అన్వేషించండి

Guppedantha Manasu మార్చి 1 ఎపిసోడ్: మహేంద్ర ఆవేశం, జగతి ఆనందం, రిషి కోపం, దేవయానికి షాక్

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. జగతిని టార్గెట్ చేసి అవమానిద్దామని రిపోర్టర్ తో కలసి ప్లాన్ చేసిన దేవయానికి షాకిచ్చాడు మహేంద్ర. మార్చి 1 మంగళవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…

షార్ట్ ఫిలిం
షార్ట్ ఫిలిం ప్లే అవడంతో నిన్నటి ( సోమవారం) ఎపిసోడ్ ముగిసింది...ఈ రోజు కూడా షార్ట్ ఫిలిం కంటిన్యూ అయింది. కరెంట్ పోతే బల్బు వెలగదు చీకటి..కొవ్వొత్తి కాసేపటికి కరిగిపోతుంది, కానీ 
విద్యా జ్యోతి ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుందంటూ షార్ట్ ఫిలిం పూర్తవుతుంది. సూచన ( సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు) అనే షార్ట్ ఫిలిం చూసి మంత్రిగారు కాన్సెప్ట్ అద్భుతం అని పొగిడేస్తారు.  దేవయాని మాత్రం తప్పదన్నట్టు చప్పట్లు కొడుతుంది. గౌతమ్ మాత్రం మిత్రద్రోహి అని రిషిని తిట్టుకుంటాడు. ఈ కాన్సెప్ట్ ఎవరిది అని అడిగిన మంత్రితో... జగతి మేడం పేరు చెబుతాడు ఫణీంద్ర. జగతిని ప్రత్యేకంగా పిలిచి అభినందిస్తారంతా. కంగ్రాట్స్ మేడం అని మహేంద్ర, రిషి అంతా షేక్ హ్యాండ్ ఇచ్చి చెబుతారు. దేవయాని రగిలిపోతుంటుంది. గౌతమ్ డల్ గా ఉండడం చూసి దగ్గరకు వెళ్లిన రిషి...నేను డైరెక్టర్ ని ఎంత  కన్విన్స్ చేసినా వినలేదు,నువ్వు చేసింది బాగాలేదన్నారు అందుకే నన్ను ఉంచారని Sorry అని చెబుతాడు. గౌతమ్ కూడా ఇట్స్ ఓకే అనేస్తాడు.

Also Read: మోనిత ఎత్తుకి సౌందర్య-దీప పైఎత్తు, మంగళవారం ఎపిసోడ్ లో ట్విస్ట్ అదిరింది
ప్రెస్ మీట్
షార్ట్ ఫిలిం పూర్తైన తర్వాత ప్రెస్ మీట్ పెడతారు. ఒక్కొక్కరు మాట్లాడుతుంటారు. సార్ మీరు షార్ట్ ఫిలింలో లేనందుకు బాధపడుతున్నారా అని వసుధార అడిగితే..ఫీలవకుండా ఎందుకుంటాను అంటాడు. అయినా రిషి నా కన్నా బాగా చేశాడు అంటాడు.  ఇంతలో దేవయానితో కుమ్మక్కైన రిపోర్టర్ లేచి నిలబడి మీడియా వాళ్లు ప్రశ్నలు అడగొచ్చా అంటే సరే అంటారు మంత్రిగారు. షార్ట్ ఫిలిం గురించి అడిగిన ప్రశ్నలకు రిషి, మహేంద్ర, జగతి సమాధానం చెబుతాడు. ఆ తర్వాత ఓ రిపోర్టర్ జగతిని టార్గెట్ చేస్తాడు.ఈ క్రెడిట్ మొత్తం మా ఫ్యాకల్టీ హెడ్ జగతిమేడంకే చెందుతుందని ఫణీంద్ర మైక్ ఆమెకు ఇస్తాడు.  ముందుగా మీకు అభినందనలు అని మొదలుపెట్టిన రిపోర్టర్ పొగడ్తలతో ప్రారంభించి తీవ్రమైన క్వశ్చన్స్ వేస్తాడు. 

