సెప్టెంబర్ 23 రాశిఫలాలుమేష రాశి
నిత్యం చింతించే స్వభావం మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అదే సమయంలో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగస్తులు ఇతరుల సహాయాన్ని ఆశించకూడదు. వైవాహిక జీవితంలో ఇతర వ్యక్తుల జోక్యం సమస్యలు సృష్టించవచ్చు.వృషభ రాశి
తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ వహించండి. డబ్బు జాగ్రత్త చేయడం చాలా అవసరం..లేకపోతే మీరు తర్వాత పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. మీరు వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు. ఊహాత్మక ఆలోచనల్లో కూరుకుపోకుండా, మీ పనిపై దృష్టి పెట్టండి.మిథున రాశి
పాత స్నేహితులతో మాట్లాడతారు. జీవిత భాగస్వామితో మంచి సంబంధం కొనసాగాలి అంటే కొంత సమయం వెచ్చించండి. మీ ప్రతిష్టను దెబ్బతీసే వ్యక్తులకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి నుంచి బహుమతి అందుకుంటారు.కర్కాటక రాశి
కుటుంబంలో వ్యక్తుల మధ్య దూరం కారణంగా మీ ఆందోళనలు పెరుగుతాయి. భవిష్యత్ ప్రణాళికల గురించి ఆలోచించేందుకు ఇదే మంచి సమయం. చాలా కాలంగా ఉన్న మనస్తాపాలనుంచి ఈ రోజు బయటపడండి.సింహ రాశి
ఈ రోజు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి స్వభావం మీ పట్ల బావుంటుంది. ఖాళీ సమయంలో పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. ఇతరుల అవసరాల గురించి ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.కన్యా రాశి
ఈ రోజు స్నేహితులు, కుటుంబ సభ్యులతో స్పెండ్ చేసేందుకు మంచి రోజు అవుతుంది. భాగస్వామ్య ప్రణాళికలు విజయం సాధిస్తాయి. వ్యాపారులు లాభపడతారు. ప్రయాణాల్లో లాభపడతారు. వైవాహిక జీవితం కొంత ప్రశాంతంగా ఉంటుంది.తులా రాశి
మీపై మీరు నమ్మకం ఉంచండి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేయండి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. గృహ సంబంధిత పెట్టుబడి లాభదాయకంగా ఉంటాయి. మీ ప్రియమైన వారి పట్ల మీ భావాలను వ్యక్తపరచడంలో కొంత సంకోచం ఉండొచ్చు.వృశ్చిక రాశి
ఈ రోజు వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అకస్మాత్తుగా ఇంటికి అతిథి రావడం వల్ల మీ పనికి భంగం కలిగించవచ్చు. కార్యాలయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది.ధనుస్సు రాశి
ఈ రోజు మీరు ఇంట్లో ఉన్న వృద్ధుల నుంచి డబ్బు పొందుతారు. ప్రేమికులకు మంచి రోజు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పనిపై ఏకాగ్రత మీకు విజయాన్ని ఇస్తుంది.మకర రాశి
మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే యోగా, ధ్యానం మీ నిత్యకృత్యంలో భాగంగా చేర్చుకోండి. ఖర్చులను కాస్త తగ్గించుకుంటే మంచిది. మీరు మీ ఖాళీ సమయంలో మీకు ఇష్టమైన పనులు చేస్తారు. ఇంట్లో పెద్దవారితో సమయం వెచ్చించండి.కుంభ రాశి
ఆహార పానీయాల విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ అవసరాలను చూసుకోవడంతో పాటు, మీ కోసం కూడా సమయాన్ని వెచ్చించండి. ఈరోజు ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు. రోజంతా సంతోషంగా ఉంటారు.మీన రాశి
స్నేహితులు, సన్నిహితుల మద్దతు మీకు లభిస్తుంది. ఈ రోజు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వాహనం ప్రమాదం ఉంది జాగ్రత్త. మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించండి. ప్రేమ సంబంధాలు బావుంటాయి. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు.


Follow for more Web Stories: ABP LIVE Visual Stories