IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Guppedantha Manasu ఫిబ్రవరి 28 ఎపిసోడ్: జగతి తన భార్య అని ప్రెస్ మీట్ లో చెప్పేసిన మహేంద్ర, దేవయానికి భారీ షాక్

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. జగతిని టార్గెట్ చేసి అవమానిద్దామని రిపోర్టర్ తో కలసి ప్లాన్ చేసిన దేవయానికి షాకిచ్చాడు మహేంద్ర. ఫిబ్రవరి 28 సోమవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…

FOLLOW US: 

గుప్పెడంత మనసు ఫిబ్రవరి 28 సోమవారం ఎపిసోడ్

స్టేజ్ దగ్గరకు వెళ్లిన రిషి..  మినిస్టర్ గారు వచ్చేసరికి గేట్ దగ్గర కొందరు స్టూడెంట్స్ ని రెడీ చేసి పెట్టు అని పుష్పకి చెబుతాడు. మరోవైపు స్టేజ్ పై ఏర్పాట్లు చేస్తోన్న వసుధార... ఏదో తాడు అందుకునేందుకు వసుధార పైకి ఎగురుతుంటే సడెన్ గా వెళ్లి పైకెత్తుకుంటాడు. అప్పుడే అక్కడకు వచ్చిన గౌతమ్ కి ఆ సీన్ చూసి గుండె పగిలిపోతుంది. శనివారం ఎపిసోడ్ ఇక్కడే ముగిసి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడే మొదలైంది. కాఫీ-టీలు నువ్వు తీసుకురావడమేంటని రిషి అంటే..మన పని మనం చేసుకోవడంలో తప్పేముందని గౌతమ్ అనగానే...మీరు సూపర్ సార్ ఇలాంటి వాళ్లంటే నాకు చాలా గౌరవం అంటుంది. వసుధార టీ తాగు అని ఇస్తాడు..నన్ను అడగవా అని రిషి అంటే నేను ఇవ్వనని గౌతమ్ చెప్పడంతో...వెంటనే వసు చేతిలో టీ లాక్కుంటాడు. మరో టీ వసుధారకి ఇచ్చిన గౌతమ్..టీ ఎలా ఉందని అడిగితే... బావుంది సార్ మీరే పెట్టారా అంటుంది. రిషి తాగిన టీ గ్లాస్ గౌతమ్ చేతిలో పెట్టేసి వెళ్లిపోతాడు రిషి. 

Also Read: మోనిత పద్మవ్యూహంలో చిక్కుకున్న సౌందర్య కుటుంబం
మినిస్టర్ గారు రాకకోసం అంతా గేట్ దగ్గర ఎదురుచూస్తుంటారు. ఇంతలో కారు రావడం మినిస్టర్ దిగడం..రిషి బొకే ఇచ్చి ఆహ్వానించడం జరుగుతుంది. ఇంత చిన్న వయసులో ఎన్ని అద్భుతాలు చేస్తున్నావయ్యా అంటూ పొగిడేస్తాడు మినిస్టర్. మీ కాలేజీ గురించి, మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఏం మాట్లాడినా ఒక్కటే చెబుతాను..అద్భుతం అంటాడు. స్పీచ్ లు ఏవీ వద్దు..సింపిల్ గా షార్ట్ ఫిలిం చూసేసి వెళ్లిపోతానని అంటే... మీరేం చెప్పినా స్టూడెంట్స్ స్ఫూర్తి పొందుతారు నాలుగు మాటలు మాట్లాడాలి అంటాడు. నేను షార్ట్ ఫిలిం చెక్ చేసి వస్తాను, వసు నువ్వు స్టేజ్ దగ్గరే ఉండు అని చెబుతుంది. నా కొడుకు ఎంత చక్కగా ఉన్నాడో అనుకుంటూ బయటకు వెళుతుంది. ఎదురుగా దేవయాని కనపడడడంతో తనత పాటూ వచ్చిన స్టూడెంట్స్ ని పంపించేస్తుంది. 

జగతి-దేవయాని: ఏంటి జగతి చాలా సంతోషంగా, ఉత్సాహంగా కనిపిస్తున్నావ్ అంటే..పదిమందికి ఉపయోగపడే మంచి పనులు చేస్తుంటే మనసు ఉత్సాహంగానే ఉంటుందని రిప్లై ఇస్తుంది జగతి. నలుగురి నాశనం కోరుకునే వారికి కంటినిందా నిద్రపట్టదు, పెదాలపై చిరునవ్వు ఉండదు..ఈ విషయంలో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది...అస్తమానం తమరికి ఇవే ఆలోచనలు కదా అంటుంది. ఈ వేడుకలంతా నీవే అని సంబరపడుతున్నావా అంటే... అవును ఈ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ ఐడియా నాదే...ఈ సందర్భంగా నా కొడుక్కి మంచి పేరు వస్తుంది, అది ఇంకా సంతోషం కదా అంటుంది. ఏం చూసుకుని ఇంత మిడిసిపాటు అని దేవయాని అంటే..నా కొడుకుని, మా ఆయన్ని చూసుకుని అని రిప్లై ఇస్తుంది. ధరణి మాత్రం జగతి చెప్పిన సమాధానాలు విని మురిసిపోతుంది. అక్కయ్యగారూ అందరూ బావుండాలని కోరుకుంటే మీరు బావుంటారు, మీ ఆరోగ్యం బావుంటుంది.... అందరూ చెడిపోవాలని కోరుకుంటే మీ ఆరోగ్యం చెడిపోతుంది జాగ్రత్త అంటూ..వెళ్లి కూర్చోండి, జ్యూస్ పంపిస్తానంటుంది. ఏమీ అనుకోకండి..నాక్కొంచెం పనుంది నేను వెళ్లాలి..మీరు వెళ్లి కూర్చోండంటుంది...ఇంతలో గౌతమ్ వచ్చి ఇక్కడే ఉండిపోయారేంటి రండి అని పిలుస్తాడు. అక్కడున్నవాళ్లంతా మన ఫ్యామిలీ కాదు కదా  గౌతమ్ అంటే..జగతి మేడం కాదనుకోండి అంటాడు గౌతమ్. దేవయానికి కాలేజీలో ఓ వ్యక్తి ఎదురుపడతాడు..ఇద్దరూ క్రూరంగా నవ్వుకుంటారు ( అంటే ఏదో ప్లాన్ చేసినట్టే ఉంది). 

