By: ABP Desam | Updated at : 20 Oct 2021 03:04 PM (IST)
హీరోపై క్లాప్ కొడుతున్న అనిల్ రావిపూడి (Image credit: Instagram)
పాత సినిమాలు ఇష్టపడేవారు ఎవరికైనా హరనాథ్ గుర్తుండే ఉంటారు. ఆ ముఖవర్చస్సుకు అప్పట్లో ఎంతో మంది మహిళా అభిమానులకు ఉండే వారు. ఎట్టకేలకు అతని ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నారు. హరనాథ్ కి వెంకటసుబ్బరాజు అనే సోదరుడు ఉన్నారు. ఆయన మనవడు విరాట్ రాజ్. అంటే హరనాథ్ కి కూడా మనవడే అవుతారు. ఈ కుర్రాడు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ‘సీతామనోహర శ్రీ రాఘవ’ పేరుతో తీస్తున్న సినిమాలో విరాట్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించించి చిత్రయూనిట్. క్లాప్ కొట్టింది ఎవరో కాదు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఎఎమ్ రత్నం కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సినిమాకు దుర్గా శ్రీవాత్సవ దర్శకత్వం వహిస్తున్నారు. వందన మూవీస్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అలనాటి మేటి నటుల్లో హరనాథ్ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. ఈయనది తూర్పుగోదావరి జిల్లా రాపర్తి గ్రామం. కాలేజీలో చదువుకునే రోజుల నుంచే నటన అంటే చాలా ఇష్టం ఈయనకి. నాటకాలు వేస్తూ తెలుగు తెరకు పరిచయమయ్యారు. తొలిసారి 1959లో మా ఇంటి మహాలక్ష్మి సినిమాలో నటించారు. అప్పట్లో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. మద్యపానానికి అలవాటు పడడంతో అవకాశాలు సన్నగిల్లాయి. 1989 నవంబర్ 1న 53 ఏళ్ల వయసులోనే మరణించారు. ఇతనికి కొడుకు శ్రీనివాసరాజు, కూతురు పద్మజ ఉన్నారు. వీరిద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీకి రాలేదు. దీంతో హరనాథ్ ఫ్యామిలీ నుంచి హీరోగా వస్తున్న వ్యక్తి విరాట్ మాత్రమే. పెదనాన్న వారసత్వాన్ని ఇతను ఎంతవరకు నిలుపుతాడో చూడాలి.
#SeetaManoharaSriRaghava 🌟ing “Virat Raj ( yesteryear actor Haranath’s grand nephew ) launched formally with Pooja Ceremony
— L.VENUGOPAL (@venupro) October 20, 2021
🎬by @AnilRavipudi
🎥 switch on by @AMRathnamOfl @ViratRaj_offl @DSrivatsasa #Reva #VandanaMoviees @RaviBasrur @ramjowrites @venupro @Sudhir_ID pic.twitter.com/WVU79vFfxm
Also read: వీడు మామూలోడు కాదు, ఫోన్ మింగేసి... ఆరునెలలు బిందాస్‌గా బతికేశాడు
Also read: గంటలు గంటలు కూర్చుని నిద్రపోవడం.. ప్రాణానికే ప్రమాదమా?
Also read: మగవారికి గట్టి షాకిచ్చిన జైపూర్ రెస్టారెంట్... ఇప్పుడు ఎలా తింటారో చూద్దాం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Nayanthara: వామ్మో లేడీ సూపర్ స్టార్, 50 సెకండ్ల యాడ్ కోసం నయన్ అంత తీసుకుంటుందా?
Ram Charan: ఇండస్ట్రీలో రామ్ చరణ్‌కు 16 ఏళ్లు పూర్తి - స్పెషల్‌గా విష్ చేసిన ఉపాసన
వీరాభిమాని మృతి - ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన సూర్య
Kiran Abbavaram: సొంతింటి కలను నెరవేర్చుకున్న కిరణ్ అబ్బవరం - కొత్త ఇంట్లో సందడి చూశారా?
'ఆర్.ఆర్.ఆర్, 'పుష్ప' సినిమాల్లో ఏముందని చూడటానికి? బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా షాకింగ్ కామెంట్స్
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !
Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర
Chandrababu Special Song: ‘తెలుగు జాతి వెలుగుబిడ్డ లేరా’ చంద్రబాబు అరెస్టుపై స్పెషల్ సాంగ్ - రిలీజ్ చేసిన నారా లోకేశ్
/body>