Hanuman Vs AMB: మహేష్ బాబు థియేటర్‌లో 'హనుమాన్' ప్రీమియర్స్ క్యాన్సిల్ - కారణం అదేనా?
'హనుమాన్'కు విడుదల రోజు సరైన థియేటర్లు ఇవ్వడం లేదని తనను టార్గెట్ చేస్తూ కథనాలు రావడంతో దిల్ రాజు సీరియస్ అయ్యారు. ఇప్పుడీ సమస్య సరికొత్త మలుపు తీసుకున్నట్లు కనబడుతోంది.
Hanuman movie theatres issues today: సంక్రాంతి సినిమాల థియేటర్ల సమస్య కొత్త మలుపు తీసుకున్నట్లు కనబడుతోంది ఇప్పుడు. మహేష్ బాబు భాగస్వామిగా ఉన్న ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో తొలుత 'హనుమాన్' పెయిడ్ ప్రీమియర్ షోస్ ప్లాన్ చేశారు. అయితే... ఇప్పుడు క్యాన్సిల్ చేశారు. ఏఎంబీ మాత్రమే కాదు... అల్లు అర్జున్ భాగస్వామి అయినటువంటి ఏఏఏ మల్టీప్లెక్స్‌లోనూ 'హనుమాన్' ప్రీమియర్ షోలు పడటం లేదు. ఎందుకు? ఏమైంది? వంటి వివరాల్లోకి వెళ్లే ముందు... 'దిల్' రాజు సీరియస్ అయిన విషయాన్ని సైతం ప్రస్తావించాలి.
సంక్రాంతి పండక్కి ఈ ఏడాది తెలుగులో నాలుగు సినిమాలు వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌లతో కంపేర్ చేస్తే... తేజ సజ్జ చిన్నోడు. 'హనుమాన్'తో వస్తున్నాడు. గురువారం (ఈ రోజు) రాత్రి వేస్తున్న పెయిడ్ ప్రీమియర్లకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే... తేజ సజ్జను చిన్నోడు అనలేం. స్టార్ అని చెప్పాలి. అయితే... అతని సినిమాకు విడుదల రోజున సరైన థియేటర్లు ఇవ్వడం లేదని ముందు నుంచి ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినబడుతోంది.
మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల 'గుంటూరు కారం' నైజాం రైట్స్ ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు తీసుకున్నారు. ఆయనకు నైజాం, విశాఖలో బలమైన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది. మెజారిటీ థియేటర్లలో 'గుంటూరు కారం' షోస్ ప్లాన్ చేయడంతో 'హనుమాన్' షోస్ కోసం థియేటర్లు రావడం లేదని ఫిల్మ్ నగర్ ఖబర్. అయితే... ఈ సమస్యలో తనను టార్గెట్ చేస్తూ కథనాలు రావడంతో 'తాట తీస్తా' అంటూ 'దిల్' రాజు ఈ మధ్య సీరియస్ అయ్యారు. ఇప్పుడు సమస్య ఆయన నుంచి ఏఎంబీ వైపు మళ్లింది.
Also Read: సంక్రాంతి సినిమాల టికెట్ రేట్స్ - ఏ మూవీకి ఎంత? ఏ స్టేట్‌లో ఎంత?
జనవరి 12న షోలు షెడ్యూల్ విషయంలో 'హనుమాన్' సినిమాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ భావించడంతో ఈ రోజు మహేష్ బాబు భాగస్వామి అయినటువంటి ఏఎంబీలో షోస్ క్యాన్సిల్ చేశారట. తెలంగాణలో 'హనుమాన్' కోసం ముందుగా బుక్ చేసిన నాలుగు థియేటర్లు మైత్రితో అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకుని, దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్‌తో అగ్రిమెంట్స్ చేసుకోవడం ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ కావడం వెనుక అసలు రీజన్ అని టాలీవుడ్ టాక్. ఆ ప్రచారాన్ని 'దిల్' రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ రెడ్డి ఖండించారు. ఆ థియేటర్లను ముందుగా 'గుంటూరు కారం' కోసం బుక్ చేశామని చెబుతున్నారు. సింగిల్ స్క్రీన్లు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తామని ఏషియన్ సునీల్ అంటున్నారట.
Also Read: 'హనుమాన్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - తేజ సజ్జ సినిమా ఎలా ఉందంటే?
''ఏఎంబీలో 'హనుమాన్' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయితే నన్ను ట్యాగ్ చేయండి'' అని ఓ నెటిజన్ ట్వీట్ చేస్తే... ''నన్ను కూడా'' అని దర్శకుడు ప్రశాంత్ వర్మ కోట్ చేశారు. ఆ తర్వాత డిలీట్ చేశారు. దాంతో సంథింగ్ సంథింగ్ జరుగుతోందని నెటిజన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు.
'గుంటూరు కారం', 'హనుమాన్' మధ్య కంపేరిజన్ ఏంటి?
'గుంటూరు కారం' సినిమా నైజాం రైట్స్ 40 కోట్లు అయితే, 'హనుమాన్' రైట్స్ 7 కోట్లు అని... ఈ రెండు సినిమాలను కంపేర్ చేయడం ఏమిటి? అని శిరీష్ రెడ్డి కొందరు మీడియా ప్రతినిధుల దగ్గర ప్రశ్నించారట. ఒక్కటి మాత్రం నిజం... ఏఎంబీ, ఏఏఏలో 'హనుమాన్' షోలు పడకపోతే, వాటి స్థానంలో 'గుంటూరు కారం' షోస్ షెడ్యూల్ చేస్తారు. మరోవైపు 'హనుమాన్' పెయిడ్ ప్రీమియర్లకు వస్తున్న స్పందన చూస్తుంటే... సినిమాకు హిట్ టాక్ వస్తే లాంగ్ రన్ ఉండటం గ్యారంటీ.
Also Read: తేజ సజ్జ చిన్నోడు కాదు, చిచ్చరపిడుగు - హనుమాన్ పెయిడ్ ప్రీమియర్స్‌కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్