By: ABP Desam | Updated at : 23 Sep 2022 10:18 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu September 23 Today Episode 563 ( (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu September 23 Today Episode 563)
వసుధారని కిడ్నాప్ చేయించింది సాక్షినే అని తెలిసినప్పటి నుంచీ రిషి రగిలిపోతుంటాడు. వసుధారని అడుగుదామని వెళ్లి ఎందుకో వెనక్కు తగ్గుతాడు. ఆ తర్వాత దేవయాని రూమ్ కి వెళ్లి పెద్దమ్మా లోపలకు రావొచ్చా అని అడుగుతాడు. సీసీ ఫుటేజ్ వీడియో గుర్తుచేసుకుని...సాక్షి గురించి తలుచుకుంటే ఒళ్ళు మండిపోతోందంటాడు. చాలా కోపంగా ఉన్నట్టున్నాడు అనుకున్న దేవయాని...సాక్షి మాటెత్తగానే షాక్ అవుతుంది..దీనికి కొనసాగింపే శుక్రవారం రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్..
ఈ రోజు(శుక్రవారం) బిజీ బిజీగా వంటచేస్తుంటుంది వసుధార. వెనుకే వచ్చిన వ్యక్తి జగతి మేడం అనుకుని..ఏంటి మేడం మీరు...కొంచెం కూరలు తరగండి అంటుంది. ఆ మాట విన్న రిషి..ఏమీ మాట్లాడకుండా కూరగాయలు కట్ చేస్తుంటాడు. వసుధార మాత్రం గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. రిషి సార్ కూడా మీలాగే మేడం..ఆల్ రౌండర్..కాకపోతే కొంచెం కోపం ఎక్కువ..నాలాంటి పర్సన్ దొరకడం రిషి సార్ లక్ కదా మేడం అంటూ వెనక్కు తిరిగి చూసి అక్కడున్న రిషిని చూసి షాక్ అవుతుంది....
Guppedantha Manasu - Promo | 23rd Sep 2022 | #StarMaaSerials #GuppedanthaManasu | Mon to Sat at 7.00 pm #StarMaa. pic.twitter.com/yUICfmGEZb
— starmaa (@StarMaa) September 23, 2022
జరిగిన కథ
గురువారం ఎపిసోడ్ ప్రారంభంలోనే రిషి పెన్ డ్రైవ్ లో ఉన్న సీసీ ఫుటేజ్ చూస్తాడు. వసుధారను పరీక్షలు రాయకుండా చేసేందుకు సాక్షి దగ్గరుండి కిడ్నాప్ చేయించిన ఫుటేజ్ అది. సాక్షిని చూసి షాక్ అయిన రిషి.. ఇంత పెద్ద విషయం నా దగ్గర ఎందుకు దాచావ్ వసుధార అనుకుంటాడు.
మరోవైపు ధరణికి సేవలు చేస్తున్న వసుధార ఇదంతా నావల్లే జరిగిందని బాధఫడుతుంది. అలా ఏమీ కాదని సర్దిచెబుతుంది ధరణి. హాల్లో సోఫాలో జగతి దంపతులు, దేవయాని కూర్చుని ఉంటారు. ధరణికి సేవలు చేయడానికి ఎవరున్నారని దేవయాని అడంతో నర్స్ ని రమ్మని చెబుతాను అంటాడు మహేంద్ర. నేను చూసుకుంటాను కదా అని జగతి అంటుంది.
దేవయాని: ఉదయాన్నే బ్యాగ్ తగిలించుకుని కాలేజీకి వెళతావు నువ్వెక్కడ చూసుకుంటావ్ అని వెటకారం చేస్తుంది. అయినా వసు ఇంకా ఇక్కడే ఎందుకు ఉంది తనని ఇంటికి పంపించేయండి
మహేంద్ర: సరే వదినగారు ఓ మాట రిషితో చెప్పి పంపించేస్తాను
దేవయాని: అవసరం లేదు నేను రిషికి చెబుతాను
Also Read: మాటలతో వసు మనసుకి మరో గాయం చేసిన రిషి, బయటపడిన దేవయాని-సాక్షి కుట్ర!
అటు రిషికి నిజం తెలిసినప్పటి నుంచీ వసుధారకు కాల్ చేస్తుంటాడు..ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో రెస్టారెంట్ కి కాల్ చేసి కనుక్కుంటాడు, తన రూమ్ ని వెళ్లి చూస్తే లాక్ వేసి ఉంటుంది. అప్పుడు మళ్లీ ఫోన్ ట్రై చేయగా రింగ్ అవుతుంది. మీ ఇంట్లో ఉన్నాను సార్ అని చెప్పిన వసుధార...ధరణి యాక్సిడెంట్ సంగతి చెప్పేలోగా కాల్ కట్ చేసి వస్తున్నాను అంటాడు.
ధరణికి సేవచేసి వచ్చిన తర్వాత జగతి కాలేజీ వర్క్ చేసుకుంటుంది. మహేంద్ర వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వర్క్ పై కాన్సన్ ట్రేట్ చేయడం గ్రేట్ అని పొగుడుతాడు. అటు దేవయాని వసుని ఎలాగైనా పంపించేయాలని రిషి కోసం ఎదురుచూస్తుంటుంది. రిషి రాగానే..ధరణి ప్రమాదం గురించి చెప్పి ఇంకా వసు ఇక్కడే ఉందంటుంది. ఉండనీయండి పెద్దమ్మా అనేసి ధరణిని చూసేందుకు వెళ్లిపోతాడు రిషి. ఆ మాటకు షాక్ లో ఉండిపోతుంది దేవయాని.. ఎంతో కష్టపడి అంత ప్లాన్ చేస్తే వర్కౌట్ అవలేదా అని రగిలిపోతుంది.
ఆ తర్వాత ధరణి దగ్గరకు వెళ్లిన రిషితో..నాకోసం వచ్చారు ఇలా జరిగిందని చెబుతుంది.నీకోసం ఎవరొచ్చినా ప్రశాంతంగా ఉండనీయవా అనేస్తాడు రిషి. దేవయాని వంటగదిలో డ్రామా స్టార్ట్ చేస్తుంది. నీకోసం కాఫీ పెట్టడానికి వచ్చాను నాన్న అంటూ గిన్నె మీద పడేసుకుంటుంది..అప్పుడే అక్కడకు వచ్చిన రిషి ఎప్పటిలా హడావుడి చేసి కాఫీ తీసుకురమ్మని వసుధారకి చెప్పేసి వెళ్లిపోతాడు.
Jagadhatri November 29th Episode - 'జగద్ధాత్రి' సీరియల్: కీర్తికి గుడ్ న్యూస్ చెప్పిన ధాత్రి - కౌషికి మీద కోపంతో రగిలిపోతున్న నిషిక!
Brahmamudi November 29th Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కళ్యాణ్‌ను తిట్టి వెళ్లిపోయిన అనామిక - రాజ్‌ను అందరి ముందు ఫూల్‌ను చేసిన కావ్య
Trinayani Serial November 29th Episode - 'త్రినయని' సీరియల్: మరో కొత్త డ్రామాకు సిద్ధమైన తిలోత్తమ - గాయత్రీ పాపను తీసుకొస్తానంటూ హడావిడి!
Nindu Noorella Saavasam November 29th Episode: చిత్రగుప్తుడి మాటలకు కంటతడి పెట్టుకున్న అరుంధతి.. మనోహరికి చీవాట్లు పెట్టిన అమరేంద్ర!
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Jagan Case: కోడి కత్తి కేసులో జగన్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
/body>