By: ABP Desam | Updated at : 22 Jun 2022 08:06 AM (IST)
చిన్మయి, రాహుల్ రవీంద్రన్
రాహుల్ రవీంద్రన్, చిన్మయి దంపతులు సోషల్ మీడియాలో ఒక శుభవార్తను షేర్ చేశారు. తమకు కవలలు జన్మించినట్టు పేర్కొన్నారు. పిల్లలు ఇద్దరికీ ఏం పేర్లు పెట్టారో కూడా చెప్పారు.
దృప్త & శర్వాస్ (Driptah and Sharvas - Chinmayi Children Names)... చిన్మయి, రాహుల్ పిల్లల పేర్లు. కవలల్లో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి అని చిన్మయి పేర్కొన్నారు.
చిన్మయి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే చాలా మంది సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చారా? అని అడుగుతున్నారట. ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ మెసేజ్‌లు చేస్తున్నారని చిన్మయి తెలిపారు.
''నేను గర్భవతిగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయని కారణంగా చాలా మంది సరోగసీనా? అని అడుగుతున్నారు. నన్ను నేను కాపాడుకుంటున్నాను కాబట్టి... నాకు అత్యంత సన్నిహితులకు మాత్రమే అసలు విషయం తెలుసు. నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబం, నా స్నేహితుల విషయంలో ఇంతకు ముందు, ఇప్పుడు, ఎప్పుడూ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. చాలా రోజుల వరకూ మా పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోకి రావు. ఒకవేళ మీరు నిజంగా తెలుసుకోవాలని అనుకుంటే... సిజేరియన్ జరుగుతున్నప్పుడు నేను భజన కీర్తన పాడాను. ఆ ప్రేమను పొందాను. ఇప్పటికి ఇది చాలు. దీని గురించి తర్వాత చెబుతా'' అని చిన్మయి పేర్కొన్నారు. రాహుల్ రవీంద్రన్, చిన్మయి శ్రీపాద వివాహం 2014లో జరిగింది.
Also Read : అమ్మ, నాన్న ఎవరో ఒకరు తలుపు తీస్తారని ఎదురుచూస్తుంటా - ఏడ్చేసిన కీర్తి, దర్శకుడు మారుతి ఊహించని ఆఫర్!
తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భాషల్లో చిన్మయి అనేక పాటలు పాడారు. అలాగే, సమంత సహా అగ్ర కథానాయికలకు డబ్బింగ్ చెప్పారు. 'అందాల రాక్షసి'తో హీరోగా అందుకున్న రాహుల్ రవీంద్రన్, ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించారు. 'శ్రీమంతుడు' సహా కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. 'చిలసౌ'తో దర్శకుడిగా మారిన ఆయన, ఆ తర్వాత నాగార్జున హీరోగా 'మన్మథుడు 2' తీశారు.
Also Read : మెగాస్టార్‌తో మిస్ అయినా మెగా క్యాంప్‌లో మరో హీరోతో...
Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన ‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?
Pawan Kalyan - Sujeeth: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, పవన్ - సుజిత్ కొత్త మూవీ షురూ
Manchu Manoj: తారకరత్న పూర్తిగా కోలుకొని తిరిగి వస్తాడు: మంచు మనోజ్
Rajinikanth: దర్శకుడు గోపిచంద్ మలినేనికు రజనీకాంత్ ఫోన్, ఎందుకంటే?
Prabhas – Maruthi: ప్రభాస్ కారులో మారుతి షికారు, షూటింగ్ మధ్యలో దర్శకుడి సరదా!
Jagityala మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి రాజీనామాకు కలెక్టర్ ఆమోదం
Lokesh Yuvagalam ; ఏపీ , కర్ణాటక మధ్య పెట్రోల్ ధరల్లో ఎంత తేడా అంటే ? పాదయాత్రలో లోకేష్ చూపించారు...
టీడీపీ నేతలకు షాక్ - పరువు నష్టం దావా వేసిన రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
Adani vs Hindenburg: ₹14 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన 32 వేల పదాల నివేదిక