని హడావిడి:

గాడ్ ఫాదర్ కు మాతృక మలయాళం 'లూసిఫర్'. అందులో లెజెండ్ మోహన్ లాల్ టైటిల్ రోల్ లో కనిపించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో పృథ్వీరాజే కీ రోల్ పోషించారు. ఇప్పుడు అదే పాత్రలో సల్మాన్ ఖాన్ తీసుకున్నారేమో ప్రస్తుతానికైతే తెలియదు కానీ చూస్తుంటే అదే రోల్ అనిపిస్తోంది. వాస్తవానికి మలయాళంలో పృథ్వీరాజ్ పాత్ర కథకు అనుగుణంగా మాత్రమే ఉండే చిన్న రోల్. పృథ్వీరాజ్ అక్కడ స్టార్ హీరోనే అయినా ఆ పాత్ర పరిధి మేరకే నటించారు. సినిమా 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందింతే అక్కడ హిట్ టాక్ అందుకుని 175 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. ఇప్పటివరకూ ఓ మలయాళం సినిమా సాధించిన హయ్యెస్ట్ కలెక్షన్లు ఇదే.  

సల్మాన్ కథను నడిపిస్తారా :

ఇప్పుడు సల్మాన్ ఖాన్ ను గాడ్ ఫాదర్ కోసం  తీసుకుని మోహన్ రాజా డైరక్షన్ లో చాలా మార్పులు చేశారని అర్థమవుతోంది. కథలో స్పెషల్ సాంగ్స్ కూడా వచ్చాయి. సల్మాన్ ఖాన్ కు బ్రాండ్ దృష్య్టా ఆయన్ను కూడా ఎలివేట్ చేసేలా ఉండాలి కాబట్టి ఫైట్లు, సాంగ్స్ పెట్టారని అర్థమవుతోంది. కానీ ఇదంతా కథకు అవసరమా అంటే డౌటే. సరే మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ ఏంటీ అసలు. ఆయన నుంచి కొత్త సినిమా సాంగ్ రిలీజ్ అవుతుందంటే ఓ చిన్న స్టెప్ ఎక్స్ పెక్ట్ చేస్తారు మెగా ఫ్యాన్స్. కానీ ఇందులో సల్మాన్ ఖాన్ ని డామినేట్ చేస్తున్నట్లు ఉండకూడదు నిలబడి చేతులు, కాళ్లూ ఊపుతూ చిరు కూడా మమ అనిపించారని చూస్తుంటేనే అర్థమవుతోంది. అసలు మెగాస్టార్ కు ఇంకో స్టార్ అవసరమా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

మొదటి నుంచి అన్నయ్య కెరీర్ ను ఫాలో అయ్యే వాళ్లంతా చెప్పేది ఏంటంటే...ఆయన ఏక్ నెంబర్ హార్డ్ వర్కర్. అప్పటివరకూ ఉన్న తెర గతిని, తెలుగు సినిమా రీతిని మార్చిన యాక్టర్ ఆయన. కమర్షియల్ సినిమాలు చేయాలన్నా ప్రయోగాత్మక సినిమాల్లో నటించినా చిరంజీవి చిరంజీవినే. కథ, దాని గమనానికి తప్ప అసలు వేరే ఫ్యాక్టర్స్ ఏవో సినిమాను నడిపించాల్సిన స్పేస్ కానీ అవసరం కానీ కల్పించేవారు కాదు మెగాస్టార్. ఎప్పుడైతే పాలిటిక్స్ కోసం వెళ్లిపోయారో అప్పుడు అభిమానులంతా ఇక అన్నయ్యను చూడలేమా అని బాధపడ్డారు.

రీ ఎంట్రీ నుంచే మొదలైంది:

ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి గ్రాండ్ రీ ఎంట్రీ  ఇచ్చినప్పుడు అభిమానులంతా  ఫుల్ ఖుషీ అయ్యారు. సరే ఖైదీ నెంబర్ 150 అంటే చిరంజీవి కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా కాబట్టి అందులో చరణ్ తో స్పెషల్ సాంగ్ పెట్టుకున్నారు అనుకోవచ్చు. కానీ తర్వాత వచ్చిన 'సైరా నరసింహారెడ్డి' ని స్టార్ క్యాస్ట్ తో నింపేశారు. కన్నడ నుంచి కిచ్చ సుదీప, తమిళ్ నుంచి విజయ్ సేతుపతి,  బాలీవుడ్ నుంచి బిగ్ బీ 'అమితాబ్ బచ్చన్' ఇరికించారు. సినిమా రిజల్ట్, కథ నడిపించిన విధానం చూస్తే అది అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమాకు కలెక్షన్లు వచ్చినా మెగాస్టార్ రేంజ్ హిట్టా అంటే కాదు.

పాదఘట్టం వెంటాడింది:

సైరా తర్వాత వచ్చిన 'ఆచార్య' గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చిన్న పాత్ర కోసం రామ్ చరణ్ కనిపిస్తారు అని మొదట ప్రకటించి ఆ తర్వాత దాన్ని చరణ్, చిరు మల్టీస్టారర్ గా మార్చేశారు. కొరటాల శివ అద్భుతమైన డైరెక్షన్ తో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయాయి 'పాదఘట్టం' చాలా రోజులు కరుడు కట్టిన ఫ్యాన్స్ ను కూడా వెంటాడింది. ఈ లోపు ఆమీర్ ఖాన్ లాంటి యాక్టర్ ను తెలుగులో గర్వంగా ప్రజెంట్ చేద్దామని చేసిన 'లాల్ సింగ్ చడ్డా' కూడా బొక్కబోర్లా పడింది.

వాల్తేరు వీరయ్యలోనూ:

ఇప్పుడు గాడ్ ఫాదర్ లో 'సల్మాన్ ఖాన్'. మాతృకలో లేని గ్లోరిఫైయింగ్ తెలుగులో కనిపిస్తుందని అర్థమవుతోంది.  ఫలితంగా కథ డైల్యూట్ అయ్యి రిజల్ట్ మీద ప్రభావం చూపిస్తుందా అనే సగటు మెగా అభిమాని టెన్షన్ అంతా. కేఎస్ రవీంద్ర డైరక్షన్ లో వస్తున్న 'వాల్తేరు వీరయ్య' లో కూడా మాస్ రాజా రవితేజ ను తీసుకున్నారు. టాలీవుడ్ ను సింగిల్ గా ఏలిన మెగాస్టార్ కు అసలు వేరే స్టార్ అవసరం ఏముందనేది సూటి ప్రశ్న ఇప్పుడు. ఏజ్ గా తగ్గట్లుగా కథలు ఎంచుకుని ఆయన నటనతో దుమ్ము దులిపేయాలి కానీ ఇలా అవసరం ఉన్నా లేకున్నా స్టార్ క్యాస్ట్ ను చొప్పించటం ఏంటో అర్థం కాని విషయం.  కథ కు ఉపయోగపడితే పర్లేదు కానీ ఈ ఎక్స్ ట్రా యాడెడ్ ఫ్లేవర్స్ తో మార్కెట్ లో సినిమాను నడిపించాలనుకుంటే అది మెగాస్టార్ మేనియా ను మరింత డైల్యూట్ చేయటానికి తప్ప మరోదానికి దారి తీయటం లేదని సగటు అభిమాని వాదన.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Vijay Devarakonda Rashmika: రష్మికతో లంచ్ చేస్తూ కనిపించిన విజయ్ దేవరకొండ - వైరల్ అవుతున్న ఫొటో!
రష్మికతో లంచ్ చేస్తూ కనిపించిన విజయ్ దేవరకొండ - వైరల్ అవుతున్న ఫొటో!
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Vijay Devarakonda Rashmika: రష్మికతో లంచ్ చేస్తూ కనిపించిన విజయ్ దేవరకొండ - వైరల్ అవుతున్న ఫొటో!
రష్మికతో లంచ్ చేస్తూ కనిపించిన విజయ్ దేవరకొండ - వైరల్ అవుతున్న ఫొటో!
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Embed widget