అన్వేషించండి

Karthika Deepam మార్చి 1 ఎపిసోడ్: మోనిత ఎత్తుకి సౌందర్య-దీప పైఎత్తు, మంగళవారం ఎపిసోడ్ లో ట్విస్ట్ అదిరింది

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మార్చి 1 మంగళవారం 1288 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

కార్తీకదీపం మార్చి 1 మంగళవారం ఎపిసోడ్

హిమ, శౌర్య...ఆనంద్ ని బొమ్మలతో ఆడిస్తుంటారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన దీప-సౌందర్య ఏమీ మాట్లాడలేక ఊరుకుంటారు. మోనిత మేడం ఈ వీడియో చూపించొద్దన్నారన్న రత్నసీత మాటలు గుర్తుచేసుకున్న దీప... అన్నీ తెలిసే మోనిత మాతో ఆడుకుంటోంది, ఆనంద్ విషయంలో ఏదో ప్లాన్ చేస్తోంది అనుకుంటుంది.  ఆనంద్ మనం కారుతో ఆడుకుందామా అంటూ వచ్చిన కార్తీక్ ని చూసి సౌందర్య కూడా మోనిత కొడుకుపై అంతా ప్రేమ పెంచుకుంటున్నారని బాధపడుతుంది. కారుని రిమోట్ తో ఆడించినట్టుగా ఆ మోనిత మమ్మల్ని ఆడిస్తోంది.. మోనిత ప్లాన్ ఏంటి, బాబు ఇక్కడే ఉన్నా ఎందుకు తీసుకెళ్లకుండా ప్లాన్ చేసిందనే ఆలోచనలో ఉంటుంది. బిడ్డపై ఇంత ప్రేమ పెంచుకున్నాక ఈ బిడ్డ మోనిత బిడ్డే అని తెలిస్తే నువ్వు తట్టుకోగలవా అనుకుంటుంది సౌందర్య. 

Also Read: జగతి తన భార్య అని ప్రెస్ మీట్ లో చెప్పేసిన మహేంద్ర, దేవయానికి భారీ షాక్
కార్తీక్-మోనిత: కార్తీక్ కి కాల్ చేసిన మోనిత..ప్రేమ-దోమ అంటూ ఏదేదో మాట్లాడుతుంది. నా బిడ్డ సంగతేంటి వెతుకుతున్నావా అని క్వశ్చన్ చేస్తుంది. అదే పనిలో ఉన్నాను విసిగించకు అని చిరాకు పడతాడు. బాబుని వెతకడంలో నీకు హెల్ప్ చేస్తానంటే...ఎవ్వరి హెల్ప్ నాకు అవసరం లేదు నేనే వెతుకుతాను అంటాడు. ఎందుకింత కోపం నాపై అంటూ బాబుని వెతికే విషయంలో నా దగ్గర కొన్ని ఆధారాలున్నాయంటుంది. నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు ఈ వంకతో నా ఇంటికి రావాలనుకుంటున్నావా అవసరం లేదు..నేనే వచ్చి తీసుకుంటాను అని కాల్ కట్ చేస్తాడు. కార్తీక్ ఇంటికి వస్తానన్న మాట విన్నాక మోనిత గాల్లో తేలిపోతుంది. ఏమైంది మేడం అని పనిమనిషి విన్నీ అడిగితే...ఈ రోజు మా వారు ఇంటికొస్తున్నారంటుంది. ఆనందంతో గెంతులేస్తూ కాలు మడతపడి కింద పడుతుంది. 

సౌందర్య-పిల్లలు: బాబుతో ఆడుకుంటున్న పిల్లలపై సౌందర్య కోప్పడుతుంది. ఎప్పుడు చూసినా ఆడుకోవడమేనా, వెళ్లి చదువుకోండి అంటుంది. శ్రావ్య వాడిని తీసుకెళ్లు అని చెబుతుంది. అస్తమానం వీడితోనే ఉండొద్దు, వాడే లోకంగా ఉంటున్నావ్ అని హిమపై అరుస్తుంది. వెనుకే హిమ వెళుతుంటే...ఆగమన్నాను కదా నువ్వు ఇక్కడే ఉండు...దేనికైనా ఓ హద్దు ఉంటుంది, పిల్లలు పిల్లల్లా ఉండాలంటుంది. తిరిగితే తప్పేంటి, నువ్వు మారిపోయావ్ అన్న హిమ మాట్లాడుతుండగా...తప్పు హిమా అంటూ దీప ఎంట్రీ ఇస్తుంది. తమ్ముడితో ఆడుకుంటే తప్పేంటని మళ్లీ అడగడంతో పెద్దవాళ్లు చెప్పింది వినాలి...ఎదురు ప్రశ్నలు వేయొద్దని గట్టిగా చెబుతుంది దీప. 

