By: ABP Desam | Updated at : 03 Feb 2022 09:16 AM (IST)
Edited By: RamaLakshmibai
guGuppedantha Manasu February 3rd Episode (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంతమనసు ఫిబ్రవరి 3 గురువారం ఎపిసోడ్
సంక్రాంతి సంబరాల్లో అంతా మునిగితేలుతుంటే దేవయాని మాత్రం అందర్నీ చూసి రగిలిపోతుంటుంది. ఆ ఆనందంలో ఉన్న జగతి కొత్త బట్టలు తీసి వసుధారకి ఇస్తుంది. నువ్వు ఏం చెప్పి అయినా రిషి వేసుకునేలా చేయమని కోరుతుంది. ఇదంతా విన్న దేవయాని కొడుక్కి కొత్త బట్టలు ఇస్తావా.. వీటితోనే నీన్ను ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తాను అనుకుంటుంది. మరోవైపు వసుధార తన రూమ్ కి రమ్మని రిషికి కబురు పెడుతుంది. కాలు నొప్పి పెడుతోందా ఏదైనా అవసరమా అని రిషి అంటే.. నాకో గిఫ్ట్ ఇవ్వండి అని అడుగుతుంది. నాకు రెండు మాటలు ఇవ్వండి అని అడుగుతుంది. అందులో ఒకటి నేనిచ్చే గిఫ్ట్ తీసుకోవాలి అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అంటుంది. చాలా తెలివిగా ఆలోచిస్తున్నావ్ వసుధార అనగానే ప్లీజ్ సార్ తీసుకోండి అంటుంది. కశ్చీఫ్, పెన్ను ఇలాంటి జ్ఞాపకాలేమైనా ఉన్నాయా అన్న రిషికి.. జగతి ఇచ్చిన డ్రెస్ ఇస్తుంది వసుధార. గిఫ్ట్ వద్దనకుండా ముందే ఒప్పించి ఇస్తున్నావ్ కదా అని తీసుకున్న రిషి..థ్యాంక్యూ అంటాడు.
Also Read: డాక్టర్ బాబు ఆపరేషన్ చేసి కూతుర్ని బతికించాడు.. కానీ మోనితకి దొరికిపోయినట్టేనా... కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
మరి రెండోది ఏంటో అని రిషి అడగ్గానే.. ఓ బాటిల్లో చిట్టీలు చూపిస్తుంది. వీటిలో ఎస్ అని కొన్ని, నో అని కొన్ని రాశాను.. ఎవరికి ఎక్కువ ఎస్ లు వస్తాయో వాళ్లు గెలుస్తారు.. ఈ ఆటలో ఎవరు ఓడిపోతారో వాళ్లు గెలిచిన వాళ్ల మాట వినాలంటుంది. చిన్నప్పుడు ఊర్లో పిల్లలందరితో టీచర్ అని పిలిపించుకునేదాన్ని అంటుంది. ఈ ఆటలో నేను గెలిస్తే వసుని ఏం అడగాలి అనే ఆలోచనతో చిట్టీల ఆడ ఆడుతాడు రిషి. ఈ గేమ్ లో వసుధారకి ఎక్కువ ఎస్ లు రావడంతో గెలుస్తుంది. నన్ను పిలిచి ఆడించి ఓడించావ్ కదా అన్న రిషితో.. సరదాగా ఇలా ఆడితే బావుంటుందని ఆడమన్నా అంటుంది. సరే ఇప్పుడు నువ్వు గెలిచావ్ ఈ రోజు నాకు ఏం ఆర్డర్ వేస్తున్నావ్ అంటే.. ఓ చిన్న మాట ఇవ్వండి చాలని అడుగుతుంది. ఏమాట అన్న రిషి నా మనసు ఒప్పుకోనివి అడగొద్దని రిషి అంటే.. ఆట ఆంటే ఆటే చెప్పింది చేయాలంటుంది.
Also Read: పాయసం పంచుకున్న రిషి-వసు.. జగతిపై దేవయాని మరోకుట్ర.. గుప్పెడంతమనసు బుధవారం ఎపిసోడ్..