Also Read: రిషి-వసుని అలా చూసి ముక్కలైన గౌతమ్ మనసు
షార్ట్ ఫిల్మ్: స్టేజ్ పై ఏదో సర్దుతున్న వసుధారకి మెసేజ్ చేసిన రిషి... జగతి మేడంని త్వరగా ప్రోగ్రాం మొదలెట్టమని చెబుతాడు. అదే విషయం జగతికి చెబుతుంది వసుధార. ప్రారంభ ఉపన్యాసం జగతి మొదలెడుతుంది. దేవయాని అయిష్టంగా మొహం పెట్టి చూస్తుంటుంది. మరోవైపు గౌతమ్...నువ్వు-నేను ఓ షార్ట్ ఫిలింలో యాక్ట్ చేయడం నాకు థ్రిల్లింగ్ గా ఉందంటే..మేడం మాట్లాడేది నన్ను విననీయండి అంటుంది వసుధార. షార్ట్ ఫిలిం గురించి గొప్పగా వివరిస్తుంది జగతి. షార్ట్ ఫిలిం మొదలుపెడతారు. కాసేపట్లో నేను స్క్రీన్ పై కనిపిస్తానని గౌతమ్ ఆత్రుతగా ఎదురుచూస్తుండగా...స్కీన్ పై రిషి కనిపిస్తాడు.  గౌతమ్ షాక్ అవుతాడు....ఏంటి వసుధార ఇది అన్యాయం కదా అని గౌతమ్ అంటే..ముందు చూడండి సార్..తర్వాత మాట్లాడుదాం అని రిప్లై ఇస్తుంది. స్క్రీన్ పై రిషి-వసుధారని భార్య-భర్తగా చూసి దేవయాని రగిలిపోతుంది. ధరణి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. అటు మహేంద్ర-జగతి హ్యాపీగా ఫీలవుతూనే... దేవయానిని గమనిస్తుంటారు. 

రేపటి ( మంగళవారం) ఎపిసోడ్ లో
షార్ట్ ఫిలిం ప్లే అయిన తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటారు. అందరూ కలసిన ఫలితమే ఈ విజయం అని జగతి మాట్లాడుతుంది. మీరు మీ వారిని వదిలేశారా,మిమ్మల్ని వారు వదిలేశారా అని దేవయానితో డీల్ కుదుర్చుకున్న రిపోర్టర్ అడుగుతాడు. మిషన్ ఎడ్యుకేషన్ గురించి అడగండి చెబుతాను అని జగతి చెబుతున్నా వినకుండా... మీకు సంతానం కూడా ఉందని విన్నాం, పెళ్లికి ముందే పుట్టారా అంటూ స్టేజ్ పై అవమానించే ప్రయత్నం చేస్తాడు. అక్కడి నుంచి లేచి జగతి వెళ్లిపోతుండగా..నీ భర్తగా చెబుతున్నా ఆగు అన్న మహేంద్ర మాట విని అక్కడున్నవారంతా షాక్ అవుతారు... 

Published at : 28 Feb 2022 09:30 AM (IST) Tags: గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu February 28th Episode 385

సంబంధిత కథనాలు

NTR31: ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్

NTR31: ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్

Ram Charan-NTR: నీతో నా బంధాన్ని మాటల్లో చెప్పలేను - రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్

Ram Charan-NTR: నీతో నా బంధాన్ని మాటల్లో చెప్పలేను - రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్

Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!

Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!

NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు

NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Nara Lokesh : ఎమ్మెల్సీ కారులో మృతదేహం ఘటనపై లోకేశ్ ఫైర్, హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని ఆరోపణ!

Nara Lokesh : ఎమ్మెల్సీ కారులో మృతదేహం ఘటనపై లోకేశ్ ఫైర్, హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని ఆరోపణ!

TTD Darshan Tickets For July, August : జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం

TTD Darshan Tickets For July, August  : జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం

CBI Raids: లాలూ యాదవ్‌కు మరో షాక్- కొత్త అభియోగాలు మోపిన సీబీఐ

CBI Raids: లాలూ యాదవ్‌కు మరో షాక్- కొత్త అభియోగాలు మోపిన సీబీఐ

Covid-19 Cases India: దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు- 20 మంది మృతి

Covid-19 Cases India: దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు- 20 మంది మృతి