Dil Raju: 'గుంటూరు కారం'కు 'దిల్' రాజు రివ్యూ - పేపర్లు ఎక్కువ పెట్టుకోండమ్మా, స్క్రీన్లు చిరుగుతాయ్
Dil Raju On Guntur Kaaram Movie: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'గుంటూరు కారం'లో కొన్ని సీన్స్ నిర్మాత దిల్ రాజు చూశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన ఇచ్చిన రివ్యూ చూద్దాం.
Dil Raju review and speech at Guntur Kaaram pre release event: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన తాజా సినిమా 'గుంటూరు కారం'. అతడు, ఖలేజా తర్వాత గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వస్తోంది. అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఆ అంచనాలను మరింత పెంచారు. నైజాం (తెలంగాణ), విశాఖలో 'గుంటూరు కారం' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఆయన తీసుకున్నారు. ఆల్రెడీ సినిమాలో సాంగ్స్, కొన్ని సీన్స్ చూశానని ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పారు.
మహేష్, శ్రీలీల డ్యాన్సులకు స్క్రీన్స్ చిరిగిపోతాయ్!
'గుంటూరు కారం'లోని 'కుర్చీ మడతపెట్టి...' పాట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ సాంగ్ లిరికల్ వీడియోలో శ్రీలీలతో మహేష్ చేసిన డ్యాన్స్ అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చింది. ఆ డ్యాన్స్ గురించి 'దిల్' రాజు మాట్లాడుతూ ''మహేష్ గారు, శ్రీలీల డ్యాన్సులకు స్క్రీన్స్ చిరిపోతాయ్. మంచి సాంగ్స్ ఇచ్చిన తమన్ కు థాంక్స్. పాటలు మాత్రమే కాదు... ఆదివారం మిక్సింగ్ థియేటర్లో త్రివిక్రమ్ గారు కొన్ని సీన్స్ చూపించారు. ఆ సన్నివేశాలకు తమన్ నేపథ్య సంగీతం మామూలుగా ఇవ్వలేదు. అభిమానులు కొంచెం పేపర్లు ఎక్కువ పెట్టుకోండమ్మా. మీ దగ్గర ఉన్న పేపర్లు సరిపోవు. సూపర్బ్ బ్యాగ్రౌండ్ ఇచ్చాడు తమన్'' అని చెప్పారు.
పోకిరి, దూకుడు, గుంటూరు కారం...
త్రివిక్రమ్ ప్రతిసారి ఏదో మాయ చేస్తాడు!
'గుంటూరు కారం' సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ 'పోకిరి', 'దూకుడు' సినిమాల స్థాయిలో ఉంటుందని 'దిల్' రాజు తెలిపారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతిసారీ ఏదో మాయ చేస్తాడని ఆయన అన్నారు. ''త్రివిక్రమ్ గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఈ సినిమాకు వచ్చేసరికి మహేష్ బాబు కలెక్షన్లతో తాట తీస్తాడు. త్రివిక్రమ్ గారు హీరో క్యారెక్టరైజేషన్ రాసిన విధానం అంత బావుంది. నాకు 'పోకిరి', 'దూకుడు' గుర్తుకు వచ్చాయి'' అని 'దిల్' రాజు తెలిపారు.
Also Read: అభిమానులే నా అమ్మానాన్న, త్రివిక్రమ్ ఫ్రెండ్ కంటే ఎక్కువ: మహేష్ బాబు
''సంక్రాంతికి త్రివిక్రమ్ గారు వదులుతున్న 'గుంటూరు కారం' మన మహేష్ బాబు గారు. ఈ సంక్రాంతి అభిమానులకు పెద్ద పండగ. మహేష్ గారు నాలుగైదు సినిమాల నుంచి ఓ పాటకు డ్యాన్స్ ఇరగదీస్తున్నారు. అది అభిమానుల కోసం. ఈ సినిమాలో 'కుర్చీ మడతపెట్టి...' పాట ఎప్పుడు వస్తుందా? అని ప్రిపేర్ అయ్యి ఉండదు. తెలుగు ప్రేక్షకులు అందరి కోసం ఈ 'గుంటూరు కారం'. బ్లాక్ బస్టర్ సినిమా సంక్రాంతికి రాబోతుంది'' అని 'దిల్' రాజు చెప్పారు. తమన్ సైతం బ్లాక్ బస్టర్ గుంటూరు కారం అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
శ్రీలీల ఎనర్జీ, డ్యాన్స్ మామూలుగా లేదు
'గుంటూరు కారం' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీలీల డ్యాన్స్ గురించి 'దిల్' రాజు ప్రత్యేకంగా మాట్లాడారు. ''శ్రీలీల ఎనర్జీ అయితే మీ అందరికీ తెలిసిందే. నేను చూసిన ఒక సన్నివేశంలో అయితే ఆమె మామూలుగా డ్యాన్స్ చేయలేదు. నేను ఎక్కువ అంచనాలను పెంచాలని అనుకోవడం లేదు. అందుకని, నేను చూసిన సన్నివేశాలు అన్నిటి గురించి చెప్పడం లేదు'' అని అన్నారు. ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానుల సందడి చూస్తుంటే సినిమా విడుదలైన వైబ్స్ కనబడుతున్నాయి.
Also Read: తెలంగాణలో 4 గంటల నుంచి గుంటూరు కారం షోస్ - టికెట్ రేట్ ఎంత పెంచారంటే?