Guppedantha Manasu November 30th Update: జగతి ఆనందంపై నీళ్లు చల్లేసిన రిషి, మరో కుట్ర ప్లాన్ చేస్తోన్న దేవయాని!
Guppedantha Manasu November 30th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu November 29th Today Episode 620)
హాస్పిటల్ నుంచి ఇంటికి వెళుతుండగా... రిషి-వసుని చూసి జగతి సంతోషపడుతుంది.. అమ్మకు రక్తం ఇచ్చావ్, అపురూపంగా ఇంటికి తీసుకెళుతున్నావ్, చిన్న కుదుపుకే sorry చెబుతున్నావ్..ఇంతకన్నా నాకేం కావాలి అని మురిసిపోతూ పక్కనే ఉన్న మహేంద్రకి మెసేజ్ చేస్తుంది. నా కొడుకు పక్కన వసుధార..వెనుక సీట్లో నేను.. ఈ జన్మకి ఇంతకన్నా ఏం కావాలి ఈ క్షణం ప్రాణంపోయినా పర్వాలేదు మహేంద్ర అంటూ మెసేజ్ ఇస్తుంది.. మహేంద్ర ఫోన్ రిషి పక్కన ఉంటుంది. రిషి ఆ ఫోన్ తీసి మెసేజ్ చూసి డిలీట్ చేసి పక్కన పెట్టేస్తాడు..మీ ఫోన్లో మెసేజ్ డిలీట్ చేశాను sorry అనుకుంటూ ఫోన్ మహేంద్రకి అందిస్తాడు. మహేంద్ర కూడా అప్పుడు అదే విషయం ఆలోచిస్తాడు..ఈ ప్రయాణం బావుందని...
ఇంటి దగ్గర కారు ఆగగానే దేవయాని కోపంతో రగిలిపోతూ ఇంటిముందు నిల్చుని ఉంటుంది... వసుధార జగతిని జాగ్రత్తగా పట్టుకుని కారు దించుతుంది. జగతిని నిల్చోబెట్టి లగేజ్ తీసుకొచ్చేందుకు వసుధార వెళుతుంది..జగతి అడుగు వేస్తూ తూలి పడబోతుంటే రిషి వెళ్లి పట్టుకుంటాడు..జగతి ఎమోషన్ అవుతుంది...జాగ్రత్త మేడం రండి అని తల్లిని జాగ్రత్తగా లోపలకు తీసుకెళతాడు..వసు, మహేంద్ర సంతోషిస్తే దేవయాని కోపంతో రగిలిపోతున్నా...రిషి చూసేసరికి మాత్రం లేనినవ్వు తెచ్చిపెట్టుకుంటుంది. ఏం చేసినా ఇంటికి మళ్లీ తిరిగి వచ్చింది..నేను జగతిని ఏం చేయలేనా అనుకుంటూనే రండి రండి అని లోపలకు ఆహ్వానిస్తుంది..ఇంతలో ధరణి హారతి తీసుకొచ్చి దిష్టి తీస్తుంది...ధరణి ఇదంతా అవసరమా అని దేవయాని అనబోతుంటే..పెద్దమ్మా మీరు ఆగండి..వదినా మీరు కానివ్వండి అంటాడు. ఇరుగు దిష్టి-పొరుగు దిష్టి- ఇంట్లో వాళ్ల దిష్టి అని దేవయానిని చూస్తూ దిష్టి తీస్తుంది ధరణి...మళ్లీ మహేంద్ర-జగతి ఇద్దరూ కొడుకుతో కలసి లోపలకు అడుగుపెడతారు... కాలం నీకు కలిసొచ్చిందిజగతి...మళ్లీ నిన్ను బయటకు ఎలా పంపించాలో నాకు తెలుసులే అనుకుంటుంది.
Also Read: కార్తీక్ ని ప్రశ్నించిన దీప, మోనితను తీసుకెళ్లిపోయిన సౌందర్య, ఇంద్రుడిలో మార్పు -ఇదే కీలక మలుపు
లోపలకు వెళ్లిన తర్వాత రిషి...డాడ్ అని పిలిచి మహేంద్రని హగ్ చేసుకుని వెల్ కమ్ టూ హోమ్ డాడ్ అని చెబుతాడు. మీరు కింద నా రూమ్ వాడుకోండి..నేను డాడ్ పైన ఉంటాం అని చెప్పి వసుధార నువ్వు మేడంని తీసుకెళ్లు..డాడ్ మీరు పందడి అంటాడు రిషి. వాళ్లిద్దర్నీ చూస్తుండిపోతారు జగతి-వసుధార... ఇదంతా చూసిన దేవయాని మాత్రం రగలిపోతుంటుంది..
ధరణి: అత్తయ్యగారు వంటేం చేయమంటారు
దేవయాని: ఫోన్ చేసి చెబుతాను లేదంటే మెసేజ్ చేస్తాను సరేనా...
ధరణి: అలాగే అత్తయ్యగారు అనేసి వెళ్లిపోతుంది...