మోనిత-కార్తీక్: మోనిత ఇంటికి వెళ్లిన కార్తీక్ కి దగ్గరకు వచ్చిన పనిమనిషి..మేడం మిమ్మల్నే లోపలకు రమ్మన్నారని చెబుతుంది. మోనిత మేడం బయటకు రాలేరు కాలు స్లిప్ అయిందని నడవలేకపోతున్నారని చెబుతుంది. ఇక లోపలకు వెళ్లిన కార్తీక్ కి పూలతో స్వాగతం పలుకుతుంది మోనిత.  బాబుని వెతకడానికి ఆధారాలు ఇస్తా అన్నావ్ కదా అడిగితే..కాఫీ, టీ అని ఏదో మాట్లాడబోతుంది. నీతో మర్యాదలు చేయించుకోవడానికి ఇక్కడకు రాలేదంటాడు. గోడకున్న ఫొటో చూసి ఏంటిది అని రెట్టిస్తే..నేను సృష్టించింది కాదు మనం తీసుకున్న ఫొటోనే అంటుంది. ఈ ఫొటో ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటని అడిగితే..ఆ ఫొటో ఉంది నా ఇంట్లోనే కదా..నా ఆనందం కోసం పెట్టుకున్నా అంటుంది. ఏదేదో మాట్లాడుతున్న మోనితతో..ఆధారాలివ్వు అని అడుగుతాడు. మనం హాస్పిటల్ కి వెళ్లాలి..ఓ లిస్ట్ తీసుకోవాలని చెబుతుంది. పద వెళదాం అంటే..నువ్వెందుకు నేను వెళతాను అంటాడు. బాబు మిస్సవడానికి ముందు అక్కడ హాస్పిటల్లో డెలివరీకి వచ్చిన వాళ్ల లిస్ట్ రెడీ చేయమని చెప్పానంటుంది. కార్తీక్, మోనిత హాస్పిటల్ కి వెళతారు.

Also Read:మోనిత పద్మవ్యూహంలో చిక్కుకున్న సౌందర్య కుటుంబం
సౌందర్య-దీప: తాడికొండ నుంచి వచ్చిన కొత్తలో వాడిని, మమ్మల్ని ప్రేమగా చూసుకున్నావ్ ఇప్పుడు ఏమైందన్న హిమ మాటలు గుర్తుచేసుకున్న సౌందర్య...ఈ నిజాన్ని ఎక్కువ రోజులు దాచలేం దీప అంటుంది. రేపు ఏదో ఒక విధంగా ఆనంద్ మోనిత కొడుకు అని తెలిస్తే పరిస్థితేంటి అంటుంది. కల్పించుకున్న ఆనందరావు...ఇప్పుడే మనం చెప్పలేనప్పుడు అప్పుడేం చేయగలం అంటాడు. మోనిత కొడుకని పిల్లలకు తెలిస్తే...ఆ తర్వాత ..డాక్టర్ బాబు కొడుకే ఆనంద్ అని చెబితే ఏం చేస్తాం అంటుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు..ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం వేస్తోందని సౌందర్య వాపోతుంది. మరోవైపు హాస్పిటల్ కి వెళ్లిన మోనిత, కార్తీక్... డెలివరీ లిస్టులు కలెక్ట్ చేస్తుంటుంది. ఎన్ని హాస్పిటల్స్ తిరగాలని కార్తీక్ అంటే..ఈ పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ముందే బాబు మిస్సయ్యాడు. డబ్బుకోసం ఎత్తుకెళితే ఈ పాటికి ఫోన్ చేసేవారు...అలా కాల్ చేయలేదంటే...ఎవరికో బాబు, పాప పుట్టి చనిపోతే తీసుకెళ్లి ఉంటారంటుంది. ఈ లిస్టు చూడు అంటూ చేతికిస్తుంది. అందులోంచి కోటేష్-శ్రీవల్లి పేర్లు తీసేశాను అంటూ వికృతంగా నవ్వుకుంటుంది.

రేపటి ( బుధవారం) ఎపిసోడ్ లో
మోనిక ఎత్తుకి పై ఎత్తు వేసిన సౌందర్య ...బాబు..దత్తత ఇచ్చే కార్యక్రమం మొదలెడుతుంది. ఇంతలో అక్కడకు వచ్చిన మోనిత...ఆపండి అని అరిచి...బాబుని దత్తత ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తుంది. ఆనంద్ ని మనం దత్తత ఎందుకిస్తాం అని కార్తీక్ అడిగితే...పిల్లలు లేనివారికి ఆనంద్ ని దత్తత ఇస్తున్నాం అంటుంది సౌందర్య. ఇందుకు నేనొప్పుకోను అని మోనిత అరవడంతో... నువ్వెవరే ఒప్పుకోపోవడానికి అని ప్రశ్నిస్తుంది సౌందర్య. నేను వాడి కన్న తల్లిని అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు...

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Bank Defaulters: లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP DesamICC Champions Trophy 2025 Schedule | పంతం నెగ్గించుకున్న బీసీసీఐ | ABP Desamదోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Bank Defaulters: లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
Embed widget