Karthika Deepam ఫిబ్రవరి 28 ఎపిసోడ్: మోనిత పద్మవ్యూహంలో చిక్కుకున్న సౌందర్య కుటుంబం

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ ఫిబ్రవరి 28 సోమవారం 1287 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

FOLLOW US: 

కార్తీకదీపం ఫిబ్రవరి28 సోమవారం ఎపిసోడ్

తమ దగ్గరున్న ఆనంద్...మోనిత బిడ్డే అని తెలిసిన దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ విషయం డాక్టర్ బాబుకి ఎలా చెప్పగలను, తమ్ముడు అని సంబరపడుతున్న పిల్లలకు ఏమని సమాధానం చెప్పాలి, నేనైనా వీడిని వదిలి ఎలా ఉండగలను అనుకుంటుంది. నిన్ను వదిలిపెట్టి నేనుకూడా ఉండలేను కదా...ఈ అమ్మని వదిలిపెట్టి వెళ్లిపోతావా అంటుంది. అప్పారావ్ తెచ్చిన ఫొటోస్ అత్తయ్య చూశారంటే..అందులో కోటేష్ ఫొటో చూసింది, కోటేష్ వీడియో కూడా చూసి ఉండొచ్చు..అంటే ఈ విషయం నిజం తెలిసే డాక్టర్ బాబుకి నిజం తెలియకూడదనే సీసీ కెమెరాలో ఉన్న వీడియో ఇవ్వలేదా, ఈ బాధని మీరొక్కరే మోస్తున్నారా అనుకుంటుంది. ఇంత తెలిసి బాధని దిగమింగుతున్నారా మీదెంత గొప్పమనసు అనుకుుంటుంది. ఇంతలో కార్తీక్ కారు వచ్చి అక్కడ ఆగుతుంది. ఏంటి ఇక్కడ కూర్చున్నావ్ అని అడిగితే కూరగాయల కోసం వచ్చానంటుంది. వెంటనే బాబుని చేతిలోకి తీసుకున్న కార్తీక్...ఏరా డీడీకి హలో చెప్పవా అంటూ కబుర్లు చెబుతాడు. కార్తీక్...బాబుతో సంతోషంగా ఉండడం చూసి ఈ నిజం ఎలా చెప్పాలో ఏంటో అనుకుంటుంది. 

Also Read: రిషి-వసుని అలా చూసి ముక్కలైన గౌతమ్ మనసు
మరోవైపు ఇంట్లో ఉన్న ఉయ్యాలలు తీసిపడేస్తుంది. ఏందుకిలా చేస్తున్నారని పనిమనిషి విన్నీ అడిగితే..నీకు జీతం ఇస్తున్నది నేను చెప్పిన పని చేయడానికి అంటుంది. మరోవైపు సౌందర్య ఇంట్లో పిల్లలిద్దరూ బాబుతో ఆడుకుంటారు. తమ్ముడూ నువ్వు తొందరగా పెద్దగా అయిపోతే నిన్ను స్కూల్ కి మాతో పాటూ తీసుకెళతాం అంటుంది హిమ. ఆ మాటలకు గట్టిగా నవ్విన శౌర్య వీడు స్కూల్ కి వెళ్లేసరికి మనం కాలేజీకి వెళతాం అంటుంది. అత్తయ్య మీరెంత గొప్పవాళ్లు నిజం తెలిసి కూడా మీలోనే బాధపడుతున్నారు అనుకుంటుంది. అటు సౌందర్య కూడా అందరూ వీడికి బాగా దగ్గరైపోతున్నారు...మోనిత వచ్చి బాబుని తీసుకెళితే అందరూ ఏమైపోతారో అనుకుంటుంది. ఆనంద్ కి అన్నీ హిమ చేస్తోంది..నన్ను ఆడుకోనివ్వడం లేదని శౌర్య అంటే... తమ్ముడు-నేను ఓ జట్టు అంటుంది హిమ.

మరోవైపు మోనిత...తన బాబాయ్ ని తలుచుకుని కోప్పడుతుంది. బాబాయ్ ఆపరేషన్ అడ్డం పెట్టుకుని కార్తీక్ కి దగ్గరవుదాం అనుకుంటే చెప్పాపెట్టకుండా అమెరికా చెక్కేశాడు. ఆ ప్లాన్ పోతే ఏం... మరో ప్లాన్ సిద్ధంగా ఉంది. నా బిడ్డకి ఇంట్లో అంతా దగ్గరైపోతున్నారు...మీరు వదులుకోలేని స్థాయికి వెళ్లాక నా బిడ్డను నేను తెచ్చేసుకుంటాను ఈ ఆటలో గెలుపు నాదే అంటుంది మోనిత. ఇది దేవుడు నాకిచ్చిన గొప్ప అవకాశం..నిన్ను నేను గెలుచుకుంటా కార్తీక్, నువ్వెంత వెతికినా బాబు నీకు దొరకడు, నువ్వు ఓడిపోతావ్, చివరకు మోనిత ప్రేమ గెలుస్తుందని క్రూరంగా నవ్వుతుంది.

