News
News
X

Karthika Deepam November 30th Update: కార్తీక్ ని ప్రశ్నించిన దీప, మోనితను తీసుకెళ్లిపోయిన సౌందర్య, ఇంద్రుడిలో మార్పు -ఇదే కీలక మలుపు

కార్తీకదీపం నవంబరు 30 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

FOLLOW US: 
Share:

Karthika Deepam November 30th  Episode 1523 (కార్తీకదీపం నవంబరు 30ఎపిసోడ్)

దీప-కార్తీక్ బతికే ఉన్నారు..ఇంద్రుడు నేను రావడం కన్నా ముందే శౌర్యని తీసుకుని పారిపోయాడని కన్ఫామ్ చేస్తుంది సౌందర్య.
హిమ: అమ్మ నాన్నలు బతికే ఉన్నారా
సౌందర్య: అది మన అదృష్టం నమ్మకం ఎందుకంటే శౌర్య మన చేతికి దొరికినట్టే దొరికి దూరమైపోతోంది..మరి మీ అమ్మానాన్నలు దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలి
ఆనందరావు: ఈలోగా మోనిత సంగతి తేల్చాలి.. తనని పట్టుకుంటే అయినా చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది
సౌందర్య: దాని లెక్కేంటో రేపు తేలుస్తాను...

మరో వైపు దీప బెడ్ పై ఉంటుంది..దీపని చూసి కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచీ జరిగినవన్నీ గుర్తుచేసుకుంటాడు. నువ్వు కనిపించక పోయేసరికి ప్రాణం పోయినట్టు అయింది దీప నువ్వు కనిపించకపోతే నేను ఏమైపోతాను అనుకున్నావు. నిన్ను కాపాడుకునే అవకాశం దూర చేయకు దీపా అని ఏడుస్తాడు. ఇంతలో డాక్టర్ వచ్చి అంతా ఓకే కదా అని అడుగుతుంది. రేపు పొద్దున్నే ఆపరేషన్ చేద్దాం అని కార్తీక్ అంటే.. పేషెంట్ పరిస్థితి బాగానే ఉంది కానీ ఆపరేషన్ చేయాల్సిన మీ పరిస్థితి బాలేదు అందుకే రెండు రోజులు ఆగి ఆపరేషన్ చేద్దాం అంటుంది. మీరొక డాక్టర్ అయి ఉండి.. తన ప్రాబ్లెమ్ సాల్వ్ చేయడం మీ చేతిలో ఉండికూడా ఇంత బాధపడుతున్నారంటే ఆవిడ మీద మీకెంత ప్రేమ ఉండాలి.. ఆమె చాలా అదృష్టవంతురాలు..ఆవిడను చూస్తే అసూయగా ఉందంటుంది. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండని కార్తీక్ అనడంతో ఆమె వెళ్లిపోతుంది..
కార్తీక్: నిన్ను చూసి అసూయపడుతున్నారు..నేను నీ భర్త కావడం అదృష్టం అంట..కానీ నన్ను పెళ్లిచేసుకోవడం నీ దురదృష్టం. మోనిత మాటలు నమ్మి నిన్ను బాధపెట్టాను... ఇక మళ్లీ ఆ రాక్షసి మొహం కూడా చూడను..నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను

