IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Guppedantha Manasu December 23 Episode: వసుధారపై ప్రేమ.. జగతిపై కోపం.. చెలరేగిపోతున్న ఈగో మాస్టర్.. గుప్పెడంత మనసు డిసెంబరు 23 ఎపిసోడ్

గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. వసుతో సారీ చెప్పించాలని ఫిక్సైన రిషి ఆమెను బయటకు తీసుకెళతాడు. అక్కడి నుంచి వచ్చాక జగతికి పెద్ద షాకిచ్చాడు.డిసెంబరు 23 గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంత మనసు డిసెంబరు 23 గురువారం ఎపిసోడ్

రిషి-వసుధార:
వసుధారతో మాట్లాడేందుకు బయటకు తీసుకెళ్లిన రిషి ఓ గ్రౌండ్ లో కారు ఆపి దిగమని చెబుతాడు.  నేను-మేడం సారీ చెప్పమన్నా చెప్పేది లేదన్న వసుధార మాటలు గుర్తుచేసుకున్న రిషి... తప్పు చేశావ్ వసుధార పెద్దమ్మ విషయంలో తప్పు చేశావ్ అంటాడు. మధ్యలో మాట్లాడేందుకు ప్రయత్నించినా కనీసం చెప్పేమాట కూడా వినడు. తానేమీ చేయకుండానే మీ పెద్దమ్మ పడిపోయారని అంటుంది. నువ్వు పెద్దమ్మ వైపు వేలుచూపి తిట్టావ్, ఆవిడపై అరిచావ్... ఆమె ఏదైనా అని ఉండొచ్చు దానికి మీరు అంతలా రియాక్టవ్వాలా... ఈ విషయంలో నేను చెప్పాల ని వచ్చాను, నువ్వు చెప్పేది వినాలని కాదని ఆగకుండా మాట్లాడతాడు రిషి. పెద్దమ్మని కిందపడేశావ్, కనీసం సారీ చెప్పలేదు అంటాడు. అప్పడు మాట్లాడిన వసుధార.. ఆవిడ మీకు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ ఆవిడని మేం అగౌరవ పరచలేదు.. తప్పు నావైపు ఉంటే సారీ చెప్పేదాన్ని .. తప్పు నావైపు లేదుకాబట్టే సారీ చెప్పడం లేదని మరోసారి క్లారిటీ ఇస్తుంది వసుధార. సారీ చెప్పలేదు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలెయ్..మా పెద్దమ్మే నాజీవితం తనని బాధపెడితే నేను వందరెట్లు బాధపడతా అంటాడు. ఆ రోజు ఏవేవో ఫొటోలు చూపించి నోటికొచ్చినట్టు మాట్లాడారు అంటుంది వసుధార...నేను చెప్పింది విను అన్న తను ఏం చేసినా అన్నీ నాకోసమే అంటాడు. కనీసం వసుని మాట్లాడనివ్వడు. పెద్దమ్మని గౌరవించకపోతే ఊరుకోను అంటాడు. 

Also Read: వసుధారని ఇంట్లోంచి పంపించేయాలని జగతికి షాకిచ్చిన రిషి.. గుప్పెడంత మనసు డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్
కాలేజీలో సీన్ ఓపెన్ అయ్యింది: రిషి పొద్దున్నే ఇంటికి వచ్చాడా...ఎందుకు వచ్చాడు జగతి అంటాడు మహేంద్ర. నువ్వు పట్టించుకోలేదన్న జగతితో...నాకేం తెలుసు అంటాడు మహేంద్ర. రిషి మూడ్ ఎలా ఉందో అన్న మహేంద్రపై ఫైర్ అవుతుంది. తను ఎలా ఉన్నాడో నువ్వు చెప్పాలి అంటుంది. పక్కనే ఉన్నా తనలో మనసులో తొందిచూసే అవకాశం ఇవ్వడని మహేంద్ర చెబుతాడు. రిషి రోజురోజుకీ చిక్కు లెక్కలా మారిపోతున్నాడు మహేంద్ర..తన మనసులో డౌట్స్ క్లియర్ చేసే ప్రయత్నం చేయాలికదా అంటుంది జగతి. 