సౌందర్య-దీప: మేడపై ఒంటరిగా నిల్చున్న సౌందర్య... మోనిత-కోటేష్-ఆనంద్ గురించి తలుచుకుంటూ ఈ నిజం చెప్పకుండా ఎన్నాళ్లు దాచాలో అనుకుంటూ బాధపడుతుంది. ఇంతలో అక్కడకు వచ్చిన దీప ని చూసి ఈ సమయంలో బాబుని ఇక్కడకు తీసుకొచ్చావెందుకు అడుగుతుంది.  నేను పుట్టిన ఘడియో, నా జాతకమో, అదృష్టమో, తలరాతో ఏంటో కానీ ఏంటిది అత్తయ్యా..ఈ బాబు చేసిన తప్పేంటి, వీడి ద్వారా మనకు పెద్ద సమస్య ఎదురైంది కదా అని మాట్లాడుతుంది. సౌందర్య షాక్ అయి దీపని చూస్తుండగా...వీడు మోనిత కొడుకు అన్న నిజం మీకు తెలుసని నాకు తెలుసు అంటుంది దీప. నిజం తెలిసి మీరెంత బాధపడ్డారో కానీ...అసలు విషయం తెలిసినప్పటి నుంచీ నాకేం తోచడం లేదంటుంది. మోనిత కొడుకుని ఎవరు తీసుకెళ్లారో ఆ వీడియో మీ దగ్గర ఉంది కదా..ఆ ఆవీడియో సాయంతో డాక్టర్ బాబుకి సాయం చేయొచ్చు కదా..పాపం డాక్టర్ బాబు...మోనితకు తన కొడుకుని అప్పగించి ఆ పీడ వదిలించుకోవాలని ఆశపడుతున్నారు. కానీ ఆ మోనిత కొడుకుమీదే ఇంట్లో వాళ్లంతా ప్రేమను పెంచుకున్నామని ఎలా చెప్పగలం అని ఏడుస్తుంది. 

Also Read: ఆనంద్ విషయంలో దీప ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది
మోనితకి కూడా ఈ విషయం తెలుసు అత్తయ్యా అని మరో షాకిస్తుంది దీప. అంటే..మోనిత అన్నీ తెలిసే మనతో ఆట్లాడుతోందా అంటే...మనం మోనిత పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుపోయాం, వీడిని వదలలేం, మోనితకి అప్పగించలేం, ఏం చేద్దాం అత్తయ్యా అంటుంది. కార్తీక్ కి ఈ విషయం తెలిస్తే అస్సలు తట్టుకోలేడు, అసలే బాబుని వెతికిస్తాం అని మాటిచ్చాడు, పిల్లల గురించి ఆలోచిస్తేనే భయం వేస్తోంది, పిడుగుపడుతుందని తెలిసి కూడా అడుగు వేయలేని స్థితిలో ఉన్నాం...ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొందాం...నా బతుకు ఏంటి ప్రతిసారీ ఇలా ఎందుకు జరుగుతుంది, పదకొండేళ్లు డాక్టర్ బాబుకి దూరమయ్యాను, కలిసిన కొన్నాళ్లకే ఊరొదిరి వెళ్లిపోయాం, ఇప్పుడిలా అయింది...నేను చిరునవ్వు నవ్వితే ఆ దేవుడికి కూడా మంటే...ప్రతిసారీ ఏడిపిస్తాడంటుంది దీప.,

రేపటి ( మంగళవారం) ఎపిసోడ్ లో
మోనిత కాలికి దెబ్బతగులుతుంది..కార్తీక్ ఆ ఇంటికి వెళ్లడంతో పూలతో స్వాగతం పలుకుతుంది మోనిత. హాస్పిటల్ కి దగ్గరుండి మరీ తీసుకెళతాడు... 

Published at : 28 Feb 2022 08:49 AM (IST) Tags: karthika deepam latest episode కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ karthika Deepam Serial Today Episode Vantalakka కార్తీకదీపం Karthika Deepam 28th February Episode 1287 Nirupam Paritala premi viswanathSobha Shetty

సంబంధిత కథనాలు

Prabhas: యాక్షన్ డోస్ పెంచమంటున్న ప్రభాస్ - ఫ్యాన్స్ కోసం నొప్పి కూడా లెక్క చేయకుండా!

Prabhas: యాక్షన్ డోస్ పెంచమంటున్న ప్రభాస్ - ఫ్యాన్స్ కోసం నొప్పి కూడా లెక్క చేయకుండా!

Sriya Lenka: ‘K-పాప్’ ఆర్టిస్ట్‌గా ఇండియన్ అమ్మాయి, కొరియా మొత్తం ఫిదా!

Sriya Lenka: ‘K-పాప్’ ఆర్టిస్ట్‌గా ఇండియన్ అమ్మాయి, కొరియా మొత్తం ఫిదా!

Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం!

Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం!

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

టాప్ స్టోరీస్

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

IPL 2022, GT vs RR Final: లక్షా పదివేల మంది ఎదుట ట్రోఫీ ఎత్తేది ఎవరు? RRపై 2-0తో GTదే పైచేయి!

IPL 2022, GT vs RR Final: లక్షా పదివేల మంది ఎదుట ట్రోఫీ ఎత్తేది ఎవరు? RRపై 2-0తో GTదే పైచేయి!