ఈ రోజంతా మీరు జగతి మేడంని అమ్మా అని పిలవాలి అని అడుగుతుంది. కోపంగా పైకి లేచిన రిషి..నో అలా పిలవను అని ప్రస్ట్రేట్ అవుతాడు. సార్ ఎందుకిలా అని వసు పిలవడంతో.. నువ్వేమైనా చెప్పావా అంటే..ఇంకా లేదంటుంది (జగతి మేడంని అమ్మా అని పిలవాలని వసు చెప్పినట్టు రిషి ఊహించుకుంటాడు). పండుగ రోజు మీరు ఏ విషయంలోనూ కోపగించుకోవద్దని అడుగుతుంది. ఏదో అడుగుతావనుకున్నా ఇంత సింపిల్ గా అడిగావేంటని రిషి అంటే.. ఇది చాలు నాకు ఎవరేమన్నా మీరు కోపం తెచ్చుకోవద్దు అంటుంది. బట్టలు చూసి సెలెక్షన్ ఎలా ఉందో చెప్పండని అడిగితే అవసరం లేదంటాడు. మరి నా సెలక్షన్ ఎలా ఉందో చెప్పవా అంటే..ఈ లంగాఓణీ నేనే తీసుకొచ్చానంటాడు. నిజమా సార్..చాలా బావుంది సార్ ..నేను మహేంద్ర సార్ కొన్నారనుకున్నా అంటుంది. వసుకి థ్యాంక్స్ చెప్పేసి వెళ్లిపోతాడు రిషి. సార్ నాకు తెలియకుండానే పండుగకి గిఫ్ట్ ఇచ్చారా.. థ్యాంక్స్ చెప్పకుండానే వెళ్లిపోయారే అనుకుంటుంది.
Also Read: మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ… జోరందుకున్న రిషి-వసు లవ్ ట్రాక్, గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్
ధరణి, జగతి..పండివంటలన్నీ సిద్ధం చేస్తారు. డైలీ నేను ఈ వంటగదిలోనే మీ గురించి ఆలోచించేదాన్ని, మీరంటే నాకు చాలా ఇష్టం , అత్తయ్యగారు ఎన్ని మాటలు అన్నా మిమ్మల్ని తలుచుకుంటే ధైర్యం వచ్చేస్తుంది అంటుంది ధరణి. ఎప్పటికీ మీరు ఇక్కడే ఉండిపోవాలి అంటుంది. గుడికి వచ్చి నమస్కారం చేసుకుని వెళ్లాలి కానీ ఉండిపోవాలి అనుకోకూడదంటుంది జగతి. గతంలో నా కొడుకు ఎలా ఉన్నాడో అనుకునేదాన్ని..ఇప్పుడు రోజూ చూస్తున్నా అది చాలంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన దేవయాని ..ఏంటీ ఇద్దరూ కష్టాలు చెప్పుకుంటున్నారా, నన్ను తిట్టుకుంటున్నారా అంటే.. అడవికి వెళ్లి నెమలిని చూడాలనుకుంటాం కానీ సింహం, పులులు ఎదురవాలి అనుకోం కదా అని కౌంటర్ ఇస్తుంది జగతి. రేపో మాపో వెళ్లిపోయే జగతిని చూసి సంబరపడకు ధరణి అని దేవయాని అంటే..ఎవ్వరైనా వెళ్లిపోవాల్సిందే అది గుర్తుపెట్టుకుంటే అహంకారం తగ్గుతుందంటుంది జగతి. తన దగ్గర ఏమైనా నేర్చుకుంటే తనలానే నీ జీవితం అయిపోతుందని ధరణికి చెబుతుంటే..ఇప్పుడు తన జీవితం ఏదో అద్భుతంగా ఉందా అని అడుగుతుంది జగతి. నాలుగు రోజులు ఇక్కడే ఉంటే నిన్ను కూడా నాకు వ్యతిరేకంగా మార్చేస్తుంది వెళ్లు అని చెబుతుంది. అడుగుపెట్టావని విర్రవీగకు జగతి.. అడుగడుగునా నీకు అడ్డుపడేందుకు నేనున్నాని గుర్తుపెట్టుకో, హద్దుల్లో ఉంటే మంచిదంటుంది దేవయాని. మీకు ఇష్టమైన గీతలు గీసి వాటిని హద్దులు అంటే ఎలా..నేను ఇక్కడివరకూ వచ్చానని భయపడుతున్నారా అనేసి జగతి వెళ్లిపోతుంది.
రేపటి (శుక్రవారం) ఎపిసోడ్ లో
పండుగరోజు అందరూ ఇలా కొత్తబట్టలతో చిరునవ్వులతో కనిపిస్తుంటే చాలా బావుందని ఫణీంద్ర అంటాడు. రిషి నీ డ్రెస్ చాలా బావుందంటాడు గౌతమ్. ఈ డ్రెస్ సెలెక్షన్ ఎవరిది అంటే అది జగతి సెలెక్షన్ అంటుంది దేవయాని. అంతా షాక్ అయి చూస్తుంటారు...
Also Read: చెప్పకనే చెబుతున్నా ఇదే ఇదే ప్రేమని అన్నట్టున్న వసు-రిషి, ఊహల్లో గౌతమ్... గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్..
Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే
Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!
Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!
Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?
Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్ఫ్లవర్ ఆయిల్ ధరపై..!