Hanuman: తేజ సజ్జ చిన్నోడు కాదు, చిచ్చరపిడుగు - హనుమాన్ పెయిడ్ ప్రీమియర్స్‌కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్
Teja Sajja's Hanuman Paid Premieres response: 'హనుమాన్' అడ్వాన్స్ బుకింగ్స్ జోరు అదిరింది. పెయిడ్ ప్రీమియర్లతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. బాక్సాఫీస్ బరిలో రికార్డులు నమోదు చేస్తోంది.
Teja Sajja and Prasanth Varma's Hanuman creates new records with paid premiere shows: ప్రేక్షకులు మెచ్చినది పెద్ద సినిమా, హిట్టు సినిమా. ఆ లెక్కన 'హనుమాన్' పెద్ద చిత్రమే. ఈ సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలతో తేజ సజ్జకు పోటీ ఎందుకు? అని ట్రేడ్ వర్గాల్లో కొందరు కామెంట్స్ చేసిన మాట వాస్తవం. అయితే... కంటెంట్ మీద నమ్మకంతో యువ హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మ ధైర్యంగా సంక్రాంతికి తమ 'హనుమాన్'ను థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ముందు రోజు రాత్రి నుంచి పెయిడ్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6.15 గంటలకు షోలు స్టార్ట్ అవుతాయి. పెయిడ్ ప్రీమియర్లకు వస్తున్న రెస్పాన్స్ చూసి కామెంట్ చేసిన వాళ్లు తేజ సజ్జ చిన్నోడు కాదని, 'హనుమాన్' చిన్న సినిమా కాదని అంగీకరిస్తున్నారు. పెయిడ్ ప్రీమియర్స్ హంగామా చూస్తుంటే ఓపెనింగ్స్ పరంగా 'హనుమాన్' కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనబడుతోంది.
హౌస్‌ఫుల్స్... 450 షోలు ఫుల్
నైజాం ఏరియాలో 'హనుమాన్' పెయిడ్ ప్రీమియర్ షోలు సుమారు 200 స్క్రీన్లలో ప్రదర్శించనున్నారు. ఆల్రెడీ 165 షోలు హౌస్‌ఫుల్స్ అయ్యాయి. మరో 26 షోలు ఓపెన్ చేస్తే... టికెట్ బుకింగ్స్ చేస్తూ ఆడియన్స్ బిజీ బిజీగా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం లోపు ఆ షోస్ కూడా హౌస్‌ఫుల్స్ అవుతాయి.
తెలంగాణలో మాత్రమే కాదు... ఏపీలోనూ 'హనుమాన్'కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఆంధ్రాలో ఆల్రెడీ 170 షోలు హౌస్‌ఫుల్స్ అవ్వగా... మరో 27 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేటస్‌లో ఉన్నాయి. రాయలసీమలోనూ సేమ్ సిట్యువేషన్. అక్కడ 36 షోలు హౌస్‌ఫుల్స్ కాగా... మరో 14 ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి. బెంగళూరు సిటీలోనూ 'హనుమాన్' పెయిడ్ ప్రీమియర్లు పడుతున్నాయి. అక్కడ 12 షోలు హౌస్‌ఫుల్స్ కాగా... మరో 9 షోలు యాడ్ చేశారు. అవి ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి.
పెయిడ్ ప్రీమియర్ కలెక్షన్స్ ఎంత?
ఒక్క హైదరాబాద్ సిటీలో పెయిడ్ ప్రీమియర్ షోస్ ద్వారా బుధవారం రాత్రికి 'హనుమాన్' కోటి రూపాయల గ్రాస్ క్రాస్ చేసింది. తెలంగాణలో మిగతా జిల్లాలతో పాటు సీడెడ్, ఆంధ్ర, బెంగళూరు కలిపితే... పెయిడ్ ప్రీమియర్ కలెక్షన్స్ మినిమమ్ మూడు కోట్లు ఉంటుందని ఓ అంచనా. శుక్రవారం ఉదయానికి ఫుల్ ఫిగర్స్ బయటకు వస్తాయి. ఓపెనింగ్ డే 'హనుమాన్' కలెక్షన్స్ పది కోట్ల రూపాయలకు పైగా ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అంచానా వేస్తున్నాయి.
అమెరికాలోనూ అదరగొడుతున్న 'హనుమాన్'
అమెరికాలో కూడా 'హనుమాన్'కు సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది. యుఎస్ఏలోనూ ఈ రోజు ప్రీమియర్ షోలు పడుతున్నాయి. అక్కడ ప్రీమియర్ కలెక్షన్స్ 150కె క్రాస్ చేసింది. సినిమా క్రేజ్ చూస్తుంటే సాయంత్రం లోపు మరిన్ని స్క్రీన్స్ యాడ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.
Also Read: 'హనుమాన్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - తేజ సజ్జ సినిమా ఎలా ఉందంటే?
#HanuManRAMpage begins in the overseas 💥
— Primeshow Entertainment (@Primeshowtweets) January 11, 2024
$150K+ & Counting for #HANUMAN USA Premieres 🔥
Grand US Premieres Begins in a Few Hours 🍿
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123
Overseas Release by @Primeshowtweets @NirvanaCinemas pic.twitter.com/7ED6MvXN25
'హనుమాన్' సినిమాతో తేజ సజ్జ యంగ్ హీరోలలో తనకంటూ స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసుకోవడం పక్కా. ఆల్రెడీ నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. చైల్డ్ ఆర్టిస్టుగా పెర్ఫార్మన్స్ ఇరగదీశారు. హీరోగా 'ఓ మై బేబీ', 'ఇష్క్', 'జాంబీ రెడ్డి'తో వరుస విజయాలు అందుకున్నారు. 'హనుమాన్'తో స్టార్ లీగ్‌లో ఎంటర్ కావడం గ్యారంటీ.
Also Read: ‘హనుమాన్’కు ఆ హీరో కరెక్ట్, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సూపర్ హీరోతో మూవీ - ప్రశాంత్ వర్మ