Also Read: రిషిని ఆలోచనలో పడేసిన మహేంద్ర మాటలు, వసు విషయంలో రిషి తీరుపై గౌతమ్ కి బోలెడు డౌట్స్, గుప్పెడంత మనసు డిసెంబరు 21 మంగళవారం ఎపిసోడ్…
దేవయాని ఇంట్లో:
అప్పటి వరకూ కాలూపుకుంటూ పడుకున్న దేవయాని..రిషి రావడం చూసి కాలు నొప్పి అంటూ యాక్షన్ చేస్తుంది. రిషి దగ్గరుండి సపర్యలు చేస్తాడు. ధరణి ఉంది కదా నువ్వు తీసుకురావాలా అని బిల్డప్ ఇస్తుంది. అంతమంది ముందు నన్ను అవమానించారని రెస్టారెంట్లో జరిగిన సిట్యుయేషన్ గుర్తుచేసి రిషిని రెచ్చగొడుతుంది. నా కళ్లముందే జరిగింది కదా నేను ఊరుకోను పెద్దమ్మ అంటాడు రిషి. నాకు కావాల్సింది ఇదే కదా అనుకుని నవ్వుకుంటుంది .

Also Read: వసు దగ్గర తగ్గలేక, నెగ్గలేక రిషి పాట్లు.. వసుధారకి క్లోజ్ అవుతున్న గౌతమ్.. గుప్పెడంత మనసు డిసెంబరు 20 సోమవారం ఎపిసోడ్
కాలేజీలో:
క్లాస్ రూమ్ లో ఉన్న రిషి..వసుధార కనిపించకపోవడంతో వెతుకుతాడు. ఇంతలో వసు ...కమిన్ సార్ అంటుంది. వసు నోట్ బుక్ ఇవ్వు అని అడగడంతో బ్యాగ్ లోంచి బుక్ తీస్తుండగా గోళీలన్నీ కిందపడతాయి. వాటిపైనుంచి జారి పడిపోతుంది వసుధార. పైకి నిల్చునేందుకు హెల్ప్ చేసిన రిషి ముందుకు చూసి నడువు ఎవరిపైన అయినా పడతావ్ అంటాడు. జగతిని తన రూమ్ కి పిలిచిన రిషి..మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి డిస్కస్ చేస్తాడు. ఆ తర్వాత వసు గురించి మీతో మాట్లాడాలి అని చెప్పి ఆగమంటాడు. వసు ఏమైనా తప్పు చేసిందా అని అడుగుతుంది,. వసుధార తప్పు చేయదు మేడం అన్న రిషి..నా మనసులో ఉన్న మాట చెప్పాలని అనుకుంటున్నా అంటాడు.  నా మనసులో మాట చెప్పాలని అనుకుంటున్నా అనగానే ..వసు ని ప్రేమిస్తున్నా అనే మాట చెప్పబోతున్నాడా అనుకుంటుంది. కానీ రిషి పెద్ద షాకిస్తూ..వసుధారని మీ ఇంట్లో నుంచి పంపించేయండి మేడం అంటాడు. ఎందుకు ఏంటి అని వివరాలు అడగొద్దు..నాకుండే కారణాలు నాకున్నాయంటాడు. ఎవరెవరో గొడవల వల్ల తనని తాను కోల్పోవడం నాకిష్టం లేదంటాడు. అప్పుడే అక్కడకు వస్తుంది వసుధార. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది. 

Also Read: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్
Also Read: సారీ చెప్పమంటున్న రిషి.. చెప్పేదే లే అంటున్న వసుధార... మిషన్ ఎడ్యుకేషన్ ఫొటోస్ లో రిషి-నువ్వే ఉన్నారు జగతి మేడం కనిపించలేదన్న గౌతమ్, గుప్పెడంత మనసు డిసెంబరు 18 శనివారం ఎపిసోడ్
Also Read: శౌర్య, హిమపై కన్నేసిన రుద్రాణి, కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్ బాబు, దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం డిసెంబరు 20ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read:  దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 23 Dec 2021 09:08 AM (IST) Tags: గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Saturday Episode గుప్పెడంత మనసు Guppedantha Manasu Upcoming story Guppedantha Manasu Written Update Turns and Twists in Guppedantha Manasu Upcoming episode of Guppedantha Manasu Upcoming story of Guppedantha Manasu Upcoming turns and twists ahead in story of Guppedantha Manasu Guppedantha Manasu Upcoming track Guppedantha Manasu Daily Serial Guppedantha Manasu Today Episode Guppedantha Manasu December 23 Episode గుప్పెడంత మనసు డిసెంబరు 23 ఎపిసోడ్ Written update of Guppedantha Manasu

సంబంధిత కథనాలు

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్?

Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్?

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!

RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా: చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా: చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!

RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!

Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!

Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!

KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో  తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం