Akash Puri: ఛార్మితో రిలేషన్, భార్యకు పూరి విడాకులు - ఆకాష్ పూరి ఏమన్నారంటే?
ఛార్మితో రిలేషన్ కారణంగా.. పూరి జగన్నాధ్ కి భార్యఠీ విభేదాలు ఏర్పడ్డాయని.. తన భర్తని వదిలేయాల్సిందిగా లావణ్య.. ఛార్మిని బెదిరించినట్లుగా వార్తలొచ్చాయి.
టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు పూరి జగన్నాధ్. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తున్నారాయన. ఇదిలా ఉండగా.. నటి ఛార్మితో పూరి రిలేషన్ గురించి రకరకాల వార్తలొస్తుంటాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే పుకార్లు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. మొన్నామధ్య పూరి.. ఛార్మిని పెళ్లి చేసుకోబోతున్నారని.. దానిలో భాగంగా అతడి భార్య లావణ్యకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరిగింది.
ఛార్మితో రిలేషన్ కారణంగా.. పూరి జగన్నాధ్ కి భార్యఠీ విభేదాలు ఏర్పడ్డాయని.. తన భర్తని వదిలేయాల్సిందిగా లావణ్య.. ఛార్మిని బెదిరించినట్లుగా కూడా వార్తలొచ్చాయి. అయితే పూరి,ఛార్మి మాత్రం పూరి కనెక్ట్స్ బ్యానర్ లో సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. పూరి తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారనే విషయంలో అతడి కుమారుడు ఆకాష్ పూరి స్పందించారు. ఇతడు నటించిన 'చోర్ బజార్' సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆకాష్.. తన తల్లిదండ్రులపై వస్తోన్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి పరిస్థితి బాగాలేనప్పుడు.. అమ్మే అతడికి సపోర్ట్ చేసిందని.. ఆ కష్టాలు మా వరకు రాకుండా చూసుకుందని అన్నారు ఆకాష్ పూరి. కానీ నాన్న తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వడం మాత్రం అద్భుతమని.. తను పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించారని.. ఆ స్టేజ్ కి ఆయన రావడానికి అమ్మ ఇచ్చిన సపోర్టే కారణమని ఆకాష్ పూరి చెప్పుకొచ్చారు.
తన తల్లిదండ్రులపై విడాకులు వార్తలు రావడం తనకు తెలియదని.. నిజానికి వాళ్ల మధ్య అలాంటి గొడవలు ఎప్పుడూ రాలేదని అన్నారు. న్యూస్ క్రియేట్ చేయడానికి అలాంటి వార్తలు రాస్తుంటారని.. ఒకవేళ అది నిజం అయి ఉంటే ఇప్పటికీ వాళ్లు కలిసి ఉండేవారు కాదు కదా..? అని అన్నారు. అమ్మానాన్నలది ప్యూర్ లవ్ అని చెప్పారు. డాడీకి ఫ్యామిలీ టెన్షన్ లేకుండా అమ్మ చూసుకుంటుందని.. అమ్మ ఉంటే డాడీ రిలాక్స్ గా ఉంటారని.. షూటింగ్ నుంచి ఇంటికి వచ్చారంటే ఒత్తిడి లేకుండా చేస్తుందని ఆకాష్ పూరి తెలిపారు. నాన్న అంత స్ట్రాంగ్‌గా ఉన్నారంటే అమ్మ వల్లే అంటూ తన తల్లిదండ్రుల రిలేషన్ గురించి చెప్పుకొచ్చారు.
Also Read : తలలు కోసి చేతికిస్తా నాయాలా - మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మాస్ మామూలుగా లేదుగా
Also Read : కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు
View this post on Instagram