అన్వేషించండి

John Abraham: నేను బిగ్‌స్క్రీన్ హీరోను, ఓటీటీలో కనిపించేందుకు ఇష్టపడను: జాన్ అబ్రహం

జాన్ అబ్రహం ఓటీటీల విషయం కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహం. ఎంతోమంది అమ్మాయిల కలల రాకూమారుడు. అతను నటించిన యాక్షన్ మూవీ ‘అటాక్: పార్ట్ 1’. ఇటీవలే విడుదలై ఫ్లాపైంది. దీన్ని మొదట ఓటీటీలో విడుదల చేద్దాం అనుకున్నారు కానీ ఎందుకో మళ్లీ థియేటర్లోనే విడుదల చేశారు. బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టడంతో ఓటీటీలో విడుదల చేశారు. ఓటీటీలో జనాలు బాగానే చూశారు. ఈ సినిమాను కేవలం టైమ్ పాస్ గా చూశారే తప్ప ఓటీటీ రివ్యూలు కూడా అంతగొప్పగా లేవు. దానికి కారణం హీరో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా, విలన్లు మాత్రం పెద్ద పేరున్న వ్యక్తులను తీసుకోకపోవడమనే అభిప్రాయం వ్యక్త మవుతోంది. కాగా జాన్ నటించిన మరో సినిమా ‘ఏక్ విలన్ రిటర్న్స్’ జూలై 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లలో ఆయన జోరుగా పాల్గొంటున్నాడు. ఈ ప్రమోషన్లో తన సినిమా ఓటీటీ విడుదలపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు జాన్ అబ్రహం. తనకు ఓటీటీ కన్నా థియేటర్లలో సినిమా విడుదల కావడమే ఇష్టమని చెప్పారాయన. 

బిగ్ స్క్రీన్ హీరో నేను
‘హీరోగా నాకు బిగ్ స్క్రీన్ పై కనిపించడమే ఇష్టం. అదే నిర్మాతగా అయితే ఓటీటీని ఇష్టపడతాను. కేవలం నెలకు మూడు, నాలుగొందలు కట్టి నా సినిమాలు జనాలు చూడడం నాకిష్టం లేదు. కేవలం అంత తక్కువ మొత్తానికి నేను జనాలకు అందుబాటులో ఉండడం నాకు నచ్చదు. నేను వెండితెర హీరోను. అలాగే ఉండాలనుకుంటున్నాను. ఒక నిర్మాతగా మాత్రం ఓటీటీ ప్రేక్షకుల కోసం సినిమాలు నిర్మిస్తాను’ అని అన్నాడు. అంటే జాన్ అబ్రహాం ఓటీటీ ప్రేక్షకులను తక్కువగా చూస్తున్నాడా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. భవిష్యత్తంతా ఓటీటీలదేనని ఇప్పటికే ఎన్నో సర్వేలు చెప్పాయి. అయినా ఇంకా జాన్ ఇలా మాట్లాడి ఓటీటీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటాడా? అని బాలీవుట్ టాక్. 

ఏక్ విలన్ సినిమా 2014లో విడుదలైంది. దానికి సీక్వెల్ తీసేందుకు ఇన్నాళ్లు పట్టింది. ఈ సినిమాలో జాన్ అబ్రహంతో పాటూ అర్జున్ కపూర్, తారా సుతారియా, దిశా పటానీ కూడా నటించారు. ఈ సినిమాకు నిర్మాత ఏక్తా కపూర్.  జాన్ 2003లో జిస్మ్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అప్పట్నించి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ధూమ్, న్యూయార్క్, హౌస్ ఫుల్, వెల్ కమ్ బ్యాక్, విక్కీ డోనర్, దోస్తానా వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. 

Also Read : తలలు కోసి చేతికిస్తా నాయాలా - మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మాస్ మామూలుగా లేదుగా

Also Read: ఛార్మితో రిలేషన్, భార్యకు పూరి విడాకులు - ఆకాష్ పూరి ఏమన్నారంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget