Sankranti 2024 Tickets Price: సంక్రాంతి సినిమాల టికెట్ రేట్స్ - ఏ మూవీకి ఎంత? ఏ స్టేట్‌లో ఎంత?
Sankranti 2024 Movie Tickets Demand: సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటిలో ఏ సినిమా టికెట్ ఎంతకు అమ్ముతున్నారు? ఏ స్టేట్‌లో ఎంత రేట్ ఉంది? అనేది చూస్తే...
Sankranti 2024 Movie Releases Telugu: తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ, ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'గుంటూరు కారం' మీద భారీ అంచనాలు ఉన్నాయి. కింగ్ అక్కినేని నాగార్జున 'నా సామి రంగ', విక్టరీ వెంకటేష్ 'సైంధవ్', యంగ్ హీరో తేజ సజ్జ 'హనుమాన్' సినిమాలు సైతం ప్రేక్షకుల్ని దృష్టిలో పడ్డాయి. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్... నాలుగు సినిమాలకు టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి? ఏ స్టేట్‌లో ఎంత రేట్ ఉంది? అనేది చూస్తే...
'గుంటూరు కారం' రేటు యమా ఘాటు!
Guntur Kaaram: 'గుంటూరు కారం' సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటు ఇచ్చాయి. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో రూ. 65, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ. 100 పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఏపీ ప్రభుత్వం టికెట్ రేటు మీద రూ. 50 పెంచుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది.
ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 'గుంటూరు కారం' టికెట్ రేటు 410 రూపాయలు. థియేటర్ దగ్గరకు వెళ్లకుండా బుక్ మై షోలో టికెట్ తీసుకుంటే... వాళ్ల ఫీజుతో కలిసి 450 రూపాయలు. సింగిల్ స్క్రీన్లలో హయ్యస్ట్ టికెట్ రేటు 250 రూపాయలు. బాల్కనీ కాకుండా సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ (నెల టికెట్) అయితే రూ. 175, రూ. 100 ఉన్నాయి. థియేటర్, ఏరియాను బట్టి ఆ రేట్లు మారుతున్నాయి. ఏపీలోని సింగిల్ స్క్రీన్లలో హయ్యస్ట్ టికెట్ రేటు రూ. 200. ఇక... మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ. 230 రేట్లకు టికెట్స్ అమ్ముతున్నారు.
గుంటూరు తర్వాత జోరుగా 'హనుమాన్' బుకింగ్స్!
Hanuman Movie: 'గుంటూరు కారం' తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఆ స్థాయిలో జోరు, హుషారు చూపిస్తున్న సినిమా 'హనుమాన్'. ఇవాళ (గురువారం, జనవరి 11) సాయంత్రం నుంచి పెయిడ్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఎన్ని షోస్ ఓపెన్ చేస్తే అన్ని షోస్ హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. ఈ సినిమా టికెట్ రేట్స్ విషయానికి వస్తే... ఏపీలో మల్టీప్లెక్స్‌లలో రూ.177, సింగిల్ స్క్రీన్లలో 100 నుంచి 175 రూపాయల వరకు టికెట్స్ విక్రయిస్తున్నాయి.
'నా సామి రంగ' & 'సైంధవ్' టికెట్ రేట్స్ ఎంతంటే?
Saindhav: సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకు వెళ్లాలని, అదీ తక్కువ బడ్జెట్‌లో చుడాలని అనుకుంటే... 'నా సామి రంగ', 'సైంధవ్' మంచి ఆప్షన్స్. సీనియర్ హీరోల సినిమాలకు టికెట్ రేట్స్ రీజనబుల్‌గా ఉన్నాయి.
విక్టరీ వెంకటేష్ 75వ సినిమా 'సైంధవ్' అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బావున్నాయి. ఈ సినిమాకు తెలంగాణలోని సింగిల్ స్క్రీన్లలో హయ్యస్ట్ టికెట్ రేటు రూ. 175. లోయస్ట్ అంటే థియేటర్, ఏరియా బట్టి మారుతుంది. కొన్ని థియేటర్లలో రూ. 50కి కూడా టికెట్స్ దొరుకుతున్నాయి. మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేటు రూ. 295. ఏపీలో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కాలేదు.
Also Read: 'గుంటూరు కారం'కు 'దిల్' రాజు రివ్యూ - పేపర్లు ఎక్కువ పెట్టుకోండమ్మా, స్క్రీన్లు చిరుగుతాయ్
Naa Saami Ranga: 'నా సామి రంగ' విషయానికి వస్తే... తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేటు రూ. 295. ఆన్ లైన్ బుకింగ్ అయితే... యాప్ చార్జీలు అదనం. రిక్లైనర్ సీట్లకు రూ. 350 పెట్టాలి. సింగిల్ స్క్రీన్లలో అయితే హయ్యస్ట్ టికెట్ రేటు రూ. 175. థియేటర్, ఏరియా బట్టి సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ రేట్స్ మారుతున్నాయి. ఏపీలో ఈ సినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ కాలేదు.
Also Read: రవితేజకు అన్యాయం - సంక్రాంతి నుంచి వెనక్కి వెళ్లినా సోలో రిలీజ్ డేట్ ఎక్కడ? పోటీ తప్పదా?