Sujeeth In Mega Camp: మెగాస్టార్‌తో మిస్ అయినా మెగా క్యాంప్‌లో మరో హీరోతో...
ప్రభాస్ 'సాహో' విడుదలైన మూడేళ్ళకు ఆ సినిమా దర్శకుడు సుజీత్‌కు మరో సినిమా ఓకే అయ్యింది. మెగా క్యాంప్‌లో హీరోతో ఆయన సినిమా చేస్తున్నారు.
Sujeeth New Movie Latest Update: సుజీత్... 'రన్ రాజా రన్'తో సాలిడ్ హిట్ కొట్టిన దర్శకుడు. తొలి సినిమాతో మంచి విజయం అందుకున్న అతడికి, మలి సినిమాలో ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. 'సాహో ' తీశారు. ఆ తర్వాత మరో సినిమా ఓకే కావడానికి మూడేళ్ళు పట్టింది.
Sujeeth to direct Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సుజీత్ సినిమా చేయనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పవన్ కల్యాణ్ హీరోగా ఒక రీమేక్ మీద సుజీత్ కొన్ని రోజులు స్క్రిప్ట్ వర్క్ చేశారు. అది ముందు సెట్స్ మీదకు వెళుతుందా? లేదంటే వరుణ్ తేజ్ సినిమా ముందు స్టార్ట్ అవుతుందా? అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది.
'సాహో' తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం యువ దర్శకుడు సుజీత్‌కు వచ్చింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న 'గాడ్ ఫాదర్' స్క్రిప్ట్ మీద ఆయన కొన్ని రోజులు వర్క్ చేశారు. ఆ తర్వాత ఎందుకో సుజీత్ దర్శకత్వంలో సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. తర్వాత రామ్ చరణ్, సుజీత్ కలయికలో సినిమా అని వినిపించింది. హిందీలో షారుఖ్ ఖాన్ హీరోగా సినిమా అని వినిపించింది. అదీ ఓకే కాలేదు. పవన్ కళ్యాణ్ సినిమా వర్క్ జరుగుతోంది. అది ఓ వైపు ఉండగా... వరుణ్ తేజ్ సినిమా ఓకే అయ్యింది. మెగాస్టార్‌తో మిస్ అయినా మెగా క్యాంప్‌లో మరో హీరోతో సినిమా చేసే అవకాశం అందుకున్నారు సుజీత్.
Also Read : శోభితతో నాగచైతన్య డేటింగ్ - సమంత పుట్టించిన పుకారేనా?
వరుణ్ తేజ్ - సుజీత్ సినిమాను జీ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామ్యంతో మెగా ఫ్యామిలీకి చెందిన ప్రొడక్షన్ హౌస్ నిర్మించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల్లో ఈ సినిమాపై పూర్తి స్పష్టత రానుంది.
Also Read : తక్కువ అంచనా వేయకండి - బాలకృష్ణ హీరోయిన్‌కు కరోనా
View this post on Instagram