Also Read: వసుకి నిజం చెప్పేసిన జగతి, దేవయానిని టెన్షన్ పెట్టిన ధరణి

మోనిత కార్తీక్ కోసం ఎదురుచూస్తూ కార్తీక్ ఎక్కడికి వెళ్లి ఉంటాడు ఆ దీప కూడా లేదు అంటే ఇద్దరూ కలసి వెళ్లిపోయారా, కార్తీక్ కు గతం గుర్తుకువచ్చిందా.. హైదరాబాద్ కి వెళ్ళిపోయారేమో అనుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది మోనిత. అప్పుడు మోనిత లగేజ్ తీసుకొని హైదరాబాద్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది...ఈ లోగా అక్కడ పనిచేసే అప్పుడు అక్కడ పని చేసే అమ్మాయికి ఫోన్ చేసి బొటిక్ అమ్మేయమని చెబుతుంది మోనిత. వద్దని శివలత చెప్పడంతో...అయితే నువ్వే మెంటైన్ చేయి అంటుంది. అసలు వాళ్లు కనిపిస్తే కాల్చేయాలని ఉంది అని అరుస్తుంటుంది...ఆ తర్వాత పక్కనే ఉన్న సౌందర్యని చూసి షాక్ అవుతుంది
సౌందర్య:  ఎవరిని చంపాలి అనుకుంటున్నావే 
మోనిత: ఎవరో డ్రెస్ మెటీరియల్ తీసుకెళ్లారు
సౌందర్య: నోర్ముయ్.. మొన్న నా తల పగలగొట్టి చంపాలని చూసావు మళ్ళీ ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నావు. ఆరోజు  నేను ఇంట్లోకి వస్తుంటే ఎందుకు అలా చేశావ్..ఇంట్లో ఏం ఉందో ఏం లేదో తేలుస్తాను అనుకుంటూ వెళ్లి ఇల్లంతా వెతుకుతుంది 
ఇంట్లో ఏం కనిపించకపోయేసరికి మళ్ళీ మోనిత ని నిలదీస్తుంది 
మోనిత: మళ్లీ ఆంటీ వచ్చేసరికి ఇంట్లో లేరు సంతోషం అనుకుంటూ.. ఆంటీ ఇక్కడకి వచ్చారంటే కార్తీక్, దీప అక్కడకు వెళ్లలేదా.. వాళ్లు బతికి ఉన్న సంగతి ఆంటీకి తెలియలేదా..కార్తీక్ బతికి ఉన్న తెలియలేదా అనుకుంటుంది
సౌందర్య: నన్ను కొట్టే సాహసం చేశావంటే ఇంట్లో ఏదో ఉంది 
సౌందర్య ని వెనక్కి నెట్టేసి లోపలికి వెళ్లి తలుపులు వేసుకుంటుంది. ఇప్పుడు మోనిత తలుపులు తీయ్ అని అరవడంతో.. లోపలి నుంచి గన్ను తీసుకొచ్చి సౌందర్యని బెదిరిస్తుంది. మొన్న దెబ్బతో వదిలేసాను ఈసారి ఎక్కువ చేస్తే షూట్ చేసి పడేస్తాను అని బెదిరిస్తుంది. నేను ఎలా ఉంటే మీకెందుకు ఆంటీ మీ లైఫ్ నేను డిస్టర్బ్ చేయడం లేదు కదా మీ కొడుకు కోడలు కూడా లేరు కదా నా లైఫ్ లోకి మళ్ళీ రాకండి అని అనడంతో వెంటనే మోనిత చేతిలో ఉన్న గన్ను లాక్కుని మోనిత కి గురి పెడుతుంది సౌందర్య. దాంతో మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు బ్యాగు తీసుకుని బయలుదేరావ్ కదా ఎక్కడికో నేను కూడా వస్తాను వెళ్దాం పద అని మోనిత ను గన్ను పట్టుకుని బెదిరిస్తూ అక్కడి నుంచి తీసుకెళ్తుంది సౌందర్య.

Also Read: దీప కోసం డాక్టర్ బాబు కన్నీళ్లు, సౌందర్యని మళ్లీ తప్పుదారిపట్టించిన ఇంద్రుడు

శౌర్య తన అమ్మానాన్నని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో చంద్రమ్మ అక్కడికి పాలు తీసుకుని వచ్చి తాగమని చెబుతుంది. ఇంద్రుడు పడుకొని ఉండగా అప్పుడు దీప గురించి తలచుకొని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. మరొకవైపు దీప హాస్పిటల్ బెడ్ పై పడుకొgv ఉండగా కార్తీక్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు.

రేపటి ( గురువారం) ఎపిసోడ్ లో
శౌర్యని తెస్తానని మాటిచ్చారు కదా వెళ్లి వెతకొచ్చు కదా అంటే నిన్ను వదిలేసి వెళ్లలేను అంటాడు..నేను ఏమవుతానని మీకు తాపత్రయం అంటుంది దీప. మరోవైపు అంత ఆస్తి పరురాలు బిడ్డకోసం తిరిగి తిరిగి నడిరోడ్డుపై అనాథలా పడి ఉంది చంద్రుడు నన్ను మనిషి అంటారా అని ఇంద్రుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు... అయితే జ్వాలమ్మని ఇచ్చేద్దాం అని డిసైడ్ అవుతారు..

Published at : 30 Nov 2022 09:07 AM (IST) Tags: Karthika Deepam Serial karthika Deepam Serial Today Episode Karthika Deepam Serial Written Update Karthika Deepam Episode 1523 Karthika Deepam Serial November 30th

సంబంధిత కథనాలు

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి

Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్‌ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

Pawan Kalyan New Movie: పవర్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూస్, పవన్ - సుజిత్‌ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

టాప్ స్టోరీస్

Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!

Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!

Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేసిన గుజరాత్

Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేసిన గుజరాత్

BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !

BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !