Keerthi Bhat: అమ్మ, నాన్న ఎవరో ఒకరు తలుపు తీస్తారని ఎదురుచూస్తుంటా - ఏడ్చేసిన కీర్తి, దర్శకుడు మారుతి ఊహించని ఆఫర్!
నెంబర్ వన్ సీరియల్ గా దూసుకుపోతున్న 'కార్తీకదీపం'లో హిమ అనే లీడ్ క్యారెక్టర్ పోషిస్తోంది కీర్తి.
కర్ణాటకకు చెందిన నటి కీర్తి భట్ టాలీవుడ్ లో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించింది. ముందుగా 'ఐస్ మహల్' అనే సినిమాతో 2017లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సినిమాలు వర్కవుట్ కాకపోవడంతో బుల్లితెరపై అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో 'మానసిచ్చి చూడు' అనే సీరియల్ లో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఈ సీరియల్ ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది.
ఇప్పుడు నెంబర్ వన్ సీరియల్ గా దూసుకుపోతున్న 'కార్తీకదీపం'లో హిమ అనే లీడ్ క్యారెక్టర్ పోషిస్తోంది కీర్తి. సీరియల్స్, టీవీ షోస్ అంటూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా.. ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా 'మొగుడ్స్ వర్సెస్ పెళ్లామ్స్' అనే షోలో పాల్గొంది ఈ బ్యూటీ. ఈ షోలో నాన్నకు సంబంధించిన పాట పాడుతూ ఎమోషనల్ అయింది కీర్తి.
'ఆడపిల్లకు నాన్న ప్లేస్ చాలా ఇంపార్టెంట్. షూటింగ్ నుంచి అలసిపోయి ఇంటికి వెళ్లినప్పుడు రోజూ అనుకుంటాను.. ఒక్కరోజైనా అమ్మ కానీ, నాన్న కానీ, అన్నయ్య కానీ డోర్ తీస్తారేమోనని. ఇప్పటికీ వాళ్ల కోసం చూస్తుంటాను' అంటూ లేని తన తల్లిదండ్రులను తలచుకుంటూ ఎమోషనల్ అయింది కీర్తి. ఈ షోకి గెస్ట్ వచ్చిన దర్శకుడు మారుతి, రాశిఖన్నా.. కీర్తికి ధైర్యం చెబుతూ మాట్లాడారు. అమ్మానాన్న ఎప్పటికీ నీతోనే ఉన్నారని భావిస్తే.. వారు నీతోనే ఉంటారంటూ మారుతి సలహా ఇచ్చారు. అలానే కీర్తి వాయిస్ విని.. ఆమె తన నెక్స్ట్ సినిమాలో సింగర్ గా ఛాన్స్ ఇస్తానని అన్నారు.
Also Read : శోభితతో నాగచైతన్య డేటింగ్ - సమంత పుట్టించిన పుకారేనా?
Also Read : తక్కువ అంచనా వేయకండి - బాలకృష్ణ హీరోయిన్‌కు కరోనా
View this post on Instagram