ఆ తర్వాత ధరణి వెనుకే వంటగదిలోకి వెళుతుంది దేవయాని...( ఎవరి దిష్ఠి కళ్లు పడ్డాయో ఏమో మొత్తానికి గండం గడిచిందిఅని ధరణి అన్నమాటలు తలుచుకుంటుంది)
దేవయాని: ఏం చేస్తున్నావ్..వంటపని చేస్తున్నాను, గిన్నెలు తోముతున్నాను అనే సమాధానం చెప్పకు.. నువ్వేం చేశావో నీకు అర్థమైందా.. జగతి రాగానే హారతిచ్చి దిష్టి తీయమని నీకెవరు చెప్పారు..ఏంటి నీ పెత్తనం..జగతి ఇంట్లోకి వచ్చిందని సంబరపడుతున్నావా..
ధరణి: అందులో తప్పేముంది..
దేవయాని: ఇంట్లో నేను ఉన్నానని నీకు గుర్తుందా..
ధరణి: పెద మావయ్యగారు చెప్పారు..ఎన్ని పీడకళ్లు పడ్డాయో దిష్టి తీయమని చెప్పారు...
దేవయాని: ఇంట్లో దిష్టికళ్లు ఉన్నాయంటావా.. ఆయన చెప్పగానే చేయడమేనా..నాకు చెప్పాలి కదా
ధరణి: నేను అలా అనలేదు..కావాలంటే మావయ్యగారిని అడగండి అని అటుగా వెళుతున్న ఫణీంద్రను పిలుస్తుంది..
మీకేమైనా కాఫీ కావాలా అని అడుగుతోందని కవర్ చేస్తుంది దేవయాని... నాకేమీ వద్దని వెళ్లిపోతాడు ఫణీంద్ర...
దేవయాని: చాలా రోజుల నుంచి చూస్తున్నా నీక్కొంచెం దూకుడు ఎక్కువైంది..ఆ జగతిని చూసి మిడిసిపడకు ఎవర్ని ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు అని బెదిరించి వెళ్లిపోతుంది...
Also Read: వసుకి నిజం చెప్పేసిన జగతి, దేవయానిని టెన్షన్ పెట్టిన ధరణి
వసు...జగతికి సేవలు చేస్తుండగా అక్కడకు రిషి వస్తాడు. మేడంకి జ్యూస్ తీసుకురా అని చెప్పి వసుని పంపిస్తాడు. రిషి సార్ మేడంతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటున్నారేమో అని అనుకుని వసు అక్కడి నుంచి వెళ్లిపోతుంది...
రిషి: ఇప్పుడెలా ఉంది..
జగతి: పర్లేదు రిషి
రిషి: మందులు జాగ్రత్తగా తీసుకోండి..తొందరగా రికవరీ అవుతారు. మేడం ..డాడ్ మీరు ఇంట్లోంచి వెళ్లిపోయారు.. ఎందుకు వెళ్లారో, ఎక్కడికి వెళ్లారో తెలియదు ఈ విషయం పక్కనపెడితే ..యాక్సిడెంట్ లో గాయాలతో మీరు బయటపడ్డారు.. అదే ఈ యాక్సిడెంట్ లో డాడ్ కి ఏమైనా జరిగితే..డాడ్ కి ఏదైనా జరగరానిది జరిగితే ఏంటి పరిస్థితి..మీకేమైనా అయితే డాడ్ తట్టుకోగలరా..డాడ్ ఏమైపోయేవారో ఆలోచించండి..అదృష్టం బావుండి మీరిద్దరూ బయటపడ్డారు..లేదంటే ఏం జరిగేదో ఊహించగలరా.. మీకేమైనా జరిగితే డాడ్ తట్టుకునేవారా..ఆయనకు ఏదైనా జరిగితే మీరు-నేను తట్టుకోగలమా.. బంధాలను ప్రేమిస్తే గౌరవిస్తే సరిపోదు కదా..ఆ బంధాలను అపురూపంగా చూసుకోవాలి కదా...
జగతి: ఇప్పుడు నేను ఏం చేశాను
రిషి: బంధం గురించి మెసేజ్ పెట్టడం మాత్రమే కరెక్ట్ కాదు...డాడ్ కి మీరు మెసేజ్ పెట్టారు..దాన్ని నేను డిలీట్ చేశాను ఓ బంధాన్ని కోరుకుంటే దానికోసమే బతకాలి మేడం...ఇక చచ్చిపోయినా పర్వాలేదని మెసేజ్ లో రాశారు.. అలాంటివి చూస్తే డాడ్ బాధపడతారు..అందుకే నేను డిలీట్ చేశాను..డాడ్ కి మీరంటే ఎంత ప్రేమో మీకన్నా ఎక్కువగా నాకు తెలుసు అలాంటి మాటలు డాడ్ తట్టుకోలేరు..ఈ విషయం బహుశా మీకు ఇప్పటివరకూ తెలియదేమో..డాడ్ ఆనందం కోసమే మిమ్మల్ని ఇంటికి రమ్మన్నాను..డాడ్ కోసం నేను ఏది చేయడానికి అయినా సిద్ధమే మేడం.. నేను ఏం చేసినా డాడ్ కళ్లలో సంతోషం చూడాలి అనుకుంటాను...
ఎపిసోడ్ ముగిసింది...