జగతిపై ప్రశ్నల వర్షం
మీరు గతంలో పనిచేసిన కాలేజీలోనూ ఇలాంటి కార్యక్రమాలతో స్టూడెంట్స్ లో ఉత్సాహాన్ని పెంచారని తెలుసుకున్నాం అన్న రిపోర్టర్.... విజయం సాధించిన ప్రతి మగాడి విజయం వెనుకా స్త్రీ ఉందని అంటారు...మీ విజయం వెనుక ఉన్నదెవరు అని అడుగుతాడు. మీ వెనుక ఏ పురుషుడు లేడంట కదా అంటాడు. మీరు ఒంటరి అంట కదా... మీకు ఫ్యామిలీ వివరాలు ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదంట కదా అన్న ప్రశ్న వినగానే....మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడండి, వ్యక్తిగత విషయాలు వద్దని జగతి చెబుతున్నా పట్టించుకోకుండా రిపోర్టర్ రెచ్చిపోతాడు. దేవయాని ఎంజాయ్ చేస్తుంటుంది. మీరు అందరికీ మంచి చెబుతారు, విద్యా ప్రాముఖ్యతను చెబుతారు...మీ ఫ్యామిలీ గురించి అందరకీ తెలుసుకోవాలని ఉంటుంది కదా అంటాడు. రిషి కూడా ఇన్వాల్వ్ అయి నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్ అంటాడు. 

జగతి, రిషి, మహేంద్ర వారించినా వినని రిపోర్టర్
నేను లెక్చరర్ ని నా వృత్తి గురించి మాత్రమే అడగండి అంటుంది జగతి. అంటే మీ పర్సనల్ అడగొద్దు అంటున్నారు, దాచి పెట్టేంత విషాదం దాగుందా, లేదా దాచుకునేన్ని రహస్యాలున్నాయా అని రెచ్చగొడతాడు. మంత్రి కూడా ఇన్వాల్వ్ అయి... ఇలాంటి విషయాలు ఎందుకు అడుగుతున్నారంటే... మిషన్ ఎడ్యుకేషన్ అగానే జగతి మేడం పేరు చెబుతున్నారు, ఆవిడ వివరాలు తెలుసుకోమని ఎన్నో ఉత్తరాలు వస్తున్నాయంటాడు రిపోర్టర్. చెప్పండి మేడం మీ కుటుంబం గురించి, మీ తల్లిదండ్రుల గురించి అని మంత్రి అడుగుతాడు.  మీరు మీ వారిని వదిలేశారా, పెళ్లికాకుండానే తల్లయ్యారా అన్న రిపోర్టర్ ప్రశ్నలకు మహేంద్ర ఆవేశంతో లేవబోతుంటే రిషి చేయి పట్టుకుని ఆపుతాడు. విడాకులైనా మళ్లీ పెళ్లెందుకు చేసుకోలేదు మేడం, అంటే వివాహ వ్యవస్థపై మీకు నమ్మకం లేదా, అందరికీ మంచి చెప్పే మీ జీవితంలో చెప్పలేని గతం ఉందా అని నోటికొట్టు మాట్లాడుతుండగా..ఇక్కడ జరుగుతున్నదేంటి అని మహేంద్ర ప్రశ్నించగా... మేడం గురించి మీకు వివరాలు తెలిస్తే చెప్పండి సార్ అంటాడు రిపోర్టర్.  ఇన్ని ప్రశ్నలు అడిగాను మీరు సమాధానం చెప్పలేదు, మీకు బాబు ఉన్నాడంటగా అనగానే జగతి-రిషి ముఖాలు చూసుకుంటారు.

Also Read: జగతి తన భార్య అని ప్రెస్ మీట్ లో చెప్పేసిన మహేంద్ర, దేవయానికి భారీ షాక్
రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో జగతి అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. ఆగు జగతి..నీ భర్తగా చెబుతున్నా ఆగు అంటూ వెళ్లి జగతిని చేయి పట్టుకుని తీసుకొస్తాడు. ఇప్పుడు చెబుతున్నా...జగతి నా భార్య... మా ఇద్దరికీ సింహం లాంటి కొడుకున్నాడు వాడే రిషేంద్ర భూషణ్ అని స్టేజ్ పై చెబుతాడు. అక్కడున్న అంతా షాక్ అవుతారు. రిషి కోపంతో కారుని తీసుకుని గ్రౌండ్ లో స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటాడు...ఎదురుగా వసుధార కనిపించడంతో కారు ఆపి కోపంగా చూస్తుంటాడు....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget