Dasara: 'దసరా' సినిమా - నాని రెమ్యునరేషన్ వదులుకుంటున్నారా?
'దసరా' సినిమా విషయంలో నాని ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే..?
నేచురల్ స్టార్ నాని 'దసరా' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ మధ్యకాలంలో నాని నటిస్తోన్న సినిమాలు ప్లాప్స్ అవుతుండడంతో 'దసరా' సినిమా బడ్జెట్ లో కొత్త పడుతుందని వార్తలొస్తున్నాయి.
నాని కూడా ఈ విషయంలో ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాడని టాక్. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కథపై కూడా నానికి నమ్మకం ఉంది. ఖర్చు పెట్టి తీయాల్సిన సినిమా ఇది. బడ్జెట్ లో కోత విధిస్తే క్వాలిటీ దెబ్బ తింటుంది. అందుకే నాని తన పారితోషికాన్ని వాడుకుంటున్నాడని సమాచారం. బదులుగా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకోబోతున్నారని తెలుస్తోంది. సినిమా మొత్తం పూర్తయ్యాక.. బిజినెస్ ని బట్టి తన రెమ్యునరేషన్ తీసుకోవాలని నాని డిసైడ్ అయ్యారు. ఇది మంచి ఐడియా అనే చెప్పాలి. తన సినిమా తనకు కావాల్సినట్లు వస్తుంది.. లాభాలొస్తే నాని తీసుకునే రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది.
ఇక ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్, నవీన్ నూలి ఎడిటర్.
Also Read: అప్పుడు జానీ డెప్ వద్దన్నారు - ఇప్పుడు 'సారీ' చెప్పి రూ.2355 కోట్లు ఇస్తామంటున్నారు!
Also Read: థియేటర్లలో 'పక్కా కమర్షియల్' తెలుగు సినిమాలు - ఓటీటీలో రెజీనా వెబ్ సిరీస్, బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్
View this post